అమరావతి భూముల వ్యవహారం.. ‘సాక్షి’కి ₹10 కోట్ల పరువు నష్టం నోటీసులు!

Amaravati Land Controversy: అమరావతి రాజధాని భూముల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. తమ కుటుంబంపై అసత్య ఆరోపణలతో కథనాలు ప్రచురించి పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించారని ఆరోపిస్తూ వెలగపూడికి చెందిన రైతు కంచర్ల సాంబశివరావు ‘సాక్షి’ పత్రిక యాజమాన్యానికి లీగల్ నోటీసులు పంపారు. ఈ వ్యవహారంలో రూ.10 కోట్ల పరువు నష్టం పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. త్వరలో వందేళ్ల వయసుకు చేరుకోనున్న సాంబశివరావు తరఫున ఈ నెల 11న న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్‌బాబు నోటీసులు జారీ చేశారు.

Amaravati Land Controversy
Amaravati Land Controversy

వందేళ్ల వయసుకు చేరువలో రైతు.. ‘సాక్షి’పై రూ.10 కోట్ల దావాకు సిద్ధం..

అమరావతి భూముల కథనాలపై రైతు ఆగ్రహం.. సాక్షికి లీగల్ నోటీసులు..

అమరావతి రాజధాని భూముల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. తమ కుటుంబంపై అసత్య ఆరోపణలతో కథనాలు ప్రచురించి పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించారని ఆరోపిస్తూ వెలగపూడికి చెందిన రైతు కంచర్ల సాంబశివరావు ‘సాక్షి’ పత్రిక యాజమాన్యానికి లీగల్ నోటీసులు పంపారు. ఈ వ్యవహారంలో రూ.10 కోట్ల పరువు నష్టం పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. త్వరలో వందేళ్ల వయసుకు చేరుకోనున్న సాంబశివరావు తరఫున ఈ నెల 11న న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్‌బాబు నోటీసులు జారీ చేశారు.

అమరావతి భూసమీకరణకు సంబంధించి ‘గ్రామ కంఠం ముసుగులో భూ మాయాజాలం-రాజధాని భూసేకరణలో రూ.12 వేల కోట్ల కుంభకోణం’, ‘బాబు ప్యాలెస్‌కు భూమినిచ్చినందుకు నజరానా’ అనే శీర్షికలతో ప్రచురించిన కథనాల్లో తమ కుటుంబంపై తప్పుడు ఆరోపణలు చేశారని సాంబశివరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబానికి భూమి విక్రయించినందుకు ప్రతిఫలంగా తమ కుటుంబానికి చెందిన 1.76 ఎకరాలను గ్రామకంఠం పేరుతో భూసమీకరణ నుంచి మినహాయించారన్న ప్రచారాన్ని ఆయన ఖండించారు.

వెలగపూడిలోని సర్వే నంబరు 91/1ఎఫ్‌లో తమ కుటుంబ సభ్యుల పేర్లపై ఎలాంటి భూమి లేదని సాంబశివరావు స్పష్టం చేసినట్లు నోటీసులో పేర్కొన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా తమ కుటుంబంపై ఆరోపణలు చేస్తూ కథనాలు ప్రచురించడం వల్ల వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా తీవ్ర మనోవేదనకు గురయ్యామని ఆయన తరఫు న్యాయవాది వివరించారు.

కంచర్ల కుటుంబానికి వెలగపూడి గ్రామంలో సుదీర్ఘ చరిత్ర ఉందని నోటీసులో ప్రస్తావించారు. సాంబశివరావు తండ్రి అంజయ్య స్వాతంత్ర్య సమరయోధుడని, తల్లి శాంతికుమారి వెలగపూడి గ్రామ పంచాయతీ అధ్యక్షురాలిగా సేవలందించారని తెలిపారు. సాంబశివరావు తన జీవితాన్ని వ్యవసాయంతో పాటు సమాజ సేవకు అంకితం చేశారని పేర్కొన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం ఆయన కుటుంబం కూడా భూసమీకరణ పథకంలో భూములు ఇచ్చిందని నోటీసులో వివరించారు.

వ్యవసాయం, ప్రజాసేవలో జీవితం గడిపిన వ్యక్తిపై అవినీతి ఆరోపణలు చేయడం వల్ల సాంబశివరావుతో పాటు కుటుంబ సభ్యులందరూ తీవ్రంగా మనస్తాపం చెందారని న్యాయవాది పేర్కొన్నారు. ప్రచురించిన కథనాల్లోని ఆరోపణలను ఉపసంహరించుకోవడంతో పాటు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కంచర్ల కుటుంబం డిమాండ్ చేసింది.

లీగల్ నోటీసులు అందుకున్న 15 రోజుల్లోగా తమ డిమాండ్లను నెరవేర్చకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్‌)లోని సెక్షన్ 356 ప్రకారం క్రిమినల్ ఫిర్యాదు చేయడంతో పాటు రూ.10 కోట్ల నష్టపరిహారం కోరుతూ సివిల్ దావా వేస్తామని స్పష్టం చేశారు.

ఈ నోటీసులను జగతి పబ్లికేషన్స్‌తో పాటు ఆ సంస్థ చైర్‌పర్సన్ వైఎస్ భారతీరెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్, డైరెక్టర్లు, ఎడిటర్, ప్రింటర్-పబ్లిషర్, రెసిడెంట్ ఎడిటర్, సంబంధిత కథనాల రిపోర్టర్‌కు పంపినట్లు న్యాయవాది తెలిపారు. ఈ వ్యవహారంలో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.

Tags

Be the first to react

Latest