Light Flip 5G: సోషల్ మీడియా లేని 'లైట్ ఫ్లిప్ 5జీ' ఫోన్ విడుదల.. డిజిటల్ డిస్ట్రాక్షన్‌కు గుడ్‌బై!

Light Flip 5G: సోషల్ మీడియా, నిత్యం వచ్చే నోటిఫికేషన్లు, అంతులేని స్క్రోలింగ్‌తో విసిగిపోయిన వారికి ఇప్పుడు ఓ కొత్త ప్రత్యామ్నాయం అందుబాటులోకి రానుంది. డిజిటల్ వ్యసనాన్ని తగ్గించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన 'లైట్ ఫ్లిప్ 5జీ' (Light Flip 5G) అనే మినిమలిస్ట్ మొబైల్ ఫోన్‌ను కంపెనీ ప్రకటించింది. స్మార్ట్‌ఫోన్‌లో ఉండే సోషల్ మీడియా యాప్‌లు, వెబ్ బ్రౌజర్, ప్రకటనలతో నిండిన యాప్‌లకు పూర్తిగా దూరంగా ఉండేలా ఈ ఫోన్‌ను రూపొందించారు.

Light Flip 5G
Light Flip 5G

డిజిటల్ డీటాక్స్ కోరుకునేవారికి లైట్ ఫ్లిప్ 5జీ.. ధర, ఫీచర్లు ఇవే..

కేవలం అవసరమైన ఫీచర్లతో లైట్ ఫ్లిప్ 5జీ.. స్మార్ట్‌ఫోన్‌లకు భిన్నమైన అనుభవం..

సోషల్ మీడియా, నిత్యం వచ్చే నోటిఫికేషన్లు, అంతులేని స్క్రోలింగ్‌తో విసిగిపోయిన వారికి ఇప్పుడు ఓ కొత్త ప్రత్యామ్నాయం అందుబాటులోకి రానుంది. డిజిటల్ వ్యసనాన్ని తగ్గించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన 'లైట్ ఫ్లిప్ 5జీ' (Light Flip 5G) అనే మినిమలిస్ట్ మొబైల్ ఫోన్‌ను కంపెనీ ప్రకటించింది. స్మార్ట్‌ఫోన్‌లో ఉండే సోషల్ మీడియా యాప్‌లు, వెబ్ బ్రౌజర్, ప్రకటనలతో నిండిన యాప్‌లకు పూర్తిగా దూరంగా ఉండేలా ఈ ఫోన్‌ను రూపొందించారు.

డిజిటల్ డిస్ట్రాక్షన్‌కు గుడ్‌బై 
లైట్ ఫ్లిప్ 5జీ ప్రధాన లక్ష్యం వినియోగదారులు తమ సమయాన్ని అవసరమైన పనులకే వినియోగించేలా చేయడం. అందుకే ఇందులో సోషల్ మీడియా యాప్‌లు, వెబ్ బ్రౌజర్, ప్రకటనల ఆధారిత అప్లికేషన్లు ఉండవు. దీంతో అనవసర నోటిఫికేషన్లు, నిరంతర స్క్రోలింగ్ వంటి అలవాట్లకు చెక్ పడుతుందని కంపెనీ చెబుతోంది.

క్లాసిక్ ఫ్లిప్ ఫోన్.. ఆధునిక ఫీచర్లు 
పాతకాలపు క్లామ్‌షెల్ (ఫ్లిప్) డిజైన్‌లో రూపొందించిన ఈ ఫోన్ ఆధునిక అవసరాలకు అనుగుణంగా ఉంటుంది. బ్లాక్, నేవీ, రెడ్, పింక్, యెల్లో, లైట్ గ్రే వంటి పలు ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులోకి రానుంది. ఫోన్‌కు ప్రత్యేకంగా చార్మ్స్ లేదా చిన్న యాక్సెసరీలు తగిలించుకునే లూప్ కూడా ఏర్పాటు చేశారు.

లైట్ ఓఎస్‌తో ప్రత్యేక అనుభవం 
ఈ ఫోన్‌లో కంపెనీ అభివృద్ధి చేసిన లైట్ ఓఎస్ (Light OS) పనిచేస్తుంది. ఇది వినియోగదారుడి రోజువారీ అవసరాలపై మాత్రమే దృష్టి పెడుతుంది. అవసరం లేని యాప్‌లు, నోటిఫికేషన్లకు ఇందులో చోటు లేదు. అంతేకాకుండా డెవలపర్ ప్రోగ్రామ్ ద్వారా ఓపెన్ సోర్స్ టూల్స్ రూపొందించేందుకు కమ్యూనిటీకి అవకాశం కల్పించనున్నారు.

అయితే ప్రస్తుతం ఏ తరహా కమ్యూనిటీ టూల్స్ అందుబాటులోకి వస్తాయనే విషయంపై కంపెనీ ఇంకా పూర్తి వివరాలు వెల్లడించలేదు. అయితే అవి కూడా ఈ ఫోన్ మినిమలిస్ట్ తత్వానికి అనుగుణంగా, ఉపయోగకరమైన సేవలకే పరిమితం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

కమ్యూనికేషన్‌కు ప్రాధాన్యం 
స్మార్ట్‌ఫోన్‌ల మాదిరిగా క్లిష్టమైన ఇంటర్‌ఫేస్‌కు బదులుగా ఈ ఫోన్‌లో ప్రిడిక్టివ్ T9 టైపింగ్, వాయిస్-టు-టెక్స్ట్, ఆడియో మెసేజింగ్, అలాగే తొమ్మిది స్పీడ్ డయల్ షార్ట్‌కట్‌లు అందుబాటులో ఉంటాయి. దీంతో సులభంగా కాల్స్, సందేశాలు పంపుకునే అవకాశం ఉంటుంది.

సోషల్ మీడియా లేకపోయినా రోజువారీ జీవితానికి అవసరమైన అనేక సేవలను ఈ ఫోన్‌లో అందించారు. వాటిలో నావిగేషన్,మొబైల్ హాట్‌స్పాట్, మ్యూజిక్, ప్లేయర్, పోడ్‌కాస్ట్‌లు, వాయిస్ మెమోలు, 2FA అథెంటికేటర్, అలారం, క్యాలెండర్, కాలిక్యులేటర్, వాతావరణ సమాచారం వంటి టూల్స్ ఉన్నాయి.

12 మెగాపిక్సెల్ కెమెరా
ఈ ఫోన్‌లో 12 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఫొటోలు తీసేందుకు అవసరమైన ఇంటిగ్రేటెడ్ ఫ్లాష్‌లైట్ కూడా ఉంది. అయితే కెమెరా సెన్సార్, వీడియో రికార్డింగ్ సామర్థ్యం, అపర్చర్ వంటి ఇతర సాంకేతిక వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. లైట్ ఫ్లిప్ 5జీ ధర 299 అమెరికన్ డాలర్లుగా నిర్ణయించారు. ప్రస్తుతం ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యాయి.

ఈ ఫోన్ డెలివరీలను కంపెనీ 2027 ఏప్రిల్ నుంచి మే వరకు నాలుగు దశల్లో చేపట్టనుంది.
తొలి దశ – 2027 ఏప్రిల్ ప్రారంభంలో
రెండో దశ – ఏప్రిల్ చివర్లో
మూడో దశ – మే ప్రారంభంలో
నాలుగో దశ – మే చివర్లో వినియోగదారులకు ఫోన్ అందించనున్నారు.

సిమ్ వినియోగంపై స్పష్టత లేదు
కంపెనీ ఈ ఫోన్‌ను 299 డాలర్లకు నేరుగా కొనుగోలు చేసే అవకాశంతో పాటు, 39 డాలర్ల నెలవారీ ఈఎంఐతో సొంత సర్వీస్ ప్లాన్ ద్వారా కూడా అందించనుంది. అయితే వినియోగదారులు తమ సొంత సిమ్ కార్డును ఉపయోగించవచ్చా? ఫోన్ క్యారియర్ అన్‌లాక్ రూపంలో వస్తుందా? అనే విషయాలపై ఇప్పటివరకు కంపెనీ అధికారికంగా ఎలాంటి సమాచారం వెల్లడించలేదు.

మినిమలిజానికి కొత్త నిర్వచనం 
సాంకేతికత మన జీవితాన్ని సులభతరం చేయాలే కానీ, సమయాన్ని హరించే సాధనంగా మారకూడదనే ఆలోచనతో లైట్ ఫ్లిప్ 5జీ రూపొందింది. సోషల్ మీడియా, ప్రకటనలు, అనవసర యాప్‌లకు దూరంగా ఉండి, కమ్యూనికేషన్‌తో పాటు అవసరమైన సేవలను మాత్రమే అందించే ఈ ఫోన్, డిజిటల్ డీటాక్స్ కోరుకునే వినియోగదారులకు ఒక కొత్త ప్రత్యామ్నాయంగా నిలవనుంది.

Be the first to react

Latest