⚡ BREAKING

Weavers: నేతన్నలకు ఊరట.. నేతన్న భరోసా పెన్షన్ దరఖాస్తులో కీలక నిబంధన సడలింపు!

Nethanna Bharosa Pensions AP: నూతన నేతన్న భరోసా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటున్న చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. పెన్షన్ దరఖాస్తుతో పాటు బ్యాంకు ఖాతా స్టేట్‌మెంట్ సమర్పించాలనే నిబంధనను సడలించినట్లు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు.

Nethanna Bharosa Pensions AP
Nethanna Bharosa Pensions AP

బ్యాంకు స్టేట్‌మెంట్ అవసరం లేదు.. మాస్టర్ వీవర్ ధ్రువీకరణ, వేతన వివరాలు ఇస్తే సరిపోతుంది..

బ్యాంకు స్టేట్‌మెంట్ లేకున్నా నేతన్న భరోసా పెన్షన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు..

అమరావతి: నూతన నేతన్న భరోసా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటున్న చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. పెన్షన్ దరఖాస్తుతో పాటు బ్యాంకు ఖాతా స్టేట్‌మెంట్ సమర్పించాలనే నిబంధనను సడలించినట్లు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు.

బ్యాంకు స్టేట్‌మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా, మాస్టర్ వీవర్ నుంచి వేతనాలు పొందుతున్నట్లు ధ్రువీకరణ పత్రం, వేతన వివరాలు అందజేస్తే సరిపోతుందని మంత్రి స్పష్టం చేశారు. అర్హత ఉన్న ఏ నేతన్న కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.

నేతన్నల సమస్యపై వెంటనే స్పందించిన ప్రభుత్వం
ఈ నెల 7వ తేదీ నుంచి వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళ, దివ్యాంగులు, చేనేత కార్మికులు సహా వివిధ కేటగిరీలకు చెందిన కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులను ప్రభుత్వం స్వీకరిస్తోంది.

ఈ నేపథ్యంలో నేతన్న భరోసా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే చేనేత కార్మికులకు బ్యాంకు ఖాతా స్టేట్‌మెంట్ నిబంధన ఇబ్బందిగా మారింది. ముఖ్యంగా మాస్టర్ వీవర్ల వద్ద పనిచేసే పలువురు నేతన్నలకు వ్యక్తిగతంగా వేతనాలు చెల్లిస్తుండటంతో బ్యాంకు లావాదేవీల రూపంలో ఆదాయ వివరాలు ఉండకపోవచ్చు.

దీంతో పలువురు నేతన్నలు, చేనేత సంఘాల ప్రతినిధులు తమ సమస్యను మంత్రి సవిత దృష్టికి తీసుకెళ్లారు. సమస్యను పరిశీలించిన మంత్రి వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. నేతన్నల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకున్న సీఎం బ్యాంకు స్టేట్‌మెంట్ నిబంధనను సడలించాలని ఆదేశించారు. ఈ నిర్ణయంతో అర్హులైన చేనేత కార్మికులు పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు మార్గం సుగమమైందని మంత్రి సవిత తెలిపారు.

50 ఏళ్లు నిండిన నేతన్నలందరికీ పెన్షన్ 
50 ఏళ్లు నిండిన నేతన్నలందరికీ నేతన్న భరోసా పెన్షన్లు అందజేస్తామని మంత్రి స్పష్టం చేశారు. అర్హత ఉన్న నేతన్నలు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.

బ్యాంకు ఖాతా స్టేట్‌మెంట్ లేకపోయినా అర్హులైన నేతన్నల నుంచి దరఖాస్తులను స్వీకరించాలని అన్ని జిల్లాల చేనేత, జౌళి శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది నేతన్నలకు ప్రయోజనం కలగనుందని సవిత పేర్కొన్నారు.

ఇప్పటికే 85 వేల మందికి పెన్షన్
నేతన్నల ఆర్థిక భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి తెలిపారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 85 వేల మందికిపైగా నేతన్నలకు నేతన్న భరోసా పథకం కింద నెలకు రూ.4 వేల చొప్పున పెన్షన్ అందిస్తున్నామని చెప్పారు.

చేనేత రంగాన్ని ఆదుకునేందుకు పెన్షన్‌తో పాటు ఇతర సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. నేతన్నలకు ఉచిత విద్యుత్ సదుపాయం కల్పిస్తున్నామని, ‘నేతన్నల సేవలో’ పథకం కింద ఏడాదికి రూ.25 వేల ఆర్థిక సాయం అందిస్తున్నామని మంత్రి గుర్తు చేశారు.

నేతన్నల ఆర్థిక భద్రతే లక్ష్యం 
చేనేత కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడం, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని మంత్రి సవిత తెలిపారు.

పెన్షన్ దరఖాస్తు ప్రక్రియలో ఎదురవుతున్న వాస్తవ సమస్యలను గుర్తించి నిబంధనలను సడలించడం ద్వారా అర్హులైన నేతన్నలకు సంక్షేమ పథకాలు మరింత సులభంగా చేరే అవకాశం ఏర్పడిందన్నారు.

నేతన్న భరోసా పెన్షన్‌కు అర్హత ఉన్న వారు తమ దరఖాస్తులను సంబంధిత అధికారులకు సమర్పించాలని, బ్యాంకు స్టేట్‌మెంట్ లేకపోవడంపై ఎలాంటి ఆందోళన చెందవద్దని మంత్రి స్పష్టం చేశారు.

Tags

Be the first to react

Latest