AP Farmers: ఏపీ రైతులకు అలర్ట్! ఈ నెల 31 వరకు ఛాన్స్... వెంటనే దరఖాస్తు చేస్కోండి!

2025-12-06 10:11:00
Putin - Taliban Rule: పాక్‌కు గట్టి షాక్! ఉగ్రవాదంపై తాలిబన్లు పోరాటం చేస్తున్నారన్న రష్యా అధ్యక్షుడు!

ఆంధ్రప్రదేశ్ రైతులకు ప్రభుత్వం కీలక గమనిక జారీ చేసింది. రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటలు నష్టపోయినప్పుడు రైతులను ఆర్థికంగా ఆదుకోవడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY), వాతావరణ ఆధారిత పంట బీమా పథకాలను అమలు చేస్తున్నాయి. రబీ సీజన్‌కు సంబంధించిన వివిధ పంటలకు ఈ బీమా వర్తించేందుకు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ నేపథ్యంలో జిల్లాల వ్యవసాయ అధికారులు బీమా నమోదు ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు.

Land Regestration: ఏపీ రైతులకు శుభవార్త! ఆ భూముల్ని ఇప్పుడు రూ.100 కే రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు! త్వరపడండి...

రైతులకు బీమా ప్రయోజనం అందించేందుకు పంట దిగుబడులు, పంట కోత ప్రయోగాల ఫలితాలు ఆధారంగా పరిహారం లెక్కించబడుతుంది. అధిక వర్షాలు, వరదలు, తీవ్ర కరవు, వడగండ్ల వాన వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు దెబ్బతిన్నప్పుడు రైతులకు బీమా ద్వారా ఆర్థిక సహాయం అందుతుంది. పంట నష్టాన్ని తగ్గించడంలో ఈ పథకం రైతులకు పెద్ద ఉపశమనం కల్పిస్తుంది. అందుకే అధికారులు రైతులు ఈ బీమా పథకాలను తప్పక వినియోగించుకోవాలని సూచిస్తున్నారు.

India Russia Relations: పుతిన్–మోదీ భేటీ.. ఇంధనంపై కీలక హామీలు, దౌత్య సమీకరణాల్లో కొత్త మలుపు!!

పంట బీమా నమోదు, ప్రీమియం చెల్లింపులకు ప్రభుత్వం స్పష్టమైన గడువులను నిర్ణయించింది. వరి పంటకు బీమా ప్రీమియం చెల్లించడానికి డిసెంబర్ 31 చివరి తేదీగా నిర్ణయించారు. వేరుసెనగ రైతులు డిసెంబర్ 15 లోపు ప్రీమియం చెల్లించాలి. టమాటా రైతులు కూడా డిసెంబర్ 15 లోపు నమోదు పూర్తిచేయాలి. మామిడి పంట బీమాకు జనవరి 3 వరకు అవకాశం ఉంది. గడువులు ముగిసేలోగా ప్రీమియం చెల్లిస్తే పంట నష్టపోయిన సమయంలో రైతులకు వెంటనే బీమా పరిహారం అందుతుంది.

Smartphones: ఇక లొకేషన్ ఆఫ్‌కు నో చాన్స్…! వినియోగదారుల ప్రైవసీపై భారీ చర్చ!

ఈ పథకాల అమలు కోసం ప్రభుత్వం ముందస్తు నిధులను కూడా విడుదల చేసింది. రబీ సీజన్ పంట బీమా కోసం నవంబరులో రూ.44.06 కోట్లను విడుదల చేయడానికి అనుమతి ఇచ్చింది. ఈ నిధులు ఎస్క్రో ఖాతాలో జమ చేయాల్సిన ప్రభుత్వం వాటా ప్రీమియం సబ్సిడీకి 50% గా ఉపయోగించబడతాయి. రైతులు తక్కువ మొత్తంలోనే ప్రీమియం చెల్లించి, పూర్తి బీమా రక్షణ పొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

Free Bus: ఉచిత బస్సు పథకంపై కీలక ప్రకటన! ఇక నుండి వారికి కూడా... రెడీ గా ఉండండి!

మొత్తం మీద, రబీ సీజన్ పంట బీమా ద్వారా రైతులకు ఆర్థిక భరోసా పెరుగుతుంది. ప్రకృతి వైపరీత్యాల వల్ల వచ్చే పంట నష్టాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు. రైతులు సమయానికి నమోదు చేసుకుని ప్రీమియం చెల్లిస్తే, ఏ పరిస్థితుల్లోనైనా తాము నష్టపోకుండా ఉండేందుకు ఈ పథకాలు బలమైన రక్షణగా నిలుస్తాయి. రైతు సేవా కేంద్రాలు, వ్యవసాయ శాఖ అధికారులు ఈ పథకాల వివరాలను అందుబాటులో ఉంచుతున్నారు.

Health Tips: ఇవి రోజుకు రెండు ఆకులు తింటే చాలు...అన్ని సమస్యలకు అద్భుత ప్రయోజనాలు!
Praja Vedika: నేడు (6/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
AP Funds Release: ఏపీకి తీపికబురు.. రూ.281 కోట్ల నిధులు విడుదల! ఆ కష్టాలన్నీ తీరిపోయాయి...
ఎన్నారైలకు టీటీడీ శుభవార్త: మంత్రి లోకేష్ అమెరికా పర్యటన సందర్భంగా.. వీఐపీ బ్రేక్ దర్శనం కోటా 100 కు పెంపు!
USA News: విషాదం.. అమెరికాలో భారీ అగ్నిప్రమాదం.. ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి!

Spotlight

Read More →