⚡ BREAKING

Nara Lokesh: పునాదిపాడులో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల నూతన భవనాన్ని ప్రారంభించిన మంత్రి నారా లోకేష్!

Nara Lokesh: విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక వసతులు అందించడం ప్రభుత్వ ప్రాధాన్యమని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. సోమవారం కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి, కంకిపాడు మండలం పునాదిపాడులో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల భవనాన్ని ప్రారంభించారు.

Nara Lokesh
Nara Lokesh

రూ.1.20 కోట్ల విరాళంతో నిర్మించిన భవనాన్ని విద్యార్థులకు అంకితం..

ల్యాబ్‌లను పరిశీలించిన మంత్రి.. విద్యార్థులతో మమేకమై ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచన..

పునాదిపాడు: విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక వసతులు అందించడం ప్రభుత్వ ప్రాధాన్యమని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. సోమవారం కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి, కంకిపాడు మండలం పునాదిపాడులో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల భవనాన్ని ప్రారంభించారు.

ఈ భవనం పోలవరపు మాధవరావు మరియు వారి కుటుంబ సభ్యులు రూ.1.20 కోట్ల విరాళంతో నిర్మించి ప్రభుత్వానికి అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని మంత్రి ఆవిష్కరించి భవనాన్ని అధికారికంగా ప్రారంభించారు.

కళాశాల ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్‌కు కళాశాల సిబ్బంది, దాత కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం జిల్లా పరిషత్ హైస్కూల్ ప్లస్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల నూతన భవనాన్ని సందర్శించి అక్కడి సౌకర్యాలను పరిశీలించారు.

కళాశాలలోని ప్రయోగశాలలను మంత్రి లోకేష్ పరిశీలించి విద్యా సదుపాయాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించి వారి చదువులు, భవిష్యత్ లక్ష్యాల గురించి ఆరా తీశారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ వారికి "ఆల్ ది బెస్ట్" తెలిపారు. విద్య ద్వారానే జీవితంలో విజయాలు సాధించవచ్చని ప్రోత్సహించారు.

విద్యాభివృద్ధికి సహకరిస్తూ ప్రభుత్వ విద్యాసంస్థ కోసం భారీ విరాళం అందించిన పోలవరపు మాధవరావు కుటుంబ సభ్యులను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. సమాజానికి ఉపయోగపడే ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తాయని కొనియాడారు. అలాగే కళాశాల పూర్వ విద్యార్థులను కలిసి వారి సేవలను ప్రశంసించారు.

ఈ సందర్భంగా రచయిత దాసరి ఆళ్వార స్వామి రచించిన ‘భారతదేశ ప్రధానమంత్రులు’ పుస్తకాన్ని మంత్రి నారా లోకేష్ ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులతో కలిసి గ్రూప్ ఫోటో దిగుతూ వారికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్, పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్, మండలి చీఫ్ విప్ పంచుమర్తి అనూరాధ, ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, కాగిత కృష్ణప్రసాద్, వర్ల కుమార్ రాజా, యార్లగడ్డ వెంకట్రావు, వెనిగండ్ల రాము, ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్, మచిలీపట్నం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు వీరంకి వెంకట గురుమూర్తి, ప్రధాన కార్యదర్శి గోపు సత్యనారాయణతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, స్థానికులు పాల్గొన్నారు.

పునాదిపాడులో దాతల సహకారంతో నిర్మితమైన ఈ నూతన భవనం ప్రభుత్వ విద్యా వ్యవస్థకు మరో బలమైన మద్దతుగా నిలిచింది. ప్రభుత్వం, దాతలు, సమాజం కలిసి పనిచేస్తే ప్రభుత్వ విద్యాసంస్థలు మరింత అభివృద్ధి చెందుతాయని ఈ కార్యక్రమం మరోసారి చాటిచెప్పింది.

Tags

Be the first to react

Latest