Group 2 నియామకాలపై న్యాయ ముసురు తొలగింది…! తుది జాబితా విడుదలకు రంగం సిద్ధం!

2026-01-01 15:18:00
APGovernment: ఎస్సీల ఆర్థిక ఎదుగుదలే లక్ష్యం.. వడ్డీ లేని రుణాలతో కూటమి ప్రభుత్వం సరికొత్త పథకం!

ఆంధ్రప్రదేశ్‌ గ్రూప్‌–2 నియామకాలపై దాఖలైన అన్ని వ్యాజ్యాలను హైకోర్టు కొట్టేయడంతో ఏపీపీఎస్సీకి భారీ ఊరట లభించింది. కోర్టు తీర్పుతో నియామక ప్రక్రియపై ఉన్న ప్రధాన అవాంతరాలు తొలగిపోయినట్లయ్యాయి. దీంతో గ్రూప్‌–2తో పాటు గ్రూప్‌–1 పోస్టుల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని కమిషన్‌ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఏపీపీఎస్సీ తాజాగా నిర్వహించిన కమిషన్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా గ్రూప్‌–2 పోస్టుల ప్రాధాన్యాలకు సంబంధించి అభ్యర్థుల నుంచి మరోసారి ఐచ్ఛికాలు (Options) స్వీకరించాలని నిర్ణయించింది. ఇందుకోసం వారం రోజుల గడువు ఇవ్వనున్నారు. ఈ గడువు పూర్తయిన వెంటనే తుది ఎంపిక జాబితాను విడుదల చేయాలని కమిషన్‌ భావిస్తోంది.

సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల పరీక్షల తేదీలు మారాయ్‌.. కొత్త షెడ్యూల్‌ ఇదే!

గ్రూప్‌–2కి సంబంధించి 2023 డిసెంబరులో 905 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 2025 ఫిబ్రవరిలో మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించగా, ఏప్రిల్‌లో ఫలితాలను కూడా ప్రకటించింది. 1:2 నిష్పత్తిలో సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ కూడా పూర్తయ్యింది. అయితే పోస్టుల ప్రాధాన్యాల ఎంపిక విషయంలో ఇప్పటికే అభ్యర్థుల నుంచి మూడు సార్లు ఐచ్ఛికాలు స్వీకరించినప్పటికీ, హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల కారణంగా నియామకాలు నిలిచిపోయాయి. ఈ ఆలస్య కాలంలో దాదాపు 20 ఇతర ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు పూర్తయ్యాయి. గ్రూప్‌–2 మెరిట్‌ జాబితాలో ఉన్న పలువురు అభ్యర్థులు ఇతర ఉద్యోగాలకు వెళ్లిపోవడంతో పరిస్థితి మారిపోయింది. ఈ నేపథ్యంలో తాజా పరిస్థితులకు అనుగుణంగా మరోసారి ఐచ్ఛికాలు తీసుకోవడం అవసరమని ఏపీపీఎస్సీ నిర్ణయించింది.

Air India: భద్రతా నిబంధనలు గాలికొదిలిన పైలట్లు…! DGCA షోకాజ్ నోటీసులు!

గ్రూప్‌–2కు సంబంధించి ఇప్పటివరకు దాఖలైన అన్ని ప్రధాన కేసులను హైకోర్టు కొట్టేసినప్పటికీ, క్రీడాకోటా (Sports Quota)కు సంబంధించిన రెండు పోస్టుల విషయంలో మాత్రం ఒక కేసు ఇంకా పెండింగ్‌లో ఉంది. ఈ కేసులో ఏ కేడర్‌లో క్రీడాకోటా పోస్టులను రిజర్వు చేయాలనే అంశంపై గతంలో కోర్టు స్పష్టత ఇవ్వలేదు. ఈ వ్యవహారం డీఎస్సీ నియామకాలతో కూడా ముడిపడి ఉండటంతో, గ్రూప్‌–2 కేసును ప్రత్యేకంగా విచారించాలని హైకోర్టును కోరాలని ఏపీపీఎస్సీ భావిస్తోంది. ఈ కేసుపై స్పష్టత వస్తే తప్ప స్పోర్ట్స్‌ కోటాలో పోస్టుల భర్తీ ప్రక్రియ ముందుకు సాగే అవకాశం లేదు.

Web Series: న్యూ ఇయర్ రాత్రి ఓటీటీకి ఊహించని క్రేజ్… ఆ సిరీస్‌కు ఇంత క్రేజ్ ఉందా..!!

మరోవైపు గ్రూప్‌–2పై వచ్చిన తీర్పును ఆధారంగా చేసుకుని గ్రూప్‌–1 పోస్టుల భర్తీ ప్రక్రియను కూడా పూర్తిచేయాలని ఏపీపీఎస్సీ యోచిస్తోంది. గ్రూప్‌–1 నియామకాలపైనా గతంలో పలు న్యాయపరమైన అడ్డంకులు ఏర్పడిన విషయం తెలిసిందే. ఇప్పుడు గ్రూప్‌–2 కేసులన్నీ కొట్టివేయడంతో గ్రూప్‌–1 నియామకాలకూ మార్గం సుగమమైందని కమిషన్‌ భావిస్తోంది. ఈ అంశంపై స్పష్టమైన అనుమతులు, మార్గదర్శకాలు ఇవ్వాలంటూ హైకోర్టును కోరాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది. కోర్టు నుంచి అనుకూల ఉత్తర్వులు వస్తే, గ్రూప్‌–1, గ్రూప్‌–2 రెండింటి నియామక ప్రక్రియలు ఒకేసారి పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రైతులకు శుభవార్త! SBI బ్యాంక్ ద్వారా 10 లక్షల వరకు రుణ సౌకర్యం! సకాలంలో చెల్లిస్తే కేవలం..
భారతీయులకు అమెరికా కీలక సూచనలు.. హెచ్‌-1బీ వీసా నిబంధనల్లో భారీ మార్పులు.. ఇక నైపుణ్యం ఉంటేనే..
APSRTC News:కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆర్టీసీడిపోల విభజనపై కీలక ఆదేశాలు..!!
ఉద్యోగులే సంస్థ బలం... టీడీపీ కార్యాలయంలో సిబ్బందికి న్యూ ఇయర్ కానుకలు!
ఏపీలో వారికి తీపికబురు.. రుణమాఫీ నుంచి ఉద్యోగుల డీఏ పెంపు వరకు.. పండగ తెచ్చిన సర్కార్!
ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! రూ.14 కోట్లతో కొత్తగా మరో స్టేడియం.. భూముల ధరలకు రెక్కలు!

Spotlight

Read More →