Indigo: క్యాబిన్ బ్యాగేజీతో ప్రయాణికులకు శుభవార్త.. ఇండిగో ‘లైట్’ టికెట్లు ప్రారంభం!

Indigo: విమాన ప్రయాణాన్ని మరింత అందుబాటులోకి తీసుకురావడానికి ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో కొత్త నిర్ణయం తీసుకుంది. కేవలం క్యాబిన్ బ్యాగేజీతో ప్రయాణించే ప్రయాణికుల కోసం తక్కువ ధరతో ‘ఇండిగో లైట్ (IndiGo Lite)’ పేరుతో కొత్త టికెట్ విధానాన్ని జూలై 1 నుంచి అందుబాటులోకి తీసుకొచ్చింది.

IndiGo New Offer
IndiGo New Offer

తక్కువ ధరలో విమాన ప్రయాణం.. ‘ఇండిగో లైట్’ ఫేర్ అందుబాటులోకి..

జూలై 15 నుంచి ‘ఇండిగో లైట్’ ప్రయాణం.. దేశీయ, అంతర్జాతీయ విమానాలకు..

విమాన ప్రయాణాన్ని మరింత అందుబాటులోకి తీసుకురావడానికి ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో కొత్త నిర్ణయం తీసుకుంది. కేవలం క్యాబిన్ బ్యాగేజీతో ప్రయాణించే ప్రయాణికుల కోసం తక్కువ ధరతో ‘ఇండిగో లైట్ (IndiGo Lite)’ పేరుతో కొత్త టికెట్ విధానాన్ని జూలై 1 నుంచి అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఇటీవల ఇరాన్ యుద్ధం ప్రభావంతో జెట్ ఇంధన ధరలు పెరగడం, కొన్ని దేశాల గగనతల మార్గాలు మూతపడడం, అలాగే విమానయాన సంస్థల మధ్య పోటీ తీవ్రంగా ఉండటంతో ఖర్చులు పెరిగాయి. ఈ పరిస్థితుల్లో ప్రయాణికులకు తక్కువ ధరలో టికెట్లు అందించేందుకు విమానయాన సంస్థలు తమ సేవలను విడివిడిగా అందించే విధానాన్ని అనుసరిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఇండిగో ప్రవేశపెట్టిన ‘ఇండిగో లైట్’ చార్జీలు ఎకానమీ క్లాస్లో ప్రయాణించే, చెక్-ఇన్ లగేజీ అవసరం లేని ప్రయాణికులకు ప్రత్యేకంగా రూపొందించారు. ఈ టికెట్తో ప్రయాణించే వారికి గరిష్టంగా 7 కిలోల క్యాబిన్ బ్యాగేజీ మాత్రమే తీసుకెళ్లే అవకాశం ఉంటుంది.

ఈ కొత్త చార్జీలు ఇండిగో నిర్వహించే దేశీయ, అంతర్జాతీయ విమానాలన్నింటికీ వర్తిస్తాయి. అయితే ఈ టికెట్లను ప్రస్తుతం ఇండిగో అధికారిక బుకింగ్ వేదికల ద్వారా మాత్రమే బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. జూలై 1 నుంచి బుకింగ్ ప్రారంభం కాగా, జూలై 15 నుంచి ఈ టికెట్లపై ప్రయాణం చేయవచ్చు.

ఈ టికెట్లో ప్రయాణికులకు అదనపు చార్జీలు లేకుండానే ఒక సీటును ఆటోమేటిక్గా కేటాయిస్తారు. తక్కువ ఖర్చుతో, అవసరమైన సేవలతో మాత్రమే ప్రయాణించాలనుకునే వారికి ఈ కొత్త విధానం ప్రయోజనకరంగా ఉంటుందని ఇండిగో తెలిపింది.

కాగా, గత నెలలో ఎయిర్ ఇండియా కూడా ధరపై ఎక్కువ దృష్టి పెట్టే ప్రయాణికుల కోసం ఉచిత భోజనం లేని బేసిక్ ఎకానమీ టికెట్ను ప్రవేశపెట్టింది. దీంతో భారతీయ విమానయాన రంగంలో తక్కువ ధరల టికెట్ల కోసం పోటీ మరింత పెరుగుతున్నట్లు కనిపిస్తోంది.

Be the first to react

Latest