కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు మరో గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేను మంజూరు చేసింది. 2025 డిసెంబర్ 31న ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనితో రెండు రాష్ట్రాల మధ్య రవాణా మరింత వేగవంతం కానుంది.
ఈ నిర్ణయంతో జాతీయ రహదారి–326ను విస్తరించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. గజపతి, రాయగడ, కోరాపుట్ వంటి ప్రాంతాల మధ్య ప్రయాణ సమయం తగ్గడంతో పాటు కనెక్టివిటీ మెరుగుపడుతుందని కేంద్రం పేర్కొంది. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలకు మెరుగైన రహదారి సదుపాయాలు అందడంతో సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని భావిస్తోంది.
ఈ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేను ఆరు లేన్లుగా అభివృద్ధి చేయనున్నారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను కలుపుతూ ఇది ప్రధానమంత్రి గతిశక్తి ప్రాజెక్ట్‌లో భాగంగా రూపొందనుంది. నాసిక్–సోలాపూర్–అక్కల్‌కోట్ గ్రీన్‌ఫీల్డ్ కారిడార్‌తో దీనిని అనుసంధానం చేయనున్నారు. దీని ద్వారా మూడు రాష్ట్రాల మధ్య లాజిస్టిక్స్, సరుకు రవాణా మరింత బలోపేతం కానుంది.
ఈ ప్రాజెక్ట్ వల్ల ఉపాధి అవకాశాలు పెరగడమే కాకుండా, పర్యాటక రంగం కూడా వేగంగా అభివృద్ధి చెందుతుందని కేంద్రం అంచనా వేస్తోంది. అలాగే పారిశ్రామిక ప్రాంతాల అభివృద్ధికి ఇది కీలకంగా మారనుంది. కోప్పర్తి, ఓర్వకల్ వంటి జాతీయ పారిశ్రామిక కారిడార్ ప్రాంతాలకు ఇది పెద్ద ఊతం ఇవ్వనుంది.
గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభం తర్వాత ఏపీ నుంచి తెలంగాణకు ఉన్న సుమారు 201 కిలోమీటర్ల దూరం దాదాపు సగానికి తగ్గనుంది. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రహదారిని రూపకల్పన చేస్తున్నారు. దీని వల్ల సాధారణ ప్రయాణికులకు, వాణిజ్య రవాణాకు ఎలాంటి ఇబ్బందులు లేకుం