ఏపీ మున్సిపల్ ఎన్నికలు 2026: ఫేజ్-2 టీడీపీ అభ్యర్థుల లిస్ట్!
AP Municipal Elections 2026: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఫేజ్-2కు సంబంధించి టీడీపీ అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. ఈ విడతలో ఒక మున్సిపల్ కార్పొరేషన్, 10 మున్సిపాలిటీలు, నాలుగు నగర పంచాయతీలకు అభ్యర్థులను ప్రకటించారు. మొత్తం 15 పట్టణ స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల వివరాలు వెల్లడయ్యాయి.
ఏపీ మున్సిపల్ ఎన్నికలు 2026: ఫేజ్-2 అభ్యర్థులు ఖరారు.. 15 పట్టణ స్థానాలకు పేర్లు ప్రకటన..
మున్సిపల్ ఎన్నికల వేడి షురూ.. రెండో విడతలో 15 పట్టణాలకు అభ్యర్థుల ఖరారు..
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఫేజ్-2కు సంబంధించి టీడీపీ అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. ఈ విడతలో ఒక మున్సిపల్ కార్పొరేషన్, 10 మున్సిపాలిటీలు, నాలుగు నగర పంచాయతీలకు అభ్యర్థులను ప్రకటించారు. మొత్తం 15 పట్టణ స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల వివరాలు వెల్లడయ్యాయి.
మున్సిపల్ కార్పొరేషన్ విభాగంలో మంగళగిరి–తాడేపల్లి నుంచి పేరం ఏడుకొండలు అభ్యర్థిగా ఖరారయ్యారు. మున్సిపాలిటీల విషయానికి వస్తే ఆముదాలవలస నుంచి కూన ప్రమీల, తణుకు నుంచి బసవ వి.వి.ఎస్. రామకృష్ణ, పాలకొల్లు నుంచి అబోతుల ఉషారాణి పేర్లు ప్రకటించారు. తాడిగడప నుంచి పీతా గోపిచంద్, గుడివాడ నుంచి మారీదు కరుణ, నరసరావుపేట నుంచి నాగసరపు రూపేష్ గుప్తా అభ్యర్థులుగా ఖరారయ్యారు.
అలాగే పొన్నూరు మున్సిపాలిటీకి కండ్రు విజయలక్ష్మి, కందుకూరుకు పిడికిటి వెంకటేశ్వర్లు, గూడూరుకు చౌటూరి శిరీష, శ్రీకాళహస్తికి పేట బాలాజీ అభ్యర్థులుగా ఎంపికయ్యారు. దీంతో ఈ విడతలో మున్సిపాలిటీలకు సంబంధించి మొత్తం 10 మంది అభ్యర్థుల పేర్లు వెల్లడయ్యాయి.
నగర పంచాయతీల విభాగంలో చింతలపూడి నుంచి ఖంబం ఎస్తేరు రాణి, పొదిలి నుంచి వరికుంట్ల అనిల్ కుమార్, అల్లూరు నుంచి తోటకూర సునీల్ కుమార్, బి.కొత్తకోట నుంచి కుడుము శ్రీనివాసులు అభ్యర్థులుగా ఖరారయ్యారు.
ఫేజ్-2లో ప్రకటించిన ఈ అభ్యర్థుల జాబితాతో ఆయా పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారనున్నాయి. అభ్యర్థులు తమ తమ ప్రాంతాల్లో ప్రజల మద్దతు కూడగట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల ప్రచారం, స్థానిక సమస్యలు, అభ్యర్థుల ప్రజాబలం వంటి అంశాలు రానున్న రోజుల్లో కీలకంగా మారనున్నాయి.
Be the first to react