Crude Oil: ముడి చమురు ధరల షాక్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు! BSNL plan: బీఎస్ఎన్ఎల్ సరికొత్త చవక ప్లాన్.. 28 రోజులు కాదు, ఏకంగా 30 రోజుల వ్యాలిడిటీ! 75 జీబీ డేటా.. Air India: ఎయిర్ ఇండియాలో భారీ ప్రక్షాళన.... మూడేళ్లలో 1000 మంది ఉద్యోగులపై వేటు! MSME: విజయవాడలో ‘SME IPO’ అవగాహన సదస్సు.. చిన్న పరిశ్రమలకు పెట్టుబడి మార్కెట్ దిశగా కొత్త మార్గం! Dwacra Womans: డ్వాక్రా మహిళలకు పండగే... రూ. 2 లక్షల వరకు లోన్! ఎలా పొందాలంటే... Fuel Prices Hike: పెరగనున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధర? మే 15 లోపు ఇంధన ధరలు.. Ram Mohan Naidu: విమానాల లీజింగ్‌లో భారత్ కొత్త కేంద్రం.. గిఫ్ట్ సిటీపై ప్రపంచ దృష్టి! Air Asia: విమానయాన చరిత్రలో రికార్డు... ఎయిర్ ఆసియా గూటికి 150 ఎయిర్‌బస్ ఏ220 జెట్లు! stock markets: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు! 500 పాయింట్లకు పైగా.. Toyota Fortuner: ఫార్చ్యూనర్ ప్రియులకు షాక్... రూ. 70 వేల వరకు పెరిగిన ఫార్చ్యూనర్ ధర!! Crude Oil: ముడి చమురు ధరల షాక్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు! BSNL plan: బీఎస్ఎన్ఎల్ సరికొత్త చవక ప్లాన్.. 28 రోజులు కాదు, ఏకంగా 30 రోజుల వ్యాలిడిటీ! 75 జీబీ డేటా.. Air India: ఎయిర్ ఇండియాలో భారీ ప్రక్షాళన.... మూడేళ్లలో 1000 మంది ఉద్యోగులపై వేటు! MSME: విజయవాడలో ‘SME IPO’ అవగాహన సదస్సు.. చిన్న పరిశ్రమలకు పెట్టుబడి మార్కెట్ దిశగా కొత్త మార్గం! Dwacra Womans: డ్వాక్రా మహిళలకు పండగే... రూ. 2 లక్షల వరకు లోన్! ఎలా పొందాలంటే... Fuel Prices Hike: పెరగనున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధర? మే 15 లోపు ఇంధన ధరలు.. Ram Mohan Naidu: విమానాల లీజింగ్‌లో భారత్ కొత్త కేంద్రం.. గిఫ్ట్ సిటీపై ప్రపంచ దృష్టి! Air Asia: విమానయాన చరిత్రలో రికార్డు... ఎయిర్ ఆసియా గూటికి 150 ఎయిర్‌బస్ ఏ220 జెట్లు! stock markets: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు! 500 పాయింట్లకు పైగా.. Toyota Fortuner: ఫార్చ్యూనర్ ప్రియులకు షాక్... రూ. 70 వేల వరకు పెరిగిన ఫార్చ్యూనర్ ధర!!

Crude Oil: ముడి చమురు ధరల షాక్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు!

Crude Oil: అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఇరాన్ ప్రతిపాదనలను అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించడంతో ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి పెరిగింది.

Published : 2026-05-11 12:16:00

4 శాతం పెరిగిన ముడిచమురు ధరలు..

ఇరాన్ ప్రతిపాదనలను ట్రంప్ తిరస్కరించడంతో పెరిగిన ధరలు..

అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఇరాన్ ప్రతిపాదనలను అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించడంతో ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి పెరిగింది. దీని ప్రభావంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా 4 శాతం వరకు పెరిగాయి.

క్రూడాయిల్ ధరల పెరుగుదలతో భారత మార్కెట్లపై కూడా తీవ్ర ప్రభావం పడింది. మార్కెట్ ప్రారంభానికి ముందే గిఫ్ట్ నిఫ్టీ 193 పాయింట్లు పడిపోవడం పెట్టుబడిదారుల్లో ఆందోళన కలిగించింది. ఆ ప్రభావం ప్రధాన సూచీలపై స్పష్టంగా కనిపించింది.

ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే సెన్సెక్స్ 1,010 పాయింట్లకు పైగా నష్టపోగా, నిఫ్టీ కూడా 290 పాయింట్లకు పైగా క్షీణించింది. బ్యాంకింగ్, ఐటీ, ఆటో, మెటల్ రంగాల షేర్లు భారీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. దీంతో మార్కెట్లలో నష్టాల వాతావరణం నెలకొంది.

అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలపడటంతో రూపాయి విలువ కూడా బలహీనపడింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 40 పైసలు పడిపోయి 94.88 వద్ద ట్రేడవుతోంది. చమురు ధరల పెరుగుదల, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ వంటి అంశాలు రూపాయి పతనానికి కారణమవుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

ప్రపంచ ఆర్థిక పరిస్థితులపై పెట్టుబడిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ, రాబోయే రోజుల్లో అంతర్జాతీయ పరిణామాల ఆధారంగానే మార్కెట్ల దిశ నిర్ణయించబడే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Spotlight

Read More →