Rushikonda: రుషికొండ భవనాలపై ఏపీటీడీసీ కీలక నిర్ణయం... వాటికి లీజుకు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్!

Rushikonda: విశాఖపట్నంలోని వివాదాస్పద రుషికొండ హిల్టాప్ భవనాలను లీజ్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (O&M) మోడల్లో లగ్జరీ రిసార్ట్ మరియు టూరిజం హబ్గా మార్చేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు సంబంధించి ఏపీటీడీసీ (APTDC) అర్హులైన హాస్పిటాలిటీ సంస్థల నుండి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటెస్ట్ (EOI) ను ఆహ్వానించింది. ప్రస్తుత భవనాలతో పాటు కొండ దిగువన ఉన్న 9 ఎకరాలను అభివృద్ధి చేసే అవకాశం కల్పించగా, దరఖాస్తులకు జూలై 10ని చివరి తేదీగా నిర్ణయించారు.

రుషికొండ భవనాలపై ఏపీటీడీసీ కీలక నిర్ణయం
రుషికొండ భవనాలపై ఏపీటీడీసీ కీలక నిర్ణయం
  • ప్రజల సందర్శనకు వ్యూయింగ్ ఏరియాలు తప్పనిసరి.. లీజు నిబంధనల్లో స్పష్టం చేసిన APTDC

  • తాజ్, లీలా వంటి అంతర్జాతీయ హోటల్స్ రేసులోకి? రుషికొండ లీజుకు జూలై 10 వరకు గడువు

  • సీఆర్జెడ్ నిబంధనల ప్రకారమే అదనపు నిర్మాణాలు.. ఏపీ టూరిజం కీలక మార్గదర్శకాలు

Rushikonda: విశాఖపట్నంలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రతిష్టాత్మక రుషికొండ హిల్టాప్ భవనాల సముదాయాన్ని ఆదాయ వనరుగా మార్చేందుకు ఏపీ ప్రభుత్వం తుది నిర్ణయానికి వచ్చింది. ఈ భవనాల ఆపరేషన్, మెయింటెనెన్స్ (O&M) మరియు మార్కెటింగ్ బాధ్యతలను ప్రైవేట్ భాగస్వామ్యంతో లీజుకు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆసక్తి ఉన్న ప్రముఖ సంస్థల నుండి 'ఆసక్తి వ్యక్తీకరణ' (Expression of Interest - EOI) ని ఆహ్వానిస్తూ ఏపీటీడీసీ (APTDC) అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ ప్రాజెక్టు కింద మొత్తం 9.8 ఎకరాల హిల్టాప్ స్థలంలోని ఐదు భవనాల సముదాయాన్ని ప్రైవేట్ లీజుకు అప్పగించనున్నారు. దీనితో పాటు కొండ దిగువన ఉన్న మరో 9 ఎకరాల భూమిని కూడా హోటళ్లు, లగ్జరీ రిసార్టులు మరియు పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం వినియోగించనున్నారు. అయితే ఈ ప్రాజెక్టులో సాధారణ ప్రజల సందర్శనార్థం వ్యూయింగ్ ఏరియాలు మరియు ఓపెన్ స్పేస్లను తప్పనిసరిగా ఉంచాలని నిబంధన విధించారు.

ప్రస్తుత భవన సముదాయంతో పాటు, అదనపు అభివృద్ధి కోసం రెండు ఖాళీ స్థలాలలో సీఆర్జెడ్ (CRZ) నిబంధనలకు లోబడి మొత్తం 2,400 చదరపు మీటర్ల పరిధిలో, దాదాపు 4,800 చదరపు మీటర్ల వరకు జీ+1 (G+1) నిర్మాణాలకు అనుమతి ఇవ్వనున్నారు. హాస్పిటాలిటీ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో మంచి అనుభవం ఉండి, పాజిటివ్ నెట్వర్త్ కలిగిన అంతర్జాతీయ, జాతీయ హోటల్ చైన్ డెవలపర్లు ఈ EOI దాఖలు చేయడానికి జూలై 10 సాయంత్రం 5 గంటల వరకు గడువు విధించారు.

Tags

Be the first to react

Latest