Minister Savitha: చంద్రబాబు వల్లే రాయలసీమలో జలకళ.. పోలవరంతో చివరి ఎకరాకూ సాగునీరు.. మంత్రి సవిత!

Minister Savitha: రాయలసీమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తూ సాగునీటి, పారిశ్రామిక, ఉద్యానవన రంగాల్లో విస్తృతంగా పెట్టుబడులు పెడుతోందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాయలసీమ జలకళతో కళకళలాడుతోందని, ఈ ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్‌గా, పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోందని ఆమె పేర్కొన్నారు.

Rayalaseema
Rayalaseema

పోలవరం పూర్తైతే సీమలో ప్రతి ఎకరాకూ సాగునీరు: మంత్రి సవిత..

రాయలసీమను హార్టికల్చర్, ఇండస్ట్రియల్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నాం: సవిత..

పుట్టపర్తి: రాయలసీమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తూ సాగునీటి, పారిశ్రామిక, ఉద్యానవన రంగాల్లో విస్తృతంగా పెట్టుబడులు పెడుతోందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాయలసీమ జలకళతో కళకళలాడుతోందని, ఈ ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్‌గా, పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోందని ఆమె పేర్కొన్నారు.

సోమవారం పుట్టపర్తిలోని బుక్కపట్నం చెరువును ఎమ్మెల్యేలు ఎంఎస్ రాజు, పల్లె సింధూరెడ్డి, కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి మంత్రి సవిత పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ రాయలసీమకు కృష్ణా జలాలు తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాలకే దక్కుతుందని అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావంతో అనేక ప్రాంతాలు వర్షాభావాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ, రాయలసీమలో చెరువులు, నదులు నీటితో నిండిపోవడం ప్రభుత్వం చేపట్టిన జలవనరుల అభివృద్ధి కార్యక్రమాల ఫలితమని మంత్రి తెలిపారు. కుప్పం నుంచి మడకశిర వరకు కృష్ణా జలాలను తీసుకువచ్చి సాగునీటి పరిస్థితిని మెరుగుపరిచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిదేనని ఆమె పేర్కొన్నారు.

రాయలసీమ సాగునీటి భవిష్యత్తుకు పోలవరం ప్రాజెక్టు కీలకమని మంత్రి సవిత అన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత రాయలసీమలోని చివరి ఎకరా వరకు సాగునీరు అందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు తొలిసారిగా కృష్ణా జలాలు అందించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కు దక్కుతుందని గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో సీఎం చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టులకు వేల కోట్ల రూపాయలు కేటాయిస్తూ అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. పులివెందులకు కూడా సాగు, తాగునీరు అందించిన ఘనత చంద్రబాబుదేనని పేర్కొన్నారు.

రాయలసీమను దేశంలోనే ప్రముఖ హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సుమారు రూ. లక్ష కోట్లతో ప్రణాళికలు అమలు చేస్తోందని మంత్రి వెల్లడించారు. వ్యవసాయంతో పాటు పారిశ్రామిక అభివృద్ధికీ సమాన ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు.

రాష్ట్రంలోని ప్రతి జిల్లాను ప్రత్యేక రంగంలో అభివృద్ధి చేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు. తిరుపతిలో రాయల్ ఎన్‌ఫీల్డ్ పరిశ్రమను ఏర్పాటు చేశామని, కర్నూలును డ్రోన్ హబ్‌గా తీర్చిదిద్దడంతో పాటు జొన్నగిరి ప్రాంతాన్ని స్వర్ణగిరిగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. కడపలో స్టీల్ ప్లాంట్‌తో పాటు దాల్మియా సిమెంట్ విస్తరణ జరుగుతోందని, శ్రీసత్యసాయి జిల్లాలో ఇప్పటికే కియా కార్ల పరిశ్రమతో పాటు పుట్టపర్తిలో యుద్ధ విమానాల తయారీ పరిశ్రమ ఏర్పాటవుతోందని మంత్రి పేర్కొన్నారు.

గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో రాయలసీమ అభివృద్ధికి ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని మంత్రి సవిత ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని, శంకుస్థాపనలు, హడావుడి కార్యక్రమాలకే పరిమితమయ్యారని విమర్శించారు. వైసీపీ నాయకులు అప్పట్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు.

రెండేళ్ల కూటమి ప్రభుత్వ పనితీరు, ఐదేళ్ల వైసీపీ పాలనపై బహిరంగ చర్చకు సిద్ధమా అని మంత్రి సవిత వైసీపీ నాయకులకు సవాల్ విసిరారు. ప్రజలే రెండు ప్రభుత్వాల పనితీరును పోల్చి తీర్పు చెబుతారని అన్నారు.

కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఎంఎస్ రాజు, పల్లె సింధూరెడ్డి, కూటమి నాయకులు పల్లె రఘునాథ్ రెడ్డి, పరిటాల శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి సవిత బుక్కపట్నం చెరువులో బోటు విహారం చేసి నీటి పరిస్థితిని పరిశీలించారు.

Tags

Be the first to react

Latest