భక్తులకు గుడ్‌న్యూస్.. భద్రాచలం ఆలయ రూపురేఖలు మార్చే మెగా ప్రాజెక్ట్ ప్రారంభం! రూ. 200 కోట్ల భారీ బడ్జెట్‌తో..
ఎన్నో ఏళ్లుగా నిలిచిపోయిన భద్రాద్రి ఆలయ మాస్టర్ ప్లాన్ కల సాకారమయ్యే దిశగా అడుగులు పడ్డాయి. భద్రాద్రి క్షేత్ర అభివృద్ధి పనులకు నేడు శ్రీకారం చుట్టారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ అంకిత్ ఆలయ పరిసరాల్లో శాస్త్రోక్తంగా భూమిపూజ నిర్వహించి ఈ మెగా ప్రాజెక్టును అధికారికంగా ప్రారంభించారు.
- Devitional: వచ్చే ఏడాది శ్రీరామ నవమి నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యం..
- భూమిపూజ నిర్వహించిన ఎమ్మెల్యే వెంకట్రావు, జిల్లా కలెక్టర్ అంకిత్..
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలంలో ఎన్నో ఏళ్లుగా నిలిచిపోయిన భద్రాద్రి ఆలయ మాస్టర్ ప్లాన్ కల ఎట్టకేలకు సాకారమయ్యే దిశగా కీలక అడుగులు పడ్డాయి. దక్షిణ అయోధ్యగా పిలవబడే భద్రాద్రి క్షేత్ర సమగ్ర అభివృద్ధి పనులకు శనివారం నాడు ఘనంగా శ్రీకారం చుట్టారు. స్థానిక భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆలయ పరిసరాల్లో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా భూమిపూజ నిర్వహించి ఈ మెగా ప్రాజెక్టును అధికారికంగా ప్రారంభించారు. భద్రాచలం రామాలయ రూపురేఖలను పూర్తిగా మార్చేలా, భక్తులకు ప్రపంచ స్థాయి మౌలిక వసతులు కల్పించేలా మొత్తం రూ. 200.89 కోట్ల భారీ బడ్జెట్తో ఈ తొలి విడత అభివృద్ధి పనులను అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. ఇందులో భాగంగా ఆలయానికి తూర్పు, దక్షిణం, మరియు ఉత్తర దిక్కుల్లో దశాబ్దాల కాలంగా ఉన్న పాత, శిథిలావస్థకు చేరిన నిర్మాణాల తొలగింపు ప్రక్రియను అధికారులు ఈరోజే వేగవంతం చేశారు.
ఆలయ పరిసరాల క్లియరెన్స్ పనులు పూర్తిగా ముగిసిన వెంటనే, ప్రభుత్వం ఇప్పటికే ఆమోదించి సిద్ధం చేసిన సరికొత్త మాస్టర్ ప్లాన్ ప్రకారం నిర్మాణ పనులు వేగవంతం కానున్నాయి. ఈ క్రమంలో ఎక్కడా సంప్రదాయాలకు విఘాతం కలగకుండా, పూర్తి శాస్త్రోక్తంగా మరియు ఆగమ శాస్త్ర నియమాలను తూచా తప్పకుండా పాటిస్తూ సరికొత్త ప్రాకారాలు, మండపాలు, క్యూలైన్ల నిర్మాణ పనులను చేపట్టనున్నారు. వచ్చే ఏడాది వైభవంగా జరగబోయే శ్రీరామ నవమి తిరుకల్యాణ మహోత్సవం పండుగ నాటికి ఈ ఆలయ పునర్నిర్మాణ పనులన్నింటినీ రికార్డు స్థాయిలో పూర్తి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఆ సమయానికి నూతన భద్రాద్రి వైభవాన్ని భక్తులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావడమే ఏకైక లక్ష్యంగా యంత్రాంగం యుద్ధప్రాతిపదికన ముందుకు సాగుతోంది.