Tirumala: తిరుమల శ్రీవారికి విద్యుత్ బస్సు, యాపిల్ టాబ్స్ విరాళంగా అందించిన నీరా రాడియా! Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భారీ భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటల సమయం! Tirumala: తిరుమలలో పోటెత్తిన భక్తజనం.. అన్ని కంపార్ట్మెంట్లు ఫుల్! Srisailam: శ్రీశైలం వెళ్తున్నారా... అప్పటి వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!! Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 12 గంటల సమయం! Char Dham: ఉత్తరాఖండ్‌లో ఆరెంజ్ అలర్ట్.. చార్‌ధామ్ యాత్రికులకు హెచ్చరిక! TTD Latest Updates: శ్రీవారి భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్.. క్యూ లైన్లలో సరికొత్త 'రీ-ఎంట్రీ' విధానం అమలు! Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల భారీ రద్దీ.. 24 గంటల నిరీక్షణ! Srivani Tickets: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్... మరో మూడు విమానాశ్రయాల్లో శ్రీవాణి టికెట్లు! TTD UPdates: తిరుమల యాత్రికులకు అలర్ట్: సర్వదర్శనం టోకెన్లు లేకుంటే 24 నుండి 30 గంటల వేచింపు ఖాయం! Tirumala: తిరుమల శ్రీవారికి విద్యుత్ బస్సు, యాపిల్ టాబ్స్ విరాళంగా అందించిన నీరా రాడియా! Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భారీ భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటల సమయం! Tirumala: తిరుమలలో పోటెత్తిన భక్తజనం.. అన్ని కంపార్ట్మెంట్లు ఫుల్! Srisailam: శ్రీశైలం వెళ్తున్నారా... అప్పటి వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!! Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 12 గంటల సమయం! Char Dham: ఉత్తరాఖండ్‌లో ఆరెంజ్ అలర్ట్.. చార్‌ధామ్ యాత్రికులకు హెచ్చరిక! TTD Latest Updates: శ్రీవారి భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్.. క్యూ లైన్లలో సరికొత్త 'రీ-ఎంట్రీ' విధానం అమలు! Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల భారీ రద్దీ.. 24 గంటల నిరీక్షణ! Srivani Tickets: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్... మరో మూడు విమానాశ్రయాల్లో శ్రీవాణి టికెట్లు! TTD UPdates: తిరుమల యాత్రికులకు అలర్ట్: సర్వదర్శనం టోకెన్లు లేకుంటే 24 నుండి 30 గంటల వేచింపు ఖాయం!

Tirumala Devotees: గతేడాదితో పోలిస్తే 4.57 శాతం పెరిగిన తిరుమల భక్తుల సంఖ్య! కారణం ఇదే..

Tirumala Devotees: తిరుమలలో గత ఏడాదితో పోలిస్తే భక్తుల సంఖ్య మరియు హుండీ ఆదాయం గణనీయంగా పెరిగాయి. దళారీ వ్యవస్థను అరికట్టడానికి ప్రవేశపెట్టిన 'దర్శనం ఉంటేనే గది' విధానం వల్ల భక్తులకు వసతి సౌకర్యాలు మెరుగుపడటమే కాకుండా పారదర్శకత పెరిగిందని టీటీడీ తెలిపింది.

Published : 2026-04-13 11:13:00

Devotional- వారి హుండీకి కాసుల వర్షం: ఈ ఏడాది రూ.1,420 కోట్ల ఆదాయం నమోదు…

గదుల కేటాయింపులో దళారీ వ్యవస్థకు చెక్.. 'దర్శనం ఉంటేనే గది' విధానం సక్సెస్…

టీటీడీ చరిత్రలో నవశకం.. రోజుకు సగటున 73 వేల మందికి పైగా దర్శనాలు…

Tirumala Devotees: గత రెండేళ్లతో పోలిస్తే తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగింది. 2025-26 సంవత్సరంలో ఏకంగా 2 కోట్ల 66 లక్షల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 4.57 శాతం వృద్ధిని సూచిస్తోంది. గతంలో సగటున రోజుకు 70 వేల మంది దర్శనం చేసుకునేవారు కాగా, ఇప్పుడు ఆ సంఖ్య 73 వేలకు చేరింది. భక్తుల రద్దీకి అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పలు కీలక మార్పులను చేపట్టింది.

ముఖ్యంగా తిరుమలలో గదుల కేటాయింపులో దళారీ వ్యవస్థను అరికట్టేందుకు టీటీడీ కఠిన చర్యలు తీసుకుంది. గతంలో దర్శనంతో సంబంధం లేకుండా గదులు ఇచ్చేవారు, దీనిని ఆసరాగా చేసుకుని కొందరు అక్రమార్కులు గదులను బ్లాక్ చేసి భక్తులకు అధిక ధరలకు విక్రయించేవారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 'దర్శనం ఉంటేనే గది కేటాయింపు' అనే విధానాన్ని అమలు చేస్తోంది. దీనివల్ల బ్లాక్ మార్కెట్ పూర్తిగా అగిపోయిందని, లడ్డు ప్రసాదం నాణ్యత మరియు రుచి కూడా పెరిగిందని అధికారులు పేర్కొంటున్నారు.

శ్రీవారి హుండీ ఆదాయం కూడా గతేడాదితో పోలిస్తే 5.25 శాతం పెరిగింది. గత సంవత్సరం రూ.1,345 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది అది రూ.1,420 కోట్లకు చేరింది. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా క్యూ లైన్ల నిర్వహణను పర్యవేక్షించడం, గదుల కేటాయింపులో పారదర్శకత తీసుకురావడం వంటి చర్యల వల్లే భక్తుల సంఖ్య మరియు ఆదాయం పెరిగిందని టీటీడీ వర్గాలు వెల్లడించాయి. సామాన్య భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా టీటీడీ తన పాలనను కొనసాగిస్తోంది.

Spotlight

Read More →