TDP సిద్ధాంతం కోసం పోరాడిన ఇద్దరి కార్య కర్తల ప్రేమ.. తిరుమలలో "శ్వేత బ్రహ్మం" వివాహ బంధంగా మారిన వేళ! శ్రేణుల్లో ఆనందోత్సాహం!

Nara Chandrababu Naidu గారి జోలికి వస్తె ఖబడ్దార్ అని చంద్రబాబు గారి ఇంటి పై దాడికి వచ్చిన వారి వాహనాలను తరిమి తరిమి కొట్టిన టీడీపీ సైనికుడు నాదెండ్ల బ్రహ్మం చౌదరి. దాదాపు రెండున్నర దశాబ్దాల క్రితం విద్యార్థి నాయకుడిగా తెలుగుదేశం పార్టీలో అడుగుపెట్టిన వ్యక్తి. అప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీ కోసం నిజాయితీగా, నిబద్ధతతో పనిచేస్తూనే ఉన్నాడు.

TDP
TDP

ఆర్టికల్ by బండారు వంశీ

#వరుడు 
 Nara Chandrababu Naidu గారి జోలికి వస్తె ఖబడ్దార్ అని చంద్రబాబు గారి ఇంటి పై దాడికి వచ్చిన వారి వాహనాలను తరిమి తరిమి కొట్టిన టీడీపీ సైనికుడు నాదెండ్ల బ్రహ్మం చౌదరి. 

#వధువు
పార్టీ కష్టకాలంలో ఉన్నపుడు UKలో ఉన్నప్పటికీ తన గళాన్ని వినిపించి YSR Congress  Party - YSRCP సోషల్ సైకోల దాడిలో వ్యక్తిత్వ హననానికి గురై అక్రమ కేసులు ఎదుర్కుని అప్పటి ప్రభుత్వం అక్రమ LOC జారీ చేయగా తన తండ్రి మరణిస్తే చివరిచూపు కోసం భారతదేశం కూడా రాలేక తనలో తాను బాధను దిగమింగుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం Telugu Desam Party (TDP) అధికారంలోకి రావాలి అని పోరాడిన పసుపు సైనికురాలు గౌతమి శ్వేత.

TDP

బ్రహ్మం చౌదరి దాదాపు రెండున్నర దశాబ్దాల క్రితం విద్యార్థి నాయకుడిగా తెలుగుదేశం పార్టీలో అడుగుపెట్టిన వ్యక్తి. అప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీ కోసం నిజాయితీగా, నిబద్ధతతో పనిచేస్తూనే ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారి ఇంటిపై జోగి రమేష్ దాడి చేసిన సమయంలో... చాలామంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు, మాటలతో ఖండించారు. కానీ బ్రహ్మం చౌదరి మాత్రం పల్నాటి పౌరుషం చూపించాడు. దాడికి వచ్చిన వాహనాలను ధ్వంసం చేసి, "చంద్రబాబు జోలికి వస్తే ఖబడ్దార్" అని చేతల్లో చూపించిన టీడీపీ సైనికుడు. యువనేత Nara Lokesh నారా లోకేష్ గారి యువగళం పాదయాత్రలో మొదటి అడుగు నుంచి చివరి అడుగు వరకు నడిచిన అతికొద్దిమంది నాయకుల్లో బ్రహ్మం చౌదరి ఒకరు. పార్టీ కోసం దర్శి నియోజకవర్గ పరిశీలకుడిగా పనిచేస్తున్న సమయంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో చావు అంచుల వరకు వెళ్లినా... పార్టీ కోసం పనిచేయడంలో మాత్రం వెనక్కి తగ్గలేదు. 

ఇక గౌతమీ శ్వేత గురించి చెప్పాలంటే...
ఉన్నత చదువుల కోసం లండన్లో ఉన్న సమయంలోనే 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేస్తూ, వేధింపులకు గురి చేస్తున్న సమయంలో విదేశాల్లో నుంచే ప్రభుత్వ విధానాలను ప్రశ్నించింది.
వైసీపీ సోషల్ మీడియా దాడులు, వ్యక్తిత్వ హననాలు, పోలీసు కేసులు... ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎక్కడా వెనక్కి తగ్గలేదు. పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ, జగన్ మోహన్ రెడ్డి ప్రజావ్యతిరేక విధానాలను వినూత్నంగా ఎండగట్టింది. ఆమె పోరాటం చంద్రబాబు నాయుడు గారి దృష్టిని కూడా ఆకర్షించింది.
ఆమెపై లుక్ అవుట్ సర్క్యులర్ (LOC) జారీ చేసినా భయపడలేదు. ఒకవైపు కేసులు... మరోవైపు వ్యక్తిత్వ హననాలు... అయినా పార్టీ కోసం తన పోరాటాన్ని ఆపలేదు.

TDP

ఆ పోరాటంలో ఆమె చెల్లించిన అతిపెద్ద మూల్యం... 2023లో తన తండ్రి మరణించినా, భారతదేశానికి వచ్చి చివరి చూపు కూడా చూడలేకపోవడం. పార్టీ కోసం, తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఆ బాధను కూడా భరించింది. చివరకు 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే భారతదేశంలో అడుగుపెట్టగలిగింది. ఒకరు క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పోరాడిన యోధుడు... మరొకరు విదేశాల్లో ఉండి సోషల్ మీడియా వేదికగా పార్టీ కోసం పోరాడిన యోధురాలు.

ఇద్దరి జీవితాల్లోనూ పార్టీ ముందు... వ్యక్తిగత జీవితం తర్వాత... అలాంటి ఇద్దరు సిద్ధాంత సైనికులు... ఇద్దరు పోరాట యోధులు... బ్రహ్మం చౌదరి, గౌతమీ శ్వేత ఈరోజు తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాక్షిగా, శ్రీ శృంగేరి గాయత్రీ పీఠంలో ఒక్కటయ్యారు. వీరి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో నిండిపోవాలని, పార్టీకి, సమాజానికి ఇదే అంకితభావంతో సేవ చేస్తూ మరెన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ... నూతన వధూవరులకు హృదయపూర్వక వివాహ శుభాకాంక్షలు. 

TDP

Be the first to react

Latest