మిడ్‌రేంజ్‌ ధరలో 200MP కెమెరా, 6500mAh బ్యాటరీతో 5G స్మార్ట్‌ఫోన్‌..! ఆండ్రాయిడ్ 15 అప్‌డేట్‌తో..

సాధారణంగా 200MP కెమెరా అంటే లక్ష రూపాయల ఫోన్లలోనే ఉంటుందని మనం అనుకుంటాం. కానీ, స్మార్ట్‌ఫోన్ ప్రియుల అంచనాలను మారుస్తూ వివో సంస్థ తన లేటెస్ట్ మోడల్ 'వివో V60e'

2026-01-02 11:42:00
Delivery: 10 నిమిషాల డెలివరీ వెనుక అసలు రహస్యం ఇదే…! జొమాటో సీఈఓ సంచలన వ్యాఖ్యలు!

సాధారణంగా 200MP కెమెరా అంటే లక్ష రూపాయల ఫోన్లలోనే ఉంటుందని మనం అనుకుంటాం. కానీ, స్మార్ట్‌ఫోన్ ప్రియుల అంచనాలను మారుస్తూ వివో సంస్థ తన లేటెస్ట్ మోడల్ 'వివో V60e' (Vivo V60e) ను మిడ్-రేంజ్ బడ్జెట్‌లోనే పరిచయం చేసింది. గతేడాది అక్టోబర్‌లో లాంచ్ అయిన ఈ ఫోన్, ప్రస్తుతం మార్కెట్‌లో కెమెరా లవర్స్‌కు హాట్ ఫేవరెట్‌గా మారింది.

భవిష్యత్తు నగరం.. ఏసీల అవసరం లేని సరికొత్త కూలింగ్ వ్యవస్థతో అద్భుతం! 30 నెలల్లో దేశానికే..

కేవలం కెమెరా మాత్రమే కాదు, ఈ ఫోన్‌లో ఉన్న అదిరిపోయే స్పెసిఫికేషన్లు ఏంటో, దీని ధర వివరాలు ఏమిటో ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం.

Fog blankets: తెలుగు రాష్ట్రాల్లో పొగమంచు దుప్పటి… విమానాలు రద్దు, రహదారులపై ట్రాఫిక్ జామ్!

ధర మరియు లభ్యత: మీ బడ్జెట్‌కు తగినట్టుగా..
వివో V60e మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. మీ అవసరానికి తగ్గట్టుగా మీకు నచ్చిన మోడల్‌ను ఎంచుకోవచ్చు:

India Rail Updates: విజయవాడ–బెంగళూరు వందే భారత్ ఎందుకు ఆలస్యం? ఇప్పటివరకు పట్టాలెక్కని వెనుకకథ ఇదే!

8GB + 128GB: రూ. 29,999/-
8GB + 256GB: రూ. 31,999/-
12GB + 256GB: రూ. 33,399/-
ఈ ఫోన్ నోబెల్ గోల్డ్ మరియు ఇలైట్ పర్పుల్ అనే రెండు క్లాసీ కలర్లలో లభిస్తోంది. మీరు దీనిని అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లేదా మీ సమీపంలోని వివో స్టోర్లలో సులభంగా కొనుగోలు చేయవచ్చు.

Industrial Hub: ఏపీకి మరో ఇండస్ట్రియల్ హబ్…! ఆ జిల్లాకు మహర్దశ.. రూ.37,500 కోట్ల భారీ ప్రాజెక్ట్..!

క్వాడ్‌ కర్వడ్‌ అమోలెడ్ డిస్‌ప్లే: 
వివో V60e స్మార్ట్‌ఫోన్ 6.77 అంగుళాల క్వాడ్‌ కర్వడ్‌ అమోలెడ్ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 1600 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ ను కలిగి ఉంది. దీంతోపాటు డైమండ్‌ షీల్డ్‌ గ్లాస్‌ ప్రొటెక్షన్‌ ను పొందుతోంది. ఈ ఫోన్‌ IP68 + IP69 రేటింగ్‌ తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌ గా ఉంది. 

Travel Relief: సంక్రాంతి ప్రయాణికులకు గుడ్ న్యూస్…! ORR మీదుగా నేరుగా ఏపీకి RTC బస్సులు!

200MP కెమెరా, 50MP సెల్ఫీ కెమెరా: 
ఈ ఫోన్‌ మిడ్‌రేంజ్‌ ధర సెగ్మెంట్‌ లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ ఏకంగా 200MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. ఈ ప్రైమరీ కెమెరా 30x జూమ్‌, OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్) సపోర్టును కలిగి ఉంది. దీంతోపాటు 8MP అల్ట్రావైడ్‌ యాంగిల్ లెన్స్‌ ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 50MP కెమెరాను అమర్చి ఉంది. Aura లైట్‌ ను కలిగి ఉంది.

5 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌: 
ఈ వివో స్మార్ట్‌ఫోన్ మీడియా డైమెన్సిటీ 7360 టర్బో ప్రాసెసర్‌ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత FuntouchOS 15 పైన పనిచేస్తోంది. ఈ హ్యాండ్‌సెట్‌ 3 ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్స్‌, 5 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ను పొందుతుంది. 

Free Insurance: ఏపీ ఉద్యోగులకు ఉచితంగా రూ.కోటి భీమా! పూర్తి వివరాలు!

6500mAh బ్యాటరీ:
ఈ వివో V60e స్మార్ట్‌ఫోన్ 90W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 6500mAh బ్యాటరీతో పనిచేస్తోంది. AI Erase 3.0, Live Call Translation, AI Smart Call Assistant, AI Festival Portrait, Image Expander, సర్కిల్‌ టు సెర్చ్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. కనెక్టివిటీ పరంగా ఈ ఫోన్ 5G, 4G, బ్లూటూత్, వైఫై, NFC, IR బ్లాస్టర్‌, USB-C ఛార్జింగ్‌ పోర్టును వంటి ఫీచర్లను కలిగి ఉంది.

AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఫలించిన అమరావతి రైతుల నిరీక్షణ!

ముప్పై వేల బడ్జెట్‌లో అదిరిపోయే కెమెరా, స్టైలిష్ లుక్, మరియు రోజంతా వచ్చే బ్యాటరీ కావాలనుకునే వారికి వివో V60e ఒక బెస్ట్ ఆప్షన్. ముఖ్యంగా వ్లాగర్లు మరియు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవారికి ఈ 200MP కెమెరా ఒక వరం అని చెప్పాలి.

Farmers: రైతులకు తీపి కబురు! సంక్రాంతి కంటే ముందే ఖాతాల్లో నిధులు జమ..!!
Holidays: ఏపీలో విద్యార్థులకు పండగే పండగ..! జనవరిలో ఏకంగా 13 సెలవులు.. ఫుల్ లిస్ట్ ఇదే!
Greenfield Expressway: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గిఫ్ట్... కొత్త గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే!
Leopard Alert: భక్తులకు అలర్ట్! చిరుత కలకలం... జాగ్రత్త!
US Visa Update: గ్రీన్ కార్డ్ దరఖాస్తులపై కఠిన ఆంక్షలు..! ఇక కేవలం పెళ్లి చేసుకుంటే సరిపోదు..!
Ballari Hightension: బళ్లారిలో హై టెన్షన్... MLA ఇంటిపై కాల్పులు! ఒకరు మృతి!

Spotlight

Read More →