2025 గ్లోబల్ టాలెంట్ కంపెటిటివ్‌నెస్ ఇండెక్స్ (GTCI)లో సింగపూర్ తొలిసారి ప్రపంచంలో మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఇది అత్యాధునిక టెక్నాలజీలు, AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), డిజిటల్ స్కిల్స్, అడాప్టివ్ స్కిల్స్‌పై సుదీర్ఘకాలంగా పెట్టుబడులు పెట్టి, ఆ దిశగా శ్రామిక శక్తి ని తీర్చిదిద్దిన ఫలితమని నివేదిక స్పష్టంగా తెలిపింది. ఈ నివేదికను ఇన్సియాడ్, పోర్చులాన్స్ ఇన్స్టిట్యూట్ సంయుక్తంగా విడుదల చేశాయి. మొత్తం 135 దేశాలపై 77 సూచకాల ఆధారంగా ఈ ర్యాంకింగ్స్ నిర్ణయించబడ్డాయి. AI పట్ల సన్నద్ధత, సాఫ్ట్ స్కిల్స్, డిజిటల్ సామర్థ్యాలు, ఇన్నోవేషన్ సామర్థ్యం, టాలెంట్ ఆకర్షణ, నిలుపుదల వంటి అంశాలు ముఖ్య ప్రమాణాలుగా పరిగణించారు.
ఈ జాబితాలో అమెరికా పెద్ద పతనం నమోదు చేసుకుంది. గతేడాది మూడో స్థానంలో ఉన్న USA ఈసారి 9వ స్థానానికి పడిపోయింది. పలుదేశాల్లో పని మార్కెట్ల మార్పులు, టాలెంట్ మైగ్రేషన్, గ్లోబల్ పోటీ, ఆర్థిక అస్థిరతలు ఈ పతనానికి కారణమని నివేదిక పేర్కొంది. అదే సమయంలో యూరప్ దేశాలు ఇంకా ఆధిపత్యం కొనసాగించాయి. టాప్ 25లో 18 స్థానాలను యూరప్ దేశాలే దక్కించుకున్నాయి. అయితే చైనా మాత్రం 40వ స్థానంనుంచి 53వ స్థానానికి దిగజారి, వర్క్‌ఫోర్స్ సమస్యలు, డేటా అందుబాటు లోపాలు ప్రధాన కారణాలిగా చెప్పబడ్డాయి.
సింగపూర్ ప్రత్యేకత ఏమిటంటే, అక్కడ అడాప్టివ్ స్కిల్స్ విభాగంలో ప్రపంచంలోనే మొదటి స్థానం సాధించింది. అలాగే టాలెంట్ రిటెన్షన్ విభాగంలో ఏకంగా ఏడు స్థానాలు మెరుగుపరచి కీలక పురోగతి సాధించింది. క్రాస్-ఫంక్షనల్ స్కిల్స్, ఇన్నోవేషన్ సామర్థ్యాలపై ప్రభుత్వం వరుసగా అమలు చేసిన విధానాలు ఈ ఫలితానికి ముఖ్య కారణం. నిపుణుల వ్యాఖ్యల ప్రకారం, భవిష్యత్తులో అంతరాయం ని ఆవిష్కరణ గా మార్చగలిగిన దేశాలే విజయాన్ని అందుకుంటాయని, AI + soft skills కలయికే రేపటి ప్రపంచాన్ని ముందుకు నడపబోతోందని స్పష్టం చేశారు.
అదే నివేదికలో రిసోర్సులు పరిమితంగా ఉన్నా కూడా టాలెంట్ డెవలప్‌మెంట్‌ను అద్భుత స్థాయిలో తీర్చిదిద్దుతున్న దేశాలుగా ఇజ్రాయెల్, సింగపూర్, దక్షిణ కొరియా ఉదాహరణ చూపించాయి. అంతేకాక తక్కువ ఆదాయ దేశాలైన తజికిస్తాన్, కెన్యా, శ్రీలంక, ఉజ్బెకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలు టాలెంట్ అభివృద్ధిలో బలమైన పునాది ఏర్పరుస్తున్నాయని పేర్కొంది.
ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ టాలెంట్ రిటెన్షన్‌లో సింగపూర్ కంటే మెరుగ్గా ఉన్నప్పటికీ, అడాప్టివ్ స్కిల్స్ వంటి అంశాల్లో వెనుకబడి ఉన్నాయి. మొత్తానికి, ప్రపంచ టాలెంట్ పోటీలో ఇప్పట్లో AI నైపుణ్యాలు, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం, టీమ్‌వర్క్, ఇన్నోవేషన్, ఒత్తిడిలో సృజనాత్మకతనే దేశాలను ముందుకు నడిపే ప్రధాన శక్తిగా GTCI-2025 నివేదిక పేర్కొంది.