ఆర్‌డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్లకు పండగే పండగ.. రూ.620 కోట్లు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం.
అమరావతి: ఆర్‌డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఊరటనిచ్చింది. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న బిల్లుల చెల్లింపులకు ప్రభుత్వం రూ.620 కోట్లు విడుదల చేసింది. దీంతో జల్ జీవన్ మిషన్, ఇతర గ్రామీణ నీటి సరఫరా పనులు చేపట్టిన కాంట్రాక్టర్లలో హర్షం వ్యక్తమైంది
- పెండింగ్ బిల్లుల చెల్లింపుల కోసం ప్రభుత్వం రూ.620 కోట్లు విడుదల చేసింది.
- ప్రభుత్వ నిర్ణయంపై నవ్యాంధ్ర ఆర్‌డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది.
- స్పర్శ పథకం కింద సుమారు రూ.138 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉండగా.. రూ.70 కోట్లు చెల్లింపు జరిగింది.
అమరావతి : ఆర్‌డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్లకు AP Government కీలక ఊరటనిచ్చింది. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న బిల్లుల చెల్లింపులకు ప్రభుత్వం రూ.620 కోట్లు విడుదల చేసింది. దీంతో జల్ జీవన్ మిషన్, ఇతర గ్రామీణ నీటి సరఫరా పనులు చేపట్టిన కాంట్రాక్టర్లలో హర్షం వ్యక్తమైంది.
ప్రభుత్వ నిర్ణయానికి కృతజ్ఞతలు తెలిపిన నవ్యాంధ్ర ఆర్‌డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయం వద్ద సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
జల్ జీవన్ మిషన్ బిల్లులకు చెల్లింపులు
జల్ జీవన్ మిషన్ కాంట్రాక్టర్లకు సంబంధించి 2026 మార్చి 31 వరకు పెండింగ్‌లో ఉన్న బిల్లుల చెల్లింపులు పూర్తయ్యాయని అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కోనేరు శ్రీనివాస్ ప్రసాద్ తెలిపారు. కాంట్రాక్టర్లతో జూన్ 18న జరిగిన సమావేశంలో పెండింగ్ పేమెంట్లను త్వరితగతిన పరిష్కరిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారని ఆయన గుర్తుచేశారు.
ఆ హామీ మేరకు అధికారులు చర్యలు తీసుకుని బిల్లుల చెల్లింపులు చేపట్టారని శ్రీనివాస్ ప్రసాద్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో కాంట్రాక్టర్లకు పెండింగ్ మొత్తాలు అందుతున్నాయని పేర్కొంటూ సీఎంకు, డిప్యూటీ సీఎంకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
రెట్రోఫిట్టింగ్ పనుల బిల్లులూ క్లియర్
రెట్రోఫిట్టింగ్ పనులకు సంబంధించి కూడా ప్రభుత్వం భారీగా బిల్లులు చెల్లించినట్లు అసోసియేషన్ వెల్లడించింది. 2024 నవంబర్ నుంచి 2026 మార్చి 31 వరకు రూ.647 కోట్ల విలువైన బిల్లులు చెల్లించినట్లు శ్రీనివాస్ ప్రసాద్ తెలిపారు.
మార్చి 31 వరకు పెండింగ్‌లో ఉన్న రెట్రోఫిట్టింగ్ బిల్లులను పూర్తిగా చెల్లించడంతో కాంట్రాక్టర్లపై ఉన్న ఆర్థిక ఒత్తిడి కొంతవరకు తగ్గిందన్నారు.
స్పర్శ పథకం బిల్లులపై ఇంకా చెల్లింపులు
స్పర్శ పథకం కింద కాంట్రాక్టర్లకు సుమారు రూ.138 కోట్ల బిల్లులు రావాల్సి ఉండగా, సాంకేతిక సమస్యల కారణంగా ఇప్పటివరకు సుమారు రూ.70 కోట్లు మాత్రమే చెల్లించినట్లు అసోసియేషన్ తెలిపింది. మిగిలిన మొత్తాన్ని కూడా త్వరలోనే చెల్లిస్తామని అధికారులు హామీ ఇచ్చినట్లు శ్రీనివాస్ ప్రసాద్ వెల్లడించారు.
ఎంఎస్‌ఎంఈ కాంట్రాక్టర్లకు ఆర్థిక ఉపశమనం
పెండింగ్ బిల్లుల విడుదలతో ఆర్‌డబ్ల్యూఎస్ విభాగంలో పనిచేస్తున్న ఎంఎస్‌ఎంఈ కాంట్రాక్టర్లకు గణనీయమైన ఆర్థిక ఉపశమనం లభించినట్లు అసోసియేషన్ పేర్కొంది. బిల్లులు సకాలంలో అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాంట్రాక్టర్లతో పాటు వారిపై ఆధారపడిన కుటుంబాలకు కూడా తాజా చెల్లింపులు ఊరటనిచ్చాయని తెలిపింది.
ఇకపై కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులు మరింత క్రమబద్ధంగా జరిగేలా నెలవారీ నిర్దిష్ట చెల్లింపు విధానాన్ని రూపొందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ఈ విధానం అమల్లోకి వస్తే కాంట్రాక్టర్ల నగదు ప్రవాహ సమస్యలు తగ్గే అవకాశం ఉందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
Tags
Be the first to react