భారత్ మరియు బ్రిటన్ దేశాలు చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకం చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ మరియు బ్రిటన్ ప్రధాని కీర్ స్మార్టర్ సమక్షంలో, రెండు దేశాల వాణిజ్య మంత్రులు ఈ కీలక ఒప్పందానికి హస్తాక్షరించారు.
ఈ ఒప్పందం ద్వారా భారత్-బ్రిటన్ ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడడంతో పాటు, వార్షిక వాణిజ్యం సుమారు 34 బిలియన్ డాలర్లకు చేరవుతుందని అంచనాలు ఉన్నాయి.
ప్రధాని మోదీ నాలుగు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా బ్రిటన్ చేరుకున్నారు. లండన్ విమానాశ్రయంలో ఆయన ఘన స్వాగతం పొందారు. యూకేలో ఆయన రెండు రోజుల పర్యటన చేపడతారు. ఆపై జులై 25, 26 తేదీల్లో మాల్దీవుల పర్యటన జరుపుకుంటారు.