ఏపీటీయస్ ఛైర్మన్ మన్నవ మోహన కృష్ణ మీడియా సమావేశంలో సైబర్ మోసాలపై జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం, సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన అవగాహన పెంచడంపై దృష్టి పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఏపీటీయస్ సైబర్ సెక్యూరిటీ అవగాహనా సదస్సులు నిర్వహించనుంది. అలాగే, ఏపీటీయస్ రాష్ట్ర స్థాయి సైబర్ సెక్యూరిటీ హ్యాకథాన్‌ను విజయవంతంగా నిర్వహించి, ఎంపికైన 30 మందికి ఇంటర్న్‌షిప్ సర్టిఫికేట్ ఇచ్చింది.
భవిష్యత్తులో మరిన్ని హ్యాకథాన్‌లు నిర్వహించి మరింత మంది సైబర్ సెక్యూరిటీ నిపుణులను తయారుచేయాలని ఆయన చెప్పారు. ముఖ్యంగా, సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో, మంత్రి నారా లోకేష్ గారి సారథ్యంతో ఏపీటీయస్ సైబర్ సెక్యూరిటీ ఆడిట్ సేవలను ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేట్ రంగంలో కూడా విస్తరించే యోజన ఉందని మోహన కృష్ణ తెలిపారు.