Yoga: అహ్మదాబాద్‌లో నేటి నుంచి తొలి ప్రపంచ యోగాసన క్రీడా ఛాంపియన్‌షిప్! Virat Kohli: టీమ్‌ఇండియాకు షాక్.. ఆఫ్ఘనిస్థాన్‌ సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం! 2027 వన్డే వరల్డ్ కప్‌పై.. IPL 2026: టీమిండియాలోకి వైభవ్ సూర్యవంశీ?.. సెలక్టర్లకు మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కీలక హితవు! DSC: స్పోర్ట్స్ కోటా నియామకాలలో రాజకీయ జోక్యానికి తావులేదు.. డీఎస్సీ నియామకాలపై ప్రభుత్వ స్పష్టీకరణ! IPL 2026: ఆర్సీబీ ఆధిపత్యం.. సన్‌రైజర్స్ నుంచి క్లాసెన్ ఒక్కడే.. ఐపీఎల్ 2026 మోస్ట్ పవర్‌ఫుల్ టీమ్ ఇదే.. T20 cricket: టీ20 ప్రపంచకప్ ఆఫ్రికా క్వాలిఫయర్స్‌లో సంచలనం: ఐవరీ కోస్ట్‌ను వణికించిన రువాండా రికార్డుల జాతర! IPL 2026: సీఎస్‌కే నెక్స్ట్ హెడ్ కోచ్ ఎంఎస్ ధోనీ?: అశ్విన్ 'ఎక్స్' పోస్ట్‌తో ఐపీఎల్‌లో మొదలైన కొత్త చర్చ! IPL 2026: కృనాల్ వింత బౌలింగ్‌కు కావ్య మారన్ షాక్.. స్టాండ్స్‌లో ఆమె రియాక్షన్ వైర‌ల్‌! Indian cricket team: రోహిత్‌ శర్మ ఫిట్‌నెస్‌పై బీసీసీఐ అనుమానాలు.. వరల్డ్‌ కప్‌నకు కష్టమేనా? Cricket Australia: భారత్‌లో బీబీఎల్ మ్యాచ్‌లు.. క్రికెట్ లవర్స్ కు పండగే! రెండో లేదా మూడో వారంలో... Yoga: అహ్మదాబాద్‌లో నేటి నుంచి తొలి ప్రపంచ యోగాసన క్రీడా ఛాంపియన్‌షిప్! Virat Kohli: టీమ్‌ఇండియాకు షాక్.. ఆఫ్ఘనిస్థాన్‌ సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం! 2027 వన్డే వరల్డ్ కప్‌పై.. IPL 2026: టీమిండియాలోకి వైభవ్ సూర్యవంశీ?.. సెలక్టర్లకు మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కీలక హితవు! DSC: స్పోర్ట్స్ కోటా నియామకాలలో రాజకీయ జోక్యానికి తావులేదు.. డీఎస్సీ నియామకాలపై ప్రభుత్వ స్పష్టీకరణ! IPL 2026: ఆర్సీబీ ఆధిపత్యం.. సన్‌రైజర్స్ నుంచి క్లాసెన్ ఒక్కడే.. ఐపీఎల్ 2026 మోస్ట్ పవర్‌ఫుల్ టీమ్ ఇదే.. T20 cricket: టీ20 ప్రపంచకప్ ఆఫ్రికా క్వాలిఫయర్స్‌లో సంచలనం: ఐవరీ కోస్ట్‌ను వణికించిన రువాండా రికార్డుల జాతర! IPL 2026: సీఎస్‌కే నెక్స్ట్ హెడ్ కోచ్ ఎంఎస్ ధోనీ?: అశ్విన్ 'ఎక్స్' పోస్ట్‌తో ఐపీఎల్‌లో మొదలైన కొత్త చర్చ! IPL 2026: కృనాల్ వింత బౌలింగ్‌కు కావ్య మారన్ షాక్.. స్టాండ్స్‌లో ఆమె రియాక్షన్ వైర‌ల్‌! Indian cricket team: రోహిత్‌ శర్మ ఫిట్‌నెస్‌పై బీసీసీఐ అనుమానాలు.. వరల్డ్‌ కప్‌నకు కష్టమేనా? Cricket Australia: భారత్‌లో బీబీఎల్ మ్యాచ్‌లు.. క్రికెట్ లవర్స్ కు పండగే! రెండో లేదా మూడో వారంలో...

సూపర్! ఆస్ట్రేలియన్ ఓపెన్ లో టైటిల్ గెలిచిన అతి పెద్ద వయస్కుడిగా రికార్డు..

భారత టెన్నిస్ రంగంలో ఇవాళ సంబరాలు మిన్నంటుతున్నాయి. సీనియర్ ఆటగాడు రోహన్ బోపన్న ఆస్ట్రేలియన్ ఓపెన్ లో డబుల్స్ విజేతగా నిలవడమే అందుకు కారణం. 43 ఏళ్ల వయసులో ఓ గ్

Published : 2024-01-28 10:12:00

భారత టెన్నిస్ రంగంలో ఇవాళ సంబరాలు మిన్నంటుతున్నాయి. సీనియర్ ఆటగాడు రోహన్ బోపన్న ఆస్ట్రేలియన్ ఓపెన్ లో డబుల్స్ విజేతగా నిలవడమే అందుకు కారణం.

43 ఏళ్ల వయసులో ఓ గ్లాండ్ స్లామ్ టోర్నీలో విజేతగా నిలవడం మామూలు విషయం కాదు.

మాథ్యూ ఎబ్డెన్ తో కలిసి ఇవాళ ఆ ఘనకార్యాన్ని సాకారం చేసిన రోహన్ బోపన్న ఆస్ట్రేలియన్ ఓపెన్ లో పురుషుల డబుల్స్ విభాగం టైటిల్ కైవసం చేసుకున్నాడు. 

ఈ నేపథ్యంలో, రోహన్ బోపన్నపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

ప్రధాని నరేంద్ర మోదీ నుంచి ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా వరకు అందరిదీ ఒకటే మాట... ప్రతిభకు వయసు అడ్డంకి కాదు అన్నదే అందరి అభిప్రాయం. 

ప్రతిభకు వయసు అడ్డంకి కాదని మరోసారి నిరూపితమైందని ప్రధాని నరేంద్ర మోదీ తన సందేశంలో పేర్కొన్నారు.

మన శక్తిసామర్థ్యాలను ఎల్లప్పుడూ నిర్వచించేది మన కృషి, పట్టుదల అని వివరించారు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ఆస్ట్రేలియన్ ఓపెన్ లో విజేతగా నిలిచిన రోహన్ బోపన్నకు అభినందనలు...

తన సుదీర్ఘ టెన్నిస్ కెరీర్ లో ఎందరికో ఆదర్శంగా నిలిచాడు అని ప్రధాని మోదీ కొనియాడారు. 

రోహన్ బోపన్న విజయంతో తనకు మళ్లీ టెన్నిస్ రాకెట్ పట్టాలనిపిస్తోందని ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు.

వయసు కేవలం ఒక నెంబరు మాత్రమేనని నిరూపించినందుకు ధన్యవాదాలు అంటూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. 

చాంపియన్ గా నిలవడానికి వయసుతో సంబంధంలేదని నిరూపించావు అంటూ క్రికెట్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ స్పందించారు.

రోహన్ బోపన్న-మాథ్యూ ఎబ్డెన్ జోడీ తమ ఆటతో అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచింది అని కొనియాడారు. 

కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, టీమిండియా మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ కూడా రోహన్ బోపన్నను అభినందించారు.

43 ఏళ్ల వయసులో ఆస్ట్రేలియన్ ఓపెన్ ను గెలిచిన ఆటగాడిగా రోహన్ బోపన్న నేడు చరిత్ర సృష్టించాడు.

ఆస్ట్రేలియన్ ఓపెన్ లో టైటిల్ గెలిచిన అత్యంత పెద్ద వయస్కుడు రోహన్ బోపన్నే.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →