నామినేషన్ల గడువు వేళ ఎస్‌ఈసీ కీలక ఆదేశాలు.. అడ్డుకుంటే కఠిన చర్యలు!

Local Body Elections: ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల దాఖలు గడువు అక్టోబర్ 23 సాయంత్రం 5:00 గంటలతో ముగుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ఉత్తర్వులు (Order No.905/SEC-B1/2026) జారీ చేసింది. అభ్యర్థులను ఎవరైనా నామినేషన్ వేయకుండా అడ్డుకుంటే, అధికారులు వెంటనే ఫోన్ ద్వారా స్పందించి గడువులోగా నామినేషన్ దాఖలు చేసేలా సహకరించాలని స్పష్టం చేసింది. అవసరమైన పక్షంలో అభ్యర్థులకు వ్యక్తిగత పోలీస్ భద్రత కల్పించి కేంద్రాల వద్దకు తీసుకెళ్లాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించింది.

ఫిర్యాదు వస్తే వెంటనే రంగంలోకి దిగాల్సిందే.. ఫోన్ చేసి నామినేషన్ వేయించాలని ఆదేశం!
ఫిర్యాదు వస్తే వెంటనే రంగంలోకి దిగాల్సిందే.. ఫోన్ చేసి నామినేషన్ వేయించాలని ఆదేశం!
  • శాంతిభద్రతల పరిరక్షణతో ప్రశాంత వాతావరణంలో నామినేషన్ల దాఖలుకు ఏర్పాట్లు ముమ్మరం!
  • ఆర్డర్ నెం. 905 ద్వారా రాష్ట్రవ్యాప్తంగా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన ఎన్నికల కమిషనర్!
  • ప్రజాస్వామ్యబద్ధంగా నామినేషన్ల ప్రక్రియ జరిగేలా చొరవ.. క్షేత్రస్థాయి అధికారులకు నిర్దిష్ట బాధ్యతలు!   

Andhrapradesh: ఆంధ్రప్రదేశ్‌లో 2వ విడత సాధారణ ఎన్నికలుగా జరుగుతున్న ఎంపీటీసీ (MPTC), జడ్పీటీసీ (ZPTC) ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం (AP SEC) అత్యంత కీలకమైన ఉత్తర్వులను జారీ చేసింది. అక్టోబర్ 19న విడుదలైన ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం అక్టోబర్ 21న నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కాగా, అక్టోబర్ 23 సాయంత్రం 5:00 గంటలతో నామినేషన్ల దాఖలు గడువు ముగియనుంది.

అడ్డుకుంటే వెంటనే చర్యలు – ఫోన్ ద్వారా సంప్రదింపులు

ఎవరైనా అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని లేదా బెదిరించారని ఫిర్యాదులు వస్తే జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, జిల్లా ఎస్పీలు మరియు సంబంధిత పోలీస్ అధికారులు వెంటనే స్పందించాలని ఎస్‌ఈసీ ఆదేశించింది. అటువంటి ఫిర్యాదులు అందిన వెంటనే సదరు ఫిర్యాదుదారులను అధికారులు తక్షణమే ఫోన్ ద్వారా సంప్రదించి, నిర్దేశిత గడువైన సాయంత్రం 5:00 గంటలలోపు వారు నిరభ్యంతరంగా నామినేషన్ సమర్పించేలా అవసరమైన పూర్తి సహకారం అందించాలని స్పష్టం చేసింది.

రిటర్నింగ్ అధికారులకు మార్గదర్శకాలు & పోలీస్ భద్రత

నిబంధనల ప్రకారం అటువంటి అభ్యర్థుల నుంచి నామినేషన్లను తప్పనిసరిగా స్వీకరించాల్సిందిగా రిటర్నింగ్ అధికారులకు (ROs) స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని పేర్కొంది. అంతేకాకుండా, అవసరమైన చోట్ల ఫిర్యాదుదారులకు సంబంధిత జిల్లా ఎస్పీలు స్వయంగా వ్యక్తిగత భద్రతను (Personal Security) ఏర్పాటు చేయాలని, వారిని సురక్షితంగా నామినేషన్ కేంద్రాల వద్దకు తీసుకెళ్లి నిర్ణీత సమయంలో ప్రశాంతంగా నామినేషన్లు దాఖలు చేసేలా చూడాలని ఆదేశించింది.

Tags

Be the first to react

Latest