⚡ BREAKING
Business

Bank Holidays: వచ్చే వారం బ్యాంకులకు నాలుగు రోజుల సెలవులు.. ఖాతాదారులకు ఆర్‌బీఐ అలర్ట్!

Bank Holidays: వచ్చే వారం బ్యాంకు పనులు చేసుకోవాలనుకునే ఖాతాదారులు ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకోవడం మంచిది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) విడుదల చేసిన సెలవుల క్యాలెండర్ ప్రకారం జూన్ 22 నుంచి 28 మధ్య దేశంలోని పలు ప్రాంతాల్లో బ్యాంకులు నాలుగు రోజుల పాటు మూతపడనున్నాయి.

Bank Holidays
Bank Holidays

జూన్ 22–28 మధ్య బ్యాంకు సేవల్లో మార్పులు.. ఈ తేదీల్లో బ్రాంచ్‌లు బంద్..

ముహర్రం, వారాంతపు సెలవులతో బ్యాంకులకు వరుస సెలవులు..

వచ్చే వారం బ్యాంకు పనులు చేసుకోవాలనుకునే ఖాతాదారులు ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకోవడం మంచిది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) విడుదల చేసిన సెలవుల క్యాలెండర్ ప్రకారం జూన్ 22 నుంచి 28 మధ్య దేశంలోని పలు ప్రాంతాల్లో బ్యాంకులు నాలుగు రోజుల పాటు మూతపడనున్నాయి.

ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ బ్యాంకులు ఆయా రాష్ట్రాల స్థానిక పండుగలు, మతపరమైన సందర్భాలు, అలాగే వారాంతపు సెలవుల కారణంగా పనిచేయవు. అయితే ఈ సెలవులు అన్ని రాష్ట్రాల్లో ఒకేలా ఉండవు. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే బ్యాంకులు మూతపడగా, మరికొన్ని చోట్ల సాధారణంగా పనిచేస్తాయి.

జూన్ 25, 26 తేదీల్లో ముహర్రం సందర్భంగా పలు నగరాల్లో బ్యాంకులు మూసివేయబడతాయి. జూన్ 25న ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో బ్యాంకులకు సెలవు ప్రకటించారు. జూన్ 26న ముహర్రం సందర్భంగా దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బ్యాంకులు పనిచేయవు. వీటిలో అగర్తల, ఐజ్వాల్, బేలాపూర్, బెంగళూరు, భోపాల్, చెన్నై, హైదరాబాద్, జమ్మూ, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పాట్నా, రాయ్‌పూర్, రాంచీ, శ్రీనగర్ నగరాలు ఉన్నాయి.

జూన్ 27న నాలుగో శనివారం కావడంతో దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు మూసివేయబడతాయి. అలాగే జూన్ 28 ఆదివారం కావడంతో సాధారణ వారాంతపు సెలవు ఉంటుంది. దీంతో కొన్ని ప్రాంతాల్లో వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకు శాఖలు అందుబాటులో ఉండకపోవచ్చు.

ఆర్‌బీఐ సెలవుల జాబితా ప్రకారం: 
జూన్ 15: ఐజ్వాల్‌లో యంగ్ మిజో అసోసియేషన్ (YMA) స్థాపన దినోత్సవం సందర్భంగా, భువనేశ్వర్‌లో రాజా సంక్రాంతి సందర్భంగా బ్యాంకులు మూసివేయబడ్డాయి.
జూన్ 29: శిమ్లాలో సంత్ గురు కబీర్ జయంతి సందర్భంగా బ్యాంకులకు సెలవు.
జూన్ 30: ఐజ్వాల్‌లో స్థానిక పండుగ ‘రెమ్నా నీ’ సందర్భంగా బ్యాంకులు పనిచేయవు.
ప్రతి నెల రెండో, నాలుగో శనివారాలు సెలవే


బ్యాంకు శాఖలు మూసివేసినా డిజిటల్ బ్యాంకింగ్ సేవలు మాత్రం అందుబాటులోనే ఉంటాయి. ఖాతాదారులు UPI లావాదేవీలు, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, NEFT, RTGS సేవలు, బిల్లు చెల్లింపులు, డబ్బు బదిలీలు, వంటి సేవలను ఎప్పటిలాగే వినియోగించుకోవచ్చు.

అయితే కొన్నిసార్లు సాంకేతిక నిర్వహణ పనుల కారణంగా సేవల్లో తాత్కాలిక అంతరాయం ఉండవచ్చని బ్యాంకులు ముందుగానే సమాచారం ఇస్తాయి.

చెక్ క్లియరెన్స్, డిమాండ్ డ్రాఫ్ట్‌లు, ఖాతా సంబంధిత పత్రాల సమర్పణ, లాకర్ సేవలు వంటి పనుల కోసం బ్యాంకు శాఖను సందర్శించాల్సి ఉంటే, ముందుగానే స్థానిక శాఖ సెలవుల వివరాలు తెలుసుకుని వెళ్లడం మంచిదని బ్యాంకింగ్ నిపుణులు సూచిస్తున్నారు.

డిజిటల్ సేవలు విస్తృతంగా అందుబాటులో ఉన్నప్పటికీ, శాఖ స్థాయిలో జరిగే పనులకు సెలవుల ప్రభావం ఉంటుందని ఖాతాదారులు గుర్తుంచుకోవాలని చెబుతున్నారు.

Be the first to react

More Coverage