ఫోల్డింగ్ ల్యాప్‌టాప్.. హువావే కొత్త ఆవిష్కరణ అదుర్స్

Huawei MateBook Fold S: టెక్నాలజీ రంగంలో రోజురోజుకూ కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి. ముఖ్యంగా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్లకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ల్యాప్‌టాప్‌లలోనూ అదే టెక్నాలజీ అందుబాటులోకి వస్తోంది. ఈ క్రమంలో ప్రముఖ టెక్ కంపెనీ హువావే (Huawei) సరికొత్త ఫోల్డబుల్ ల్యాప్‌టాప్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. అదే హువావే మేట్‌బుక్ ఫోల్డ్ ఎస్ (MateBook Fold S). పెద్ద స్క్రీన్‌తో పాటు సులభంగా మడిచి తీసుకెళ్లే సౌకర్యం ఈ ల్యాప్‌టాప్ ప్రత్యేకత.

Huawei MateBook Fold S Launched in China
Huawei MateBook Fold S Launched in China
  • హువావే 14.7 ఇంచుల OLED ఫోల్డబుల్ ల్యాప్‌టాప్‌ను లాంచ్ చేసింది.
  • ప్రారంభ ధర సుమారు రూ.1.87 లక్షలు.

Huawei MateBook Fold S: టెక్నాలజీ రంగంలో రోజురోజుకూ కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి. ముఖ్యంగా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్లకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ల్యాప్‌టాప్‌లలోనూ అదే టెక్నాలజీ అందుబాటులోకి వస్తోంది. ఈ క్రమంలో ప్రముఖ టెక్ కంపెనీ హువావే (Huawei) సరికొత్త ఫోల్డబుల్ ల్యాప్‌టాప్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. అదే హువావే మేట్‌బుక్ ఫోల్డ్ ఎస్ (MateBook Fold S). పెద్ద స్క్రీన్‌తో పాటు సులభంగా మడిచి తీసుకెళ్లే సౌకర్యం ఈ ల్యాప్‌టాప్ ప్రత్యేకత.

ఫోల్డబుల్ OLED డిస్‌ప్లే ప్రత్యేకత

ఈ ల్యాప్‌టాప్‌లో 14.7 అంగుళాల ఫ్లెక్సిబుల్ OLED డిస్‌ప్లేను అందించారు. 3240 × 2160 పిక్సెల్స్ రిజల్యూషన్, 1Hz నుంచి 120Hz వరకు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 1600 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్ ఇందులో ఉన్నాయి. ల్యాప్‌టాప్‌ను మడిచినప్పుడు 10.2 అంగుళాల స్క్రీన్‌తో కాంపాక్ట్ నోట్‌బుక్‌లా ఉపయోగించుకోవచ్చు.

అంతేకాకుండా బయటివైపు 3.5 అంగుళాల ప్రత్యేక OLED స్క్రీన్ కూడా ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 2500 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇందులో నోటిఫికేషన్లు, ఇతర సమాచారాన్ని చూసుకునే సదుపాయం ఉంది.

ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజ్

పనితీరు విషయానికి వస్తే హువావే సొంత కిరిన్ XE90 ప్రాసెసర్‌ను ఇందులో ఉపయోగించారు. గరిష్ఠంగా 32GB RAM, 1TB స్టోరేజ్‌తో ఈ ల్యాప్‌టాప్ అందుబాటులో ఉంటుంది. మెరుగైన పనితీరు కోసం ప్రత్యేక కూలింగ్ సిస్టమ్, ఫ్యాన్‌ను కూడా ఏర్పాటు చేశారు. గరిష్ఠంగా 22W పవర్‌ను అందించే సామర్థ్యం ఉందని కంపెనీ వెల్లడించింది.

ఇది HarmonyOS 7.0 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. మల్టీటాస్కింగ్, ఏఐ ఆధారిత ఫీచర్లు, డాక్యుమెంట్ల విశ్లేషణ వంటి సదుపాయాలు ఉన్నాయి.

కెమెరా, బ్యాటరీ ఫీచర్లు

కెమెరా విభాగంలో వెనుకవైపు 50MP మెయిన్ కెమెరాను అందించారు. వీడియో కాల్స్, ఆన్‌లైన్ మీటింగ్స్ కోసం 12MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఫేస్ రికగ్నిషన్ కోసం ప్రత్యేక ఇన్‌ఫ్రారెడ్ కెమెరా కూడా అందించారు.

ఇక 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఈ ల్యాప్‌టాప్‌లో మరో ప్రత్యేకత. సుమారు 639 గ్రాముల బరువుతో, 6.49 మిల్లీమీటర్ల మందంతో ఉండటం వల్ల సులభంగా ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. అవసరమైన వారికి ఫోల్డబుల్ కీబోర్డ్, స్టైలస్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉన్నాయి.

ధర ఎంతంటే?

చైనాలో హువావే మేట్‌బుక్ ఫోల్డ్ ఎస్ ప్రారంభ ధర 14,999 యువాన్లు. వివిధ వేరియంట్ల ధరలు ఇలా ఉన్నాయి.

  • 16GB RAM + 256GB స్టోరేజ్ – 14,999 యువాన్లు (సుమారు రూ.1.87 లక్షలు)
  • 16GB RAM + 512GB స్టోరేజ్ – 16,999 యువాన్లు (సుమారు రూ.2.12 లక్షలు)
  • 24GB RAM + 512GB స్టోరేజ్ – 18,999 యువాన్లు (సుమారు రూ 2.63 లక్షలు)
  • 32GB RAM + 1TB స్టోరేజ్ – 22,999 యువాన్లు (సుమారు రూ.2.87 లక్షలు)

ఈ ల్యాప్‌టాప్ విక్రయాలు చైనాలో నవంబర్ 27 నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే భారత్‌లో విడుదల, ధరలకు సంబంధించి కంపెనీ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు

Tags

Be the first to react

Latest