WiFi Speed: వైఫై పాస్‌వర్డ్ నుంచి రౌటర్ పొజిషన్ వరకు... ఇంటర్నెట్ వేగాన్ని పెంచే సీక్రెట్స్!

WiFi Speed: ప్రస్తుత డిజిటల్ కాలంలో ప్రతీ ఇంట్లోనూ వైఫై కనెక్షన్ అత్యంత ఆవశ్యకంగా మారింది. ఆఫీస్ వర్క్, ఆన్‌లైన్ తరగతులు, సినిమాలు చూడటం లేదా గేమింగ్.. ఇలా దేనికైనా వేగవంతమైన ఇంటర్నెట్ ఉండాల్సిందే.

ఇంటర్నెట్ వేగాన్ని పెంచే సీక్రెట్స్
ఇంటర్నెట్ వేగాన్ని పెంచే సీక్రెట్స్

రూపాయి ఖర్చు లేకుండా వైఫై స్పీడ్ పెంపు...

వైఫై రౌటర్ స్థానం మారిస్తే అద్భుత ఫలితాలు...

స్లో ఇంటర్నెట్‌కు చెక్...

WiFi Speed: ప్రస్తుత డిజిటల్ కాలంలో ప్రతీ ఇంట్లోనూ వైఫై కనెక్షన్ అత్యంత ఆవశ్యకంగా మారింది. ఆఫీస్ వర్క్, ఆన్‌లైన్ తరగతులు, సినిమాలు చూడటం లేదా గేమింగ్.. ఇలా దేనికైనా వేగవంతమైన ఇంటర్నెట్ ఉండాల్సిందే. అయితే చాలామంది ఇళ్లలో వైఫై వేగం మందగించడం, వీడియోలు బఫరింగ్ కావడం వంటి సమస్యలు ఎదుర్కొంటుంటారు. దీనికోసం ప్రతీసారీ టెక్నీషియన్‌ను పిలవాల్సిన అవసరం లేదు. మన ఇంట్లోనే కొన్ని చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా వైఫై స్పీడ్‌ను సులభంగా పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

రౌటర్ సరియైన స్థానంలో ఉంచడం:

వైఫై వేగం తగ్గడానికి ప్రధాన కారణం రౌటర్‌ను తప్పుడు స్థానంలో పెట్టడమే. రౌటర్‌ను ఎల్లప్పుడూ ఇంటికి మధ్యలో, కొద్దిగా ఎత్తైన ప్రదేశంలో ఉంచాలి. మూలల్లో లేదా గోడల వెనుక పెడితే సిగ్నల్స్ సరిగ్గా వ్యాపించవు. అలాగే టీవీ, మైక్రోవేవ్ ఓవెన్, కార్డ్‌లెస్ ఫోన్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు రౌటర్‌ను దూరంగా ఉంచడం శ్రేయస్కరం. ఈ సాధనాల నుంచి వచ్చే తరంగాలు వైఫై సిగ్నల్స్‌కు అంతరాయం కలిగిస్తాయి.

ఫ్రీక్వెన్సీ బ్యాండ్ మరియు రౌటర్ రీస్టార్ట్:

ప్రస్తుత రౌటర్లు డ్యూయల్ బ్యాండ్ (2.4 GHz మరియు 5GHz) ఫ్రీక్వెన్సీలతో వస్తున్నాయి. రౌటర్‌కు దగ్గరగా ఉన్నప్పుడు 5GHz బ్యాండ్‌కు కనెక్ట్ అయితే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ లభిస్తుంది. దూరంగా ఉన్నప్పుడు 2.4GHz నెట్‌వర్క్ పనిచేస్తుంది. అలాగే వారానికి ఒకసారైనా రౌటర్‌ను రీస్టార్ట్ (రెస్ట్/ఆఫ్ చేసి ఆన్) చేయడం వల్ల దాని క్యాచే మెమరీ క్లియర్ అయి ఇంటర్నెట్ వేగం పునరుద్ధరించబడుతుంది.

అనుసంధాన పరికరాల నియంత్రణ & సెక్యూరిటీ:

రౌటర్‌కు ఎక్కువ సంఖ్యలో మొబైళ్లు, ల్యాప్‌టాప్‌లు కనెక్ట్ అయి ఉన్నప్పుడు కూడా స్పీడ్ తగ్గుతుంది. అవసరం లేని పరికరాల వైఫైని డిస్‌కనెక్ట్ చేయడం మంచిది. అలాగే మీ వైఫై పాస్‌వర్డ్‌ను స్ట్రాంగ్‌గా ఉంచుకోవాలి. ఇతరులు మీ అనుమతి లేకుండా వైఫై ఉపయోగిస్తే వేగం గణనీయంగా తగ్గుతుంది. నాణ్యమైన కనెక్షన్ ఉన్నప్పటికీ ఇల్లు పెద్దదిగా ఉంటే వైఫై ఎక్స్‌టెండర్ (WiFi Extender) వాడటం ద్వారా అన్ని గదులకూ సమానంగా వేగం పొందే అవకాశం ఉంటుంది.

Tags

Be the first to react

Latest