ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీలో మార్పులు! కొత్త షెడ్యూల్ ఇదే!

Pensions: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా నవంబర్ నెలకు సంబంధించిన ‘ఎన్టీఆర్ భరోసా’ పింఛన్ల పంపిణీ తేదీ మారింది. నవంబర్ 1న మున్సిపల్ పోలింగ్, నవంబర్ 3న పరిషత్ (ఎంపీటీసీ/జెడ్పీటీసీ) పోలింగ్ ఉన్నందున లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా రెండు రోజులు ముందుగానే, అంటే అక్టోబర్ 30వ తేదీ శుక్రవారం నుంచే పింఛన్లను పంపిణీ చేయనున్నారు. అక్టోబర్ 29నే బ్యాంకుల్లో నగదు సిద్ధం చేసుకోవాలని సచివాలయ సిబ్బందికి ఆదేశాలు వెళ్లాయి. ఈ పంపిణీ నవంబర్ 5 వరకు కొనసాగనుంది.

అక్టోబర్ 30 నుంచే ఎన్టీఆర్ భరోసా పింఛన్లు
అక్టోబర్ 30 నుంచే ఎన్టీఆర్ భరోసా పింఛన్లు
  • నవంబర్ 1న మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. నవంబర్ 3న ఎంపీటీసీ/జెడ్పీటీసీ ఓటింగ్ నేపథ్యంలో మార్పులు!

  • అక్టోబర్ 29నే బ్యాంకుల నుంచి నిధులు విత్ డ్రా.. సిద్ధంగా ఉండాలని సచివాలయ సిబ్బందికి ఆదేశాలు!

  • నవంబర్ 5వ తేదీ వరకు కొనసాగనున్న పింఛన్ల పంపిణీ ప్రక్రియ!

Andhrapradesh: ఆంధ్రప్రదేశ్‌లో ‘ఎన్టీఆర్ భరోసా’ సామాజిక పింఛన్లను అందుకుంటున్న లబ్ధిదారులకు ప్రభుత్వం కీలక సమాచారాన్ని అందించింది. నవంబర్ నెలకు సంబంధించిన పింఛన్లను సాధారణంగా పంపిణీ చేసే నవంబర్ 1వ తేదీన కాకుండా, రెండు రోజులు ముందుగానే అక్టోబర్ 30వ తేదీ (శుక్రవారం) నుంచే లబ్ధిదారుల చేతుల్లో పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితర లబ్ధిదారులు ఎన్నికల హడావుడి వల్ల ఎలాంటి అసౌకర్యానికి గురికాకూడదనే ఉద్దేశంతో ఈ ముందస్తు నిర్ణయం తీసుకున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ షెడ్యూల్ కారణం

ప్రస్తుతం రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ జోరుగా సాగుతోంది. నవంబర్ 1వ తేదీన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగనుండగా, ఆ రోజు ఆదివారం కూడా వచ్చింది. దానికి ముందు రోజు అక్టోబర్ 31న పోలింగ్ సామగ్రి పంపిణీ, సిబ్బంది డిప్లాయ్‌మెంట్ వంటి ఏర్పాట్లు ఉంటాయి. ఆ తర్వాత నవంబర్ 3న ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల పోలింగ్ జరగనుంది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది, రెవెన్యూ యంత్రాంగం మొత్తం పోలింగ్ విధుల్లో నిమగ్నం కానున్నందున పింఛన్ల పంపిణీకి అంతరాయం కలగకుండా తేదీలను ముందుకు జరిపారు.

అక్టోబర్ 29నే నిధుల విత్‌డ్రా – నవంబర్ 5 వరకు పంపిణీ

ఈ సరికొత్త షెడ్యూల్ అమలు కోసం అధికారులు బ్యాంక్ మేనేజర్లతో సమన్వయం చేసుకుంటున్నారు. అక్టోబర్ 29వ తేదీనే అవసరమైన నిధులను బ్యాంకుల నుంచి విత్‌డ్రా చేసి సిద్ధంగా ఉంచుకోవాలని గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ఆదేశాలు జారీ అయ్యాయి. అక్టోబర్ 30న ప్రారంభమయ్యే ఈ పంపిణీ ప్రక్రియ, పోలింగ్ రోజులు మినహాయించి నవంబర్ 5వ తేదీ వరకు కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పూర్తిస్థాయి అధికారిక మార్గదర్శకాలు త్వరలోనే వెలువడనున్నాయి.

లబ్ధిదారులకు ఊరటనిచ్చే నిబంధనలు

ఇటీవల కూటమి ప్రభుత్వం పింఛన్ల నిబంధనల్లో కీలక సడలింపులు చేపట్టింది. ఏదైనా కారణాల వల్ల లబ్ధిదారులు వరుసగా రెండు నెలల పాటు పింఛన్ తీసుకోలేకపోయినా, మూడో నెలలో ఆ రెండు నెలల బకాయిలతో కలిపి ఒకేసారి పింఛన్ మొత్తం తీసుకునే వెసులుబాటును కల్పించింది. అలాగే పింఛన్ అందుకుంటున్న లబ్ధిదారుడు (భర్త) మరణిస్తే, భార్య దరఖాస్తు చేసుకున్న మరుసటి నెల నుంచే ఎలాంటి జాప్యం లేకుండా 'స్పౌజ్ కేటగిరీ' కింద పింఛన్ అందించే విధానాన్ని అమలు చేస్తోంది.

Tags

Be the first to react

Latest