ఏపీకి 30 ప్రత్యేక రైళ్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే

Special Trains: సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఈ ప్రత్యేక రైళ్లు ఎంతో ఉపయోగపడనున్నాయి. ప్రయాణానికి ముందు రైలు నంబర్లు, తేదీలు, సమయాలు, టికెట్ లభ్యతను అధికారిక రైల్వే వెబ్‌సైట్ లేదా NTES యాప్‌లో తనిఖీ చేసుకోవాలి.

south central railway to operate 30 special trains in sankranti from secunderabad to various station
south central railway to operate 30 special trains in sankranti from secunderabad to various station
  • హైదరాబాద్ నుంచి ఏపీలోని పలు ప్రాంతాలకు స్పెషల్ ట్రైన్లు!

  • సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారికి గుడ్‌న్యూస్!

  • సికింద్రాబాద్ నుంచి ఏపీకి ప్రత్యేక రైళ్లు!

Travel: సంక్రాంతి పండుగ నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్, హైదరాబాద్, చర్లపల్లి రైల్వే స్టేషన్ల నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు మొత్తం 30 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లకు సంబంధించిన తేదీలు, మార్గాలు, రాకపోకల వివరాలను అధికారులు వెల్లడించారు.

సికింద్రాబాద్ – పార్వతీపురం ప్రత్యేక రైలు

సికింద్రాబాద్ నుంచి పార్వతీపురం వరకు 07009 నంబర్‌తో ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు. ఈ రైలు డిసెంబర్ 23, 30 తేదీలతో పాటు జనవరి 6, 13, 20, 27 తేదీల్లో సాయంత్రం 7:30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1:15 గంటలకు పార్వతీపురం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 07010 నంబర్ రైలు పార్వతీపురం నుంచి బయలుదేరుతుంది. ఈ రైలు గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, విజయనగరం తదితర స్టేషన్లలో ఆగుతుంది.

చర్లపల్లి – నర్సాపూర్ ప్రత్యేక రైలు

చర్లపల్లి నుంచి నర్సాపూర్ మధ్య 07013 నంబర్‌తో ప్రత్యేక రైలు నడపనున్నారు. జనవరి 10, 12, 17, 19 తేదీల్లో సాయంత్రం 7:40 గంటలకు బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 5 గంటలకు నర్సాపూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 07014 నంబర్ రైలు జనవరి 11, 13, 18, 20 తేదీల్లో నర్సాపూర్ నుంచి బయలుదేరుతుంది. ఈ రైలు నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్ మీదుగా ప్రయాణిస్తుంది.

చర్లపల్లి – శ్రీకాకుళం రోడ్ ప్రత్యేక రైలు

చర్లపల్లి నుంచి శ్రీకాకుళం రోడ్ వరకు 07115 నంబర్‌తో ప్రత్యేక రైలును అందుబాటులోకి తీసుకురానున్నారు. జనవరి 7, 9, 16 తేదీల్లో ఈ రైలు సాయంత్రం 7:40 గంటలకు బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో 07116 నంబర్ రైలు జనవరి 8, 10, 17 తేదీల్లో శ్రీకాకుళం రోడ్ నుంచి బయలుదేరుతుంది. ఈ రైలు గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, అనకాపల్లి, విజయనగరం తదితర స్టేషన్లలో హాల్ట్ ఇస్తుంది.

హైదరాబాద్ – నర్సాపూర్ ప్రత్యేక రైలు

హైదరాబాద్ నుంచి నర్సాపూర్ మధ్య 07117 నంబర్‌తో ప్రత్యేక రైలును నడపనున్నారు. జనవరి 9, 16 తేదీల్లో రాత్రి 7:40 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు నర్సాపూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 07118 నంబర్ రైలు జనవరి 10, 17 తేదీల్లో నర్సాపూర్ నుంచి బయలుదేరుతుంది. ఈ రైలు సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, పాలకొల్లు మీదుగా ప్రయాణిస్తుంది.

Tags

Be the first to react

Latest