LIVE
Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  •  6G Network: భారత్‌లో 6G సంచలనం.. టెలికాం రంగం రూపురేఖలు మార్చబోతున్న కేంద్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
NRI

Middle East War: మీ నాగరికతను భూస్థాపితం చేస్తా".. ఇరాన్‌పై డొనాల్డ్ ట్రంప్ యుద్ధ గర్జన!

Middle East Crisis: ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన 48 గంటల గడువు నేటి రాత్రితో ముగియనుంది. హర్మూజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్ నాగరికతను తుడిచిపెట్టేస్తామని ట్రంప్ చేసిన ఘాటు హెచ్చరికలు, తాజా పరిణామాలు

AndhraPravasi News Desk 2 min read
Middle East War: మీ నాగరికతను భూస్థాపితం చేస్తా".. ఇరాన్‌పై డొనాల్డ్ ట్రంప్ యుద్ధ గర్జన!

Middle East Crisis: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు ఇచ్చిన 48 గంటల గడువు ఈ రాత్రి  ముగియనుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకవేళ ఇరాన్ వెనక్కి తగ్గకపోతే, ఆ దేశ నాగరికతనే అంతం చేస్తామంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవకపోతే ఇరాన్ చరిత్రలో ఇది అత్యంత చీకటి రాత్రి అవుతుందని ఆయన హెచ్చరించారు.

ట్రంప్ తన సొంత సోషల్ మీడియా వేదిక 'ట్రూత్ సోషల్'లో స్పందిస్తూ.. ఇరాన్‌లో దశాబ్దాలుగా సాగుతున్న అరాచక పాలనకు ముగింపు పలికే సమయం వచ్చిందని పేర్కొన్నారు. ఇరాన్ నాయకత్వం మారాల్సిన అవసరం ఉందని, కొత్తగా వచ్చే తెలివైన నేతలతో ఆ దేశ భవిష్యత్తు అద్భుతంగా ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. యుద్ధం చేయడం తనకు ఇష్టం లేకపోయినా, అమెరికా ప్రయోజనాల దృష్ట్యా కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదని, ఇరాన్ ప్రజలను ఆ దేవుడే రక్షించాలని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

 అమెరికా తీరుపై ఐక్యరాజ్యసమితి (UN) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పౌర మౌలిక సదుపాయాలపై దాడులు చేయడం అంతర్జాతీయ చట్టాల ప్రకారం నేరమని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ హెచ్చరించారు. యుద్ధ నేరాలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని సూచించినప్పటికీ, ట్రంప్ మాత్రం తాను దేనికీ భయపడటం లేదని స్పష్టం చేశారు. ఇరాన్‌లోని ప్రతి విద్యుత్ కేంద్రం, వంతెన తమ లక్ష్యంగా ఉంటాయని ఆయన పరోక్షంగా బాంబు దాడుల సూచన ఇచ్చారు.

మరోవైపు ఇరాన్ కూడా వెనక్కి తగ్గడం లేదు. అమెరికా బెదిరింపులకు లొంగే ప్రసక్తి లేదని ఆ దేశ అధికారులు తెగేసి చెబుతున్నారు. కేవలం తాత్కాలికంగా యుద్ధాన్ని ఆపడం కాకుండా, శాశ్వత పరిష్కారం కావాలని వారు పట్టుబడుతున్నారు. ఈ లోపే ఇరాన్ చమురు ఎగుమతి కేంద్రమైన ఖర్గ్ ద్వీపం సమీపంలో భారీ పేలుళ్లు సంభవించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇది అమెరికా హెచ్చరికల ఫలితమేనా లేక ఇతర కారణాలు ఉన్నాయా అన్నది ఇంకా స్పష్టం కాలేదు.

మొత్తానికి మంగళవారం రాత్రి 8 గంటల  లోపు ఇరాన్ తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే పరిస్థితులు చేయి దాటిపోయేలా ఉన్నాయి. ఇప్పటికే ఇరాన్ సుప్రీం లీడర్ అనారోగ్యంతో ఉన్నారనే వార్తలు, మరోవైపు పాకిస్థాన్ వంటి పొరుగు దేశాలు ఈ యుద్ధ ప్రభావంతో లాక్‌డౌన్‌లు ప్రకటించడం చూస్తుంటే.. ఈ రాత్రి ప్రపంచ చరిత్రలో అత్యంత కీలకమైనదిగా మారనుంది. ఏం జరగబోతుందోనని యావత్ ప్రపంచం ఊపిరి బిగబట్టి చూస్తోంది.

Be the first to react

More Coverage

TCA: టీ‌సీఏ స్వర్ణోత్సవ వేడుకలకు నృత్య కళాకారుల ఆహ్వానం.. ‘స్వాగత గీతం’, ‘స్వర్ణ వైభవం’ కోసం దరఖాస్తుల స్వీకరణ!

TCA: టీ‌సీఏ స్వర్ణోత్సవ వేడుకలకు నృత్య కళాకారుల ఆహ్వానం.. ‘స్వాగత గీతం’, ‘స్వర్ణ వైభవం’ కోసం దరఖాస్తుల స్వీకరణ!

TCA: అమెరికాలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తున్న హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమి…