Tirumala: తిరుమల శ్రీవారికి విద్యుత్ బస్సు, యాపిల్ టాబ్స్ విరాళంగా అందించిన నీరా రాడియా! Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భారీ భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటల సమయం! Tirumala: తిరుమలలో పోటెత్తిన భక్తజనం.. అన్ని కంపార్ట్మెంట్లు ఫుల్! Srisailam: శ్రీశైలం వెళ్తున్నారా... అప్పటి వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!! Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 12 గంటల సమయం! Char Dham: ఉత్తరాఖండ్‌లో ఆరెంజ్ అలర్ట్.. చార్‌ధామ్ యాత్రికులకు హెచ్చరిక! TTD Latest Updates: శ్రీవారి భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్.. క్యూ లైన్లలో సరికొత్త 'రీ-ఎంట్రీ' విధానం అమలు! Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల భారీ రద్దీ.. 24 గంటల నిరీక్షణ! Srivani Tickets: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్... మరో మూడు విమానాశ్రయాల్లో శ్రీవాణి టికెట్లు! TTD UPdates: తిరుమల యాత్రికులకు అలర్ట్: సర్వదర్శనం టోకెన్లు లేకుంటే 24 నుండి 30 గంటల వేచింపు ఖాయం! Tirumala: తిరుమల శ్రీవారికి విద్యుత్ బస్సు, యాపిల్ టాబ్స్ విరాళంగా అందించిన నీరా రాడియా! Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భారీ భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటల సమయం! Tirumala: తిరుమలలో పోటెత్తిన భక్తజనం.. అన్ని కంపార్ట్మెంట్లు ఫుల్! Srisailam: శ్రీశైలం వెళ్తున్నారా... అప్పటి వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!! Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 12 గంటల సమయం! Char Dham: ఉత్తరాఖండ్‌లో ఆరెంజ్ అలర్ట్.. చార్‌ధామ్ యాత్రికులకు హెచ్చరిక! TTD Latest Updates: శ్రీవారి భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్.. క్యూ లైన్లలో సరికొత్త 'రీ-ఎంట్రీ' విధానం అమలు! Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల భారీ రద్దీ.. 24 గంటల నిరీక్షణ! Srivani Tickets: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్... మరో మూడు విమానాశ్రయాల్లో శ్రీవాణి టికెట్లు! TTD UPdates: తిరుమల యాత్రికులకు అలర్ట్: సర్వదర్శనం టోకెన్లు లేకుంటే 24 నుండి 30 గంటల వేచింపు ఖాయం!

Tirumala: తిరుమల శ్రీవారికి విద్యుత్ బస్సు, యాపిల్ టాబ్స్ విరాళంగా అందించిన నీరా రాడియా!

Tirumala: తిరుమల శ్రీవారిపై భక్తి భావంతో ప్రముఖ పారిశ్రామికవేత్త నీరా రాడియా టీటీడీకి విద్యుత్ బస్సు, 15 యాపిల్ టాబ్స్‌ను విరాళంగా అందజేశారు. శుక్రవారం తిరుమలలో జరిగిన ఈ కార్యక్రమం భక్తి, సేవాభావాలకు ప్రతీకగా నిలిచింది.

Published : 2026-05-30 10:57:00

టీటీడీకి ఎలక్ట్రిక్ బస్సు బహూకరించిన నీరా రాడియా..

శ్రీవారి ఆలయం ఎదుట విద్యుత్ బస్సుకు ప్రత్యేక పూజలు..

తిరుమల శ్రీవారిపై భక్తి భావంతో ప్రముఖ పారిశ్రామికవేత్త నీరా రాడియా టీటీడీకి విద్యుత్ బస్సు, 15 యాపిల్ టాబ్స్‌ను విరాళంగా అందజేశారు. శుక్రవారం తిరుమలలో జరిగిన ఈ కార్యక్రమం భక్తి, సేవాభావాలకు ప్రతీకగా నిలిచింది. శ్రీవారి ఆలయం ఎదుట కొత్తగా అందించిన విద్యుత్ బస్సుకు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బస్సు తాళాలు, యాపిల్ టాబ్స్‌ను టీటీడీ ఛైర్మన్ మరియు అదనపు ఈవో వెంకయ్యచౌదరికి నీరా రాడియా అధికారికంగా అందజేశారు.

ఈ సందర్భంగా టీటీడీ అధికారులు నీరా రాడియాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భక్తుల సేవలో ఆధునిక సౌకర్యాలను మరింత విస్తరించేందుకు ఈ విరాళం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా విద్యుత్ బస్సుల వినియోగం వల్ల కాలుష్యం తగ్గడమే కాకుండా తిరుమలలో పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతుందని తెలిపారు.

టీటీడీ అదనపు ఈవో వెంకయ్యచౌదరి మాట్లాడుతూ ప్రస్తుతం టీటీడీ వద్ద మొత్తం 20 ధర్మరథం బస్సులు ఉన్నాయని, అందులో ఇప్పటికే 14 విద్యుత్ బస్సులు సేవలందిస్తున్నాయని వెల్లడించారు. భవిష్యత్తులో డీజిల్ బస్సుల స్థానంలో పూర్తిగా విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టే దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. తిరుమలలో గ్రీన్ ఎనర్జీ వినియోగాన్ని పెంచేందుకు టీటీడీ కట్టుబడి ఉందన్నారు.

అలాగే విద్యార్థులు, అధికారుల సేవల కోసం అందించిన 15 యాపిల్ టాబ్స్ కూడా టీటీడీ పరిపాలనలో సాంకేతిక సేవలను మరింత బలోపేతం చేయనున్నాయని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, వేద పండితులు, భక్తులు పాల్గొన్నారు.

Spotlight

Read More →