Goods Train: విశాఖ - హౌరా గూడ్స్ రైలులో గ్యాస్ లీక్ కలకలం...! అసలేం జరిగిందంటే? APSRTC: 9 రోజులు.. అనేక పుణ్యక్షేత్రాలు! ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీ వివరాలివే! TollPlaza: టోల్ ప్లాజాల వద్ద ఇక నో వెయిటింగ్! బారియర్లు లేని ప్రయాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్! Indian Railways: రైల్వే గుడ్ న్యూస్... కన్ఫర్మ్డ్ టికెట్‌ను వేరొకరి పేరు మీదకు మార్చుకోవచ్చు! పూర్తి వివరాలు.... Tirupati Airport: తిరుపతి విమానాశ్రయం సరికొత్త రికార్డు: ఒకే ఏటా 10 లక్షల మంది ప్రయాణికులు! Flight Tickets: విమాన ప్రయాణికులకు డీజీసీఏ గుడ్ న్యూస్...! కొత్త నిబంధనలు ఇవే! TGSRTC Special Offer: రూ. 5130 కే గోవా టూర్.. టీజీఎస్ఆర్టీసీ సరికొత్త బంపర్ ఆఫర్! Public Transport: బస్సులో సామాన్లు మర్చిపోయారా? కంగారు వద్దు.. వెంటనే ఇలా చేయండి! Travel Update: ఆర్టీసీ బస్సుల్లో డిజిటల్ విప్లవం..! ఇకపై యూపీఐతోనే టికెట్ నగదు! Metro: మెట్రో సెకండ్ ఫేజ్‌కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్.. కొత్తగా 76 కిలోమీటర్ల విస్తరణ! Goods Train: విశాఖ - హౌరా గూడ్స్ రైలులో గ్యాస్ లీక్ కలకలం...! అసలేం జరిగిందంటే? APSRTC: 9 రోజులు.. అనేక పుణ్యక్షేత్రాలు! ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీ వివరాలివే! TollPlaza: టోల్ ప్లాజాల వద్ద ఇక నో వెయిటింగ్! బారియర్లు లేని ప్రయాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్! Indian Railways: రైల్వే గుడ్ న్యూస్... కన్ఫర్మ్డ్ టికెట్‌ను వేరొకరి పేరు మీదకు మార్చుకోవచ్చు! పూర్తి వివరాలు.... Tirupati Airport: తిరుపతి విమానాశ్రయం సరికొత్త రికార్డు: ఒకే ఏటా 10 లక్షల మంది ప్రయాణికులు! Flight Tickets: విమాన ప్రయాణికులకు డీజీసీఏ గుడ్ న్యూస్...! కొత్త నిబంధనలు ఇవే! TGSRTC Special Offer: రూ. 5130 కే గోవా టూర్.. టీజీఎస్ఆర్టీసీ సరికొత్త బంపర్ ఆఫర్! Public Transport: బస్సులో సామాన్లు మర్చిపోయారా? కంగారు వద్దు.. వెంటనే ఇలా చేయండి! Travel Update: ఆర్టీసీ బస్సుల్లో డిజిటల్ విప్లవం..! ఇకపై యూపీఐతోనే టికెట్ నగదు! Metro: మెట్రో సెకండ్ ఫేజ్‌కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్.. కొత్తగా 76 కిలోమీటర్ల విస్తరణ!

India Rail Updates: విజయవాడ–బెంగళూరు వందే భారత్ ఎందుకు ఆలస్యం? ఇప్పటివరకు పట్టాలెక్కని వెనుకకథ ఇదే!

ఆంధ్రప్రదేశ్ వాణిజ్య రాజధాని విజయవాడ నుంచి కర్ణాటక ఐటీ రాజధాని బెంగళూరు వరకు ప్రతిరోజూ వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఐటీ ఉద్యోగులు, వ్యాపారులు

Published : 2026-01-02 11:11:00
Anvesh : విదేశాల్లో అన్వేష్.. ఇన్‌స్టాగ్రామ్‌కు హైదరాబాద్ పోలీసుల లేఖ!

ఆంధ్రప్రదేశ్ వాణిజ్య రాజధాని విజయవాడ నుంచి కర్ణాటక ఐటీ రాజధాని బెంగళూరు వరకు ప్రతిరోజూ వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఐటీ ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు, అలాగే తిరుపతి వెళ్లే భక్తులతో ఈ రూట్ ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది. ఇంతటి డిమాండ్ ఉన్న మార్గంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభమవుతుందని గత ఆరు నెలలుగా ప్రయాణికుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి.

TTD: తిరుమలలో భక్తి జాతర…! హుండీ ఆదాయంలో కొత్త రికార్డు!

 మేలో వస్తుంది అన్నారు, ఆగస్టులో అన్నారు ఆ తర్వాత డిసెంబర్ 10న స్టార్ట్ అవుతుందని పత్రికల్లో కూడా కథనాలు వచ్చాయి. రైల్వే బోర్డు ఈ రూట్‌కు 20711 అనే నంబర్‌ను కూడా కేటాయించింది. అయినప్పటికీ తేదీలు మారుతున్నాయే తప్ప, రైలు మాత్రం ఇప్పటివరకు పట్టాలపైకి రాలేదు. అసలు ఈ ఆలస్యం వెనుక సాంకేతిక సమస్యలున్నాయా, లేక రెండు రాష్ట్రాల మధ్య రైల్వే జోన్ల మధ్య సయోధ్య లోపమేనా అనే ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రయత్నమే ఈ కథనం.

H1B Visa: హెచ్-1బీ ఉద్యోగులకు అమెజాన్ శుభవార్త! భారత్‌లోనే పని చేసే అవకాశం!

ముందుగా ఈ రైలు వెళ్లాల్సిన రూట్‌ను పరిశీలిస్తే అసలు సమస్య అక్కడే మొదలైనట్లు తెలుస్తుంది. సాధారణంగా విజయవాడ నుంచి బెంగళూరు వెళ్లాలంటే గుంటూరు- నంద్యాల - గుంతకల్లు - ధర్మవరం మీదుగా వెళ్లే మార్గం ఒకటి ఉంది. మరోవైపు ఒంగోలు -  నెల్లూరు-  గూడూరు-  రేణిగుంట-  కాట్పాడు మీదుగా వెళ్లే మార్గం ఉంది. రైల్వే బోర్డు రెండో మార్గాన్ని ఎంచుకుంది. దీనికి ప్రధాన కారణం బెంగళూరు ఐటీ ఉద్యోగులతో పాటు తిరుపతి వెళ్లే భక్తుల రద్దీని కూడా వందే భారత్ ద్వారా కవర్ చేయాలనే ఆలోచన కానీ ఇక్కడే ఒక సాంకేతిక చిక్కు ఎదురైంది.

Vishal: క్రేజీ కాంబినేషన్... విశాల్ సరసన ఆ ప్రముఖ హీరోయిన్!

 రేణిగుంట జంక్షన్ దాటి రైలు తిరుపతి స్టేషన్‌లోకి వెళ్లి మళ్లీ వెనక్కి వచ్చి రివర్స్ లేదా బైపాస్ లైన్ ద్వారా కాట్పాడు వైపు సాగాల్సి ఉంటుంది. దీనిని సర్క్యూటస్ రూట్‌గా అధికారులు పిలుస్తున్నారు. వందే భారత్ అంటేనే వేగం. అలాంటి రైలును ఇలా తిరుపతిలో టచ్ చేయడం వల్ల ప్రయాణ సమయం పెరిగి, మొదట లక్ష్యంగా పెట్టుకున్న ఎనిమిది గంటల టైమ్ మిస్ అవుతోంది. దీంతో టైమ్ టేబుల్ సిద్ధం చేయడం అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది.

Holidays: ఏపీలో విద్యార్థులకు పండగే పండగ..! జనవరిలో ఏకంగా 13 సెలవులు.. ఫుల్ లిస్ట్ ఇదే!

మరో కీలక కారణం ఇంటర్ జోనల్ సమస్య విజయవాడ నుంచి గూడూరు వరకు మార్గం సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో ఉంటుంది. ఈ జోన్ వందే భారత్‌కు అవసరమైన స్లాట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉందని సమాచారం. కానీ గూడూరు దాటిన తర్వాత రైలు సదర్న్ రైల్వే పరిధిలోకి, ఆపై సౌత్ వెస్ట్రన్ రైల్వే పరిధిలోకి ప్రవేశిస్తుంది. ముఖ్యంగా గూడూరు–కాట్పాడు లైన్ రైల్వేకు బంగారు బాతులాంటిది. కృష్ణపట్నం పోర్టు నుంచి వచ్చే భారీ గూడ్స్ రైళ్లు, ఫ్రైట్ ట్రాఫిక్ ఈ మార్గంలో విపరీతంగా నడుస్తుంటాయి. 

Farmers: రైతులకు తీపి కబురు! సంక్రాంతి కంటే ముందే ఖాతాల్లో నిధులు జమ..!!

ప్రస్తుతం ప్రతిపాదించిన టైమింగ్స్ ప్రకారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య వందే భారత్ ఈ సెక్షన్‌లో వెళ్లాల్సి ఉంటుంది. ఆ సమయంలో వందే భారత్‌కు ప్రాధాన్యం ఇవ్వాలంటే గూడ్స్ రైళ్లను పక్కన నిలిపేయాల్సి వస్తుంది. దీనికి సదర్న్ రైల్వే ఒప్పుకోవడం లేదని సమాచారం. గూడ్స్ రవాణా మాకు ముఖ్యమని, ఆ టైమ్‌లో ప్యాసింజర్ ట్రైన్‌కు స్లాట్ ఇవ్వలేమని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ జోన్ల మధ్య సమన్వయం కుదరకపోవడమే ఫైల్ పెండింగ్‌కు ప్రధాన కారణంగా వినిపిస్తుంది.

AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఫలించిన అమరావతి రైతుల నిరీక్షణ!

మరో అంశం రోలింగ్ స్టాక్ అంటే రైలు బోగీల సమస్య మొదట ఈ రూట్‌లో 16 కోచ్‌లతో పూర్తి సామర్థ్య వందే భారత్ నడపాలని ప్రణాళిక రూపొందించారు. అయితే సర్వేలో ఒక విషయం తేలింది అది ఏమిటంటే విజయవాడ నుంచి బెంగళూరు వరకు పగటిపూట ప్రయాణించే వారి కంటే రాత్రిపూట స్లీపర్ బస్సుల్లో వెళ్లేవాళ్లే ఎక్కువగా ఉన్నారు. దాదాపు 700 కిలోమీటర్ల దూరం కావడంతో పగలు కూర్చుని ప్రయాణించడానికి ప్రయాణికులు ఎంతవరకు ఆసక్తి చూపుతారనే సందేహం రైల్వేకు కలిగింది. 

Free Insurance: ఏపీ ఉద్యోగులకు ఉచితంగా రూ.కోటి భీమా! పూర్తి వివరాలు!

అందుకే సేఫ్ సైడ్‌గా 8 కోచ్‌ల మినీ వందే భారత్ కేటాయించారు. కానీ చెన్నై ఫ్యాక్టరీ నుంచి వచ్చే కొత్త రేక్స్‌ను రాజకీయ ఒత్తిళ్లు ఉన్న ఇతర రూట్లకు మళ్లిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మనకు కేటాయించిన రేకు వేరే జోన్‌కు వెళ్లిపోవడంతో లాంచ్ డేట్లు మారుతున్నాయని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. ఇంకో  కీలకమైన అంశం మెయింటెనెన్స్ ఈ రైలు బెంగళూరులోని సర్ ఎం. విశ్వేశ్వరయ్య టర్మినల్ (Sir M. Visvesvaraya Terminal - SMVT)

Travel Relief: సంక్రాంతి ప్రయాణికులకు గుడ్ న్యూస్…! ORR మీదుగా నేరుగా ఏపీకి RTC బస్సులు!

 చేరుకోవాల్సి ఉంటుంది. వందే భారత్ రైళ్లకు వారానికి ఒకసారి ప్రత్యేక పిట్ లైన్ మెయింటెనెన్స్ తప్పనిసరి. ఇప్పటికే ఎస్‌ఎమ్‌వీటీ స్టేషన్ బిజీగా ఉంది. కొత్తగా వచ్చే ఈ రైలుకు మంగళవారమా, గురువారమా మెయింటెనెన్స్ స్లాట్ ఇవ్వాలన్న దానిపై బెంగళూరు డివిజన్ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని సమాచారం. 

Industrial Hub: ఏపీకి మరో ఇండస్ట్రియల్ హబ్…! ఆ జిల్లాకు మహర్దశ.. రూ.37,500 కోట్ల భారీ ప్రాజెక్ట్..!

ఈ అన్ని అంశాల మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  లు విషయంలో  పూర్తిగా సానుకూలంగా ఉంది. విజయవాడ - బెంగళూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం ఖాయమని, ప్రస్తుతం ఎదురవుతున్నవి కేవలం తాత్కాలిక సాంకేతిక సమస్యలేనని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కేంద్ర రైల్వే శాఖతో సమన్వయం నిరంతరం కొనసాగుతోందని, త్వరలోనే ప్రయాణికులకు శుభవార్త వినిపిస్తుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తుంది..

Spotlight

Read More →