LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
NRI

USA Updates: కాలిఫోర్నియాలో మార్మోగిన పసుపు జెండా: వైభవంగా ఎన్నారై టీడీపీ మహానాడు, ఎన్టీఆర్ జయంతి వేడుకలు!

USA Updates: బే ఏరియాలో ఎన్నారై టీడీపి ఆధ్వర్యంలో మహానాడుతోపాటు ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు.

AndhraPravasi News Desk 2 min read
USA Updates: కాలిఫోర్నియాలో మార్మోగిన పసుపు జెండా: వైభవంగా ఎన్నారై టీడీపీ మహానాడు, ఎన్టీఆర్ జయంతి వేడుకలు!
  • కాలిఫోర్నియాలో ఘనంగా మహానాడు… ఎన్టీఆర్ జయంతి వేడుకలు…
     
  • బే ఏరియాలో ఎన్టీఆర్ 103వ జయంతి సంబరాలు: జయరాం కోమటి ఆధ్వర్యంలో ఘన నివాళులు!

USA Updates: బే ఏరియాలో ఎన్నారై టీడీపి ఆధ్వర్యంలో మహానాడుతోపాటు ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఎన్నారై టీడీపి నాయకుడు జయరాం కోమటి ఆధ్వర్యంలో మిల్పిటాస్ లోని బిర్యానీ జంక్షన్ (స్వాగత్)లో జరిగిన ఈ వేడుకలకు దాదాపు 100మందికిపైగా టిడిపి అభిమానులు హాజరయ్యారు. ఎన్టీఆర్‌కు అందరూ నివాళులు అర్పిస్తూ, ఆయన చేసిన సేవలను, నటనను గుర్తుకు తెచ్చుకున్నారు.

ఈ సందర్భంగా జయరాం కోమటి మాట్లాడుతూ, పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా నటుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీరామారావు తెలుగు దేశం పార్టీని స్థాపించారని, ఆయన ఆశయాలను ప్రస్తుత ముఖ్యమంత్రి, టీడీపి జాతీయ నాయకుడు చంద్రబాబు నాయుడు కొనసాగిస్తూ వస్తున్నారని చెప్పారు. రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలోకి పయనింపజేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు మంత్రి నారా లోకేష్ కూడా ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి మహానాడు ప్రారంభించిన టైములోనే ఇక్కడ కూడా ప్రారంభించడం సంతోషంగా ఉందని కూడా జయరాం కోమటి చెప్పారు. మహానాడు రెండవరోజు కూడా మెయిన్ స్క్రీన్ పై జయరాం కోమటి ఎన్నారైల భాగస్వామ్యంపై మాట్లాడనున్నారు

ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ తో కొన్ని సినిమాల్లో నటించిన ప్రముఖ రంగస్థల నటుడు అక్కిరాజు సుందరరామకృష్ణ పాల్గొనడం హైలైట్‌గా నిలిచింది. ఆయన ఎన్టీఆర్ తో తనకు ఉన్న అనుభవాలను పంచుకున్నారు. పౌరాణిక పద్యాలను పాడి అందరినీ ఆకట్టుకున్నారు. 78 సంవత్సరాల వయస్సు ఉన్న ఆయన గతంలో జమునతో కలిసి శ్రీకృష్ణరాయబారం నాటకాలను వివిధ చోట్ల వేశారు.

ఎన్నారై టీడిపి నాయకుడు వెంకట్ కోగంటి ఈ వేడుకల నిర్వహణలో కీలకపాత్ర పోషించారు. ఈ సందర్భంగా చిన్నారులచేత కేక్ కట్ చేయించారు. తరువాత జూమ్ మీటింగ్ ద్వారా మెయిన్ మహానాడును వీక్షించారు.

ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ తాడపనేని, విజయ్ గుమ్మడి, వీరు ఉప్పల, విజయ్ సాగర్ రెడ్డి, సీతారాం కొడాలి, అంబటి సతీష్, వాసు బండ్ల, భాస్కర్ అన్నె, సురేంద్ర కారుమంచి, శ్రీనివాస్ వల్లూరిపల్లి, జగదీష్ గింజుపల్లి, తెలుగు టైమ్స్ ఎడిటర్ సి.వి. సుబ్బారావు, శివ దువ్వూరు, హరి బొప్పూడి, రమేష్ మల్లారపు, నరహరి మార్నేని, ధీరజ్ కావూరి, అశోక్ మైనేని, కోన నరేంద్రనాథ్ రెడ్డి, మోహన్ మల్లంపాటి, వెంకట్ పరిమి, రవికిరణ్ ఆలేటి, రాఘవయ్య,  రాజశేఖర్ పర్వతనేని, చంద్రశేఖర్ తిరుమలపుత్ర, రాంబాబు మానుకొండ, మోహన్ శ్రీకాంత్ పచవ, కళ్యాణ్ వీరపనేని, వీరబాబు పత్తిపాటి, లోకేష్, ధీరజ్ కావూరి, మురళీ, కృష్ణ చెరుకుళ్ళ, మునిరెడ్డి, శివ అద్దంకి, నవీన్ కొడాలి, అనిల్ రెడ్డి దప్పిలి, సుధీర్ నెల్లూరు, శ్రీనివాస్ వెలగపూడి, సురేష్ బాబు రాగలపల్లి, మధుసూదన్ రెడ్డివారి, బిల్ల భగవాన్ తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో పలువురు మహిళలు కూడా పాల్గొనడం విశేషం. సునీత రాయపనేని, శిరీష నెక్కలపూడి, విలేఖ్య వెనిగళ్ళ, శైలజ వెల్లంకి, ప్రభావతి కొప్పల్లి, మానస పరిమి, శ్రీదేవి శిరియాలు నెల్లూరి, దివ్య శ్రీ తదితర మహిళలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

Be the first to react

More Coverage

TCA: టీ‌సీఏ స్వర్ణోత్సవ వేడుకలకు నృత్య కళాకారుల ఆహ్వానం.. ‘స్వాగత గీతం’, ‘స్వర్ణ వైభవం’ కోసం దరఖాస్తుల స్వీకరణ!

TCA: టీ‌సీఏ స్వర్ణోత్సవ వేడుకలకు నృత్య కళాకారుల ఆహ్వానం.. ‘స్వాగత గీతం’, ‘స్వర్ణ వైభవం’ కోసం దరఖాస్తుల స్వీకరణ!

TCA: అమెరికాలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తున్న హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమి…