తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటల సమయం!
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం ఉచిత సర్వదర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోగా, శిలాతోరణం వరకు భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు.
శిలాతోరణం వరకు క్యూలైన్.. స్వామివారి దర్శనం కోసం భారీగా తరలివచ్చిన భక్తులు..
శ్రీవారి దర్శనానికి పెరిగిన భక్తుల రద్దీ.. రూ.3.58 కోట్ల హుండీ ఆదాయం..
తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం ఉచిత సర్వదర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోగా, శిలాతోరణం వరకు భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు.
ఉదయం 8 గంటల తర్వాత సర్వదర్శనం క్యూలో చేరే భక్తులకు స్వామివారి దర్శనానికి సుమారు 22 నుంచి 24 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు 4 నుంచి 6 గంటల సమయం పడుతుండగా, సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు 5 నుంచి 8 గంటల సమయం పడుతోంది.
భక్తుల సౌకర్యార్థం టీటీడీ అధికారులు అవసరమైన ఏర్పాట్లు కొనసాగిస్తున్నారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు తాగునీరు, అన్నప్రసాదాలు వంటి సదుపాయాలు అందిస్తున్నారు. గత రోజు స్వామివారిని 74,128 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి మొక్కులు చెల్లిస్తూ 36,053 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ద్వారా భక్తులు సమర్పించిన కానుకల ఆదాయం రూ.3.58 కోట్లుగా నమోదైంది.
అలాగే భక్తుల కోసం 3.98 లక్షల లడ్డూలను విక్రయించారు. తిరుమలలో భక్తులకు అందిస్తున్న అన్నప్రసాద సేవలను పెద్ద సంఖ్యలో భక్తులు వినియోగించుకున్నారు. నిన్న ఒక్కరోజే 2.75 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాలు స్వీకరించారు. అదేవిధంగా కొండపై వైద్య సదుపాయాలను వినియోగించుకున్న భక్తుల సంఖ్య 3,745గా నమోదైంది. భక్తుల రద్దీ దృష్ట్యా శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తమ ప్రయాణాన్ని ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Be the first to react