Amaravati: అమరావతి రాజధానిలో రికార్డు స్థాయిలో ఐకానిక్ టవర్లు.. 50 అంతస్తులతో స్కైలైన్‌కే కిరీటంగా GAD టవర్!
Amaravati: ప్రజా రాజధాని అమరావతిలోని గవర్నమెంట్ కాంప్లెక్స్ (AGC) పరిధిలో 5 అత్యంత అత్యాధునిక ఐకానిక్ టవర్ల నిర్మాణాలు శరవేగంగా ముందుకు సాగుతున్నాయి. వీటిలో ప్రధానమైన 50 అంతస్తుల GAD టవర్ 230.4 మీటర్ల ఎత్తు, 17 లక్షలకు పైగా చదరపు అడుగుల ఫ్లోర్ ఏరియాతో అమరావతి స్కైలైన్‌కు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
అమరావతి స్కైలైన్‌కు కొత్త కళ.. 230 మీటర్ల ఎత్తులో మెగా టవర్!
ప్రజా రాజధానిలో రికార్డు నిర్మాణ వేగం.. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ వివరాలు ఇవే!
Amaravati: ఆంధ్రప్రదేశ్ ప్రజల దశాబ్దాల కలల రాజధాని 'అమరావతి' నిర్మాణం మళ్లీ వేగవంతమైంది. ప్రజా రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ (AGC) లో భాగంగా అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యంత ఆకర్షణీయమైన 5 ఐకానిక్ టవర్ల (Iconic Towers)నిర్మాణం అత్యంత వేగంగా రూపుదిద్దుకుంటోంది. రాష్ట్ర పాలనా రంగానికి ప్రతిరూపంగా నిలిచే ఈ టవర్లలో ప్రధానమైనది జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ (GAD) టవర్. ఏకంగా 50 అంతస్తులతో ఆకాశాన్ని తాకేలా నిర్మితమవుతున్న ఈ టవర్, అమరావతి స్కైలైన్‌కు సరికొత్త గుర్తింపుగా నిలవబోతోంది.
రాజధానికి మకుటంలా 50 అంతస్తుల GAD టవర్
అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దే ప్రణాళికల్లో భాగంగా ఈ ఐకానిక్ టవర్లను డిజైన్ చేశారు. ఇందులో నిర్మించే ఐదు టవర్లు పరిపాలనా సౌలభ్యాన్ని పెంపొందించడమే కాకుండా, రాజధానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఇస్తాయి. ముఖ్యంగా 230 మీటర్లకు పైగా ఎత్తుతో నిర్మాణం జరుపుకుంటున్న 50 అంతస్తుల GAD టవర్, భారతదేశంలోనే అత్యంత ఎత్తైన ప్రభుత్వ పరిపాలనా భవనాల్లో ఒకటిగా నిలవనుంది. అత్యాధునిక ఇంజనీరింగ్ ప్రణాళికలతో, వినూత్న ఆర్కిటెక్చర్‌తో ఈ భవనాన్ని రూపొందిస్తున్నారు.
GAD టవర్ ప్రధాన అంశాలు (Key Specifications):
సైట్ ఏరియా (Site Area): 6.58 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఈ టవర్‌ను నిర్మిస్తున్నారు.
బిల్ట్-అప్ ఏరియా (Built-up Area): 1,11,507 చదరపు అడుగులు.
మొత్తం ఫ్లోర్ ఏరియా (Total Floor Area): ఏకంగా 17,03,433 చదరపు అడుగుల విస్తీర్ణంలో అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలకు చోటు కల్పిస్తారు.
టవర్ ఎత్తు (Height): 230.4 మీటర్ల ఎత్తుతో అమరావతిలోని ఏ ప్రాంతం నుంచైనా స్పష్టంగా కనిపించేలా రూపుదిద్దుకుంటోంది.
పార్కింగ్ వసతి (Parking Facility): విధులకు వచ్చే ఉద్యోగులు, సందర్శకుల రద్దీని తట్టుకునేలా ఏకకాలంలో 4,133 వాహనాలు నిలిపేలా అత్యాధునిక, విశాలమైన పార్కింగ్ సౌకర్యాన్ని డిజైన్ చేశారు.
పరిపాలనకు వినూత్న వేదిక.. ఉపాధికి బూస్ట్
ఈ ఐకానిక్ టవర్ల నిర్మాణం పూర్తియితే రాష్ట్ర సచివాలయం, హెచ్‌ఓడీ (HOD) ఆఫీసులు, వివిధ ప్రభుత్వ శాఖలన్నీ ఒకే ప్రాంగణంలోకి వస్తాయి. దీనివల్ల ప్రజలకు పాలనా సేవలు మరింత వేగంగా అందుతాయి. అంతేకాకుండా ఈ మెగా ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల ద్వారా స్థానికంగా వేలాది మందికి నిర్మాణ రంగానికి సంబంధించిన ఉపాధి లభిస్తోంది. రాజధాని ప్రాంతంలో రియల్ ఎస్టేట్, ఐటీ మరియు వ్యాపార రంగాలకు ఈ నిర్మాణాలు మరింత ఊపునిస్తాయని ఆర్థిక వేత్తలు, ప్రజాప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Tags
Be the first to react
