Nara Lokesh: ఏపీలో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయండి.. డెల్టా ఎక్స్ సీఈవోకు మంత్రి లోకేష్ ఆహ్వానం!

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ను గ్రీన్ ఎనర్జీ, అధునాతన తయారీ రంగాలకు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం విదేశీ పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నాలను వేగవంతం చేసింది. దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ శుక్రవారం డెల్టా ఎక్స్ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో స్టీఫెన్ కిమ్తో పాటు సంస్థ ఉన్నతాధికారులతో సియోల్లో సమావేశమయ్యారు.

Nara Lokesh In Korea
Nara Lokesh In Korea

దక్షిణ కొరియాలో లోకేష్ పెట్టుబడుల వేట.. డెల్టా ఎక్స్తో కీలక చర్చలు..

గ్రీన్ ఎనర్జీ హబ్గా ఏపీ.. BESS ప్లాంట్పై డెల్టా ఎక్స్ సానుకూల సంకేతాలు..

సియోల్: ఆంధ్రప్రదేశ్ను గ్రీన్ ఎనర్జీ, అధునాతన తయారీ రంగాలకు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం విదేశీ పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నాలను వేగవంతం చేసింది. దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ శుక్రవారం డెల్టా ఎక్స్ (DeltaX) సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో స్టీఫెన్ కిమ్తో పాటు సంస్థ ఉన్నతాధికారులతో సియోల్లో సమావేశమయ్యారు.

మెషిన్ విజన్, ఎడ్జ్ ఏఐ, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ (BESS) రంగాల్లో ప్రత్యేక నైపుణ్యం కలిగిన డెల్టా ఎక్స్ సంస్థను ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలని మంత్రి లోకేష్ ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం 160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తితో పాటు 25 గిగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ (BESS) ప్రాజెక్టుల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకుని ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందని తెలిపారు.

ఈ లక్ష్యాలను సాధించేందుకు ఇంగాట్లు, సోలార్ గ్రేడ్ సిలికాన్ వేఫర్లు, పీవీ సెల్స్, బ్యాటరీ సెల్స్, సోలార్ మాడ్యూళ్ల తయారీకి అవసరమైన పూర్తి పారిశ్రామిక వ్యవస్థను రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. పోర్టుల సౌకర్యం, మెరుగైన మౌలిక వసతులు, పారిశ్రామిక అనుకూల వాతావరణం ఉన్న ఆంధ్రప్రదేశ్లో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (BESS) తయారీ యూనిట్ను ఏర్పాటు చేయాలని డెల్టా ఎక్స్ సంస్థను కోరారు.

అలాగే యుటిలిటీ స్థాయి విద్యుత్ నిల్వ ప్రాజెక్టులు, డేటా సెంటర్లు, పారిశ్రామిక పార్కులకు అవసరమైన స్టోరేజ్ వ్యవస్థలను రాష్ట్ర డిస్కమ్లు, పునరుత్పాదక ఇంధన సంస్థలతో అనుసంధానం చేస్తూ విస్తృత మార్కెట్ అవకాశాలను కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి వివరించారు.

సమావేశంలో స్పందించిన డెల్టా ఎక్స్ సీఈవో స్టీఫెన్ కిమ్ మాట్లాడుతూ, తమ సంస్థ 2020 సెప్టెంబర్లో దక్షిణ కొరియాలో ప్రారంభమైందని, ప్రస్తుతం భారతదేశంలో హైదరాబాద్లో కార్యాలయాన్ని ఏర్పాటు చేసి కార్యకలాపాలు నిర్వహిస్తోందని తెలిపారు.

వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు మంచి అవకాశాలు కనిపిస్తున్నాయని పేర్కొన్న ఆయన, రాష్ట్రంలో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (BESS) తయారీ యూనిట్ ఏర్పాటు అంశంపై త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఈ సమావేశం ద్వారా గ్రీన్ ఎనర్జీ రంగంలో ఆంధ్రప్రదేశ్కు మరిన్ని విదేశీ పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.

Tags

Be the first to react

Latest