LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Business

Google: విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్.. భారత డిజిటల్ రంగానికి కొత్త దిశ

Google: విశాఖపట్నంలో ఏర్పాటు కానున్న గూగుల్ ఏఐ డేటా సెంటర్ దేశ డిజిటల్ రంగంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.

AndhraPravasi News Desk 2 min read
Google: విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్.. భారత డిజిటల్ రంగానికి కొత్త దిశ

గూగుల్ క్లౌడ్ హబ్‌తో విశాఖ గ్లోబల్ ఏఐ కేంద్రంగా మారే దిశగా అడుగు..

చంద్రబాబు దూరదృష్టితో గూగుల్ ప్రాజెక్ట్ సాధ్యం..

అమరావతి: విశాఖపట్నంలో ఏర్పాటు కానున్న గూగుల్ ఏఐ డేటా సెంటర్ దేశ డిజిటల్ రంగంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఈ ప్రాజెక్ట్ భారత్‌లో ఏఐ రంగానికి స్వర్ణయుగాన్ని తెచ్చిపెడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

మంగళవారం విశాఖలో గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్ పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో మంత్రి ఈ ప్రాజెక్ట్ ప్రాముఖ్యతను వివరించారు. ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అతిపెద్ద ప్రాజెక్ట్‌గా నిలుస్తుందని పేర్కొన్నారు.

రూ.87,520 కోట్ల భారీ పెట్టుబడితో 1,000 మెగావాట్ల సామర్థ్యంతో ఏఐ డేటా సెంటర్ హబ్ ఏర్పడుతుండటం రాష్ట్రానికి గర్వకారణమని మంత్రి అన్నారు. ఇది రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద సింగిల్ కార్పొరేట్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (FDI) ప్రాజెక్ట్ అని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత దేశం మొత్తం ఏపీ వైపు చూస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కృషి వల్లే గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థ రాష్ట్రానికి వచ్చిందని కొనియాడారు. గతంలో ఐటీ రంగానికి పునాది వేసిన చంద్రబాబు గారే ఇప్పుడు ఏఐ రంగంలో కూడా రాష్ట్రాన్ని ప్రపంచస్థాయిలో నిలబెడుతున్నారని అన్నారు.

నారా లోకేష్ “స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” అనే లక్ష్యంతో విశాఖను గ్లోబల్ టెక్ హబ్‌గా మార్చాలనే సంకల్పం ఈ ప్రాజెక్ట్‌తో నెరవేరుతుందని మంత్రి తెలిపారు. ఈ డేటా సెంటర్ ద్వారా ఆంధ్రప్రదేశ్ దేశంలోనే 1,000 మెగావాట్ల సామర్థ్యంతో ఏఐ, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కలిగిన తొలి రాష్ట్రంగా నిలుస్తుందని చెప్పారు.

ఈ ప్రాజెక్ట్ వల్ల ఏఐ రంగంలో ఆవిష్కరణలు వేగవంతం అవుతాయని, విశాఖపట్నం అంతర్జాతీయ స్థాయి టెక్ హబ్‌గా మారుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ “స్వర్ణాంధ్ర @2047” లక్ష్యానికి, కేంద్ర ప్రభుత్వ “ఆత్మనిర్భర్ భారత్” దృష్టికి ఈ ప్రాజెక్ట్ బలాన్నిస్తుంది అని చెప్పారు.

ఈ గూగుల్ ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే కాకుండా దేశానికి కూడా టెక్నాలజీ రంగంలో కొత్త దిశను చూపించబోతోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.

Be the first to react

More Coverage

Gold Rate Today: ట్రంప్ వ్యాఖ్యలతో బులియన్ మార్కెట్‌లో సరికొత్త రికార్డులు.. భారీగా పెరిగిన పసిడి, వెండి ధరలు!

Gold Rate Today: ట్రంప్ వ్యాఖ్యలతో బులియన్ మార్కెట్‌లో సరికొత్త రికార్డులు.. భారీగా పెరిగిన పసిడి, వెండి ధరలు!

Gold Rate Today: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు సద్దుమణిగే సంకేతాలు వెలువడటంతో అంతర్జాతీయ మార్కెట్‌లో బం…

Stock Market: అమెరికా-ఇరాన్ శాంతి సంకేతాలు... దలాల్ స్ట్రీట్‌లో బుల్ రన్.. దుమ్మురేపిన స్టాక్ మార్కెట్లు! ప్రపంచ మార్కెట్లలో కొత్త ఉత్సాహం..

Stock Market: అమెరికా-ఇరాన్ శాంతి సంకేతాలు... దలాల్ స్ట్రీట్‌లో బుల్ రన్.. దుమ్మురేపిన స్టాక్ మార్కెట్లు! ప్రపంచ మార్కెట్లలో కొత్త ఉత్సాహం..

Stock Market: అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరవచ్చనే సానుకూల సంకేతాలతో శుక్రవారం భారత స్టాక్ మ…