Middle East War: 4,000 లక్ష్యాలు.. వేల సంఖ్యలో బాంబులు: ఇరాన్‌లో ఐడీఎఫ్ విధ్వంసం! Donald Trump: అమెరికాలో నేషనల్ ఎలిజిబుల్ ఓటర్ లిస్ట్: ట్రంప్ కీలక నిర్ణయం Donald Trump: జన్మతః పౌరసత్వ రద్దుపై తగ్గేదే లేదంటున్న ట్రంప్.. సుప్రీంకోర్టు ఏమందంటే? Bunker Buster Bombs: బంకర్ బస్టర్లతో ఇరాన్ పై అమెరికా భీకర దాడులు.. దద్దరిల్లిన ఇస్ఫహాన్ నగరం! TDP 44th Anniversary: అమెరికా బే ఏరియాలో పసుపు జెండా రెపరెపలు... ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు! Malta TDP 44th Anniversary: మాల్టా తీరాన మిన్నంటిన టీడీపీ ఆవిర్భావ వేడుకలు.. సీఎం చంద్రబాబు విజన్‌పై ఎన్ఆర్ఐల ప్రశంసలు! Middle East War: రష్యా చమురు సామ్రాజ్యంపై ఉక్రెయిన్ డ్రోన్ల మెరుపు దాడి.. ఉస్త్ లుగా పోర్టు అతలాకుతలం! No Kings Protest: అమెరికాలో ప్రజా గర్జన.... ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా 50 రాష్ట్రాల్లో 'నో కింగ్స్' నిరసనలు! TFAS నూతన ప్రస్థానం... 2026 టర్మ్ కోసం కొత్త ట్రస్టీలు, ఆఫీసర్ల ప్రకటన! TAMA: తామా టోర్నమెంట్‌లో ప్రతిభ చాటిన తెలుగు క్రీడాకారులు! Middle East War: 4,000 లక్ష్యాలు.. వేల సంఖ్యలో బాంబులు: ఇరాన్‌లో ఐడీఎఫ్ విధ్వంసం! Donald Trump: అమెరికాలో నేషనల్ ఎలిజిబుల్ ఓటర్ లిస్ట్: ట్రంప్ కీలక నిర్ణయం Donald Trump: జన్మతః పౌరసత్వ రద్దుపై తగ్గేదే లేదంటున్న ట్రంప్.. సుప్రీంకోర్టు ఏమందంటే? Bunker Buster Bombs: బంకర్ బస్టర్లతో ఇరాన్ పై అమెరికా భీకర దాడులు.. దద్దరిల్లిన ఇస్ఫహాన్ నగరం! TDP 44th Anniversary: అమెరికా బే ఏరియాలో పసుపు జెండా రెపరెపలు... ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు! Malta TDP 44th Anniversary: మాల్టా తీరాన మిన్నంటిన టీడీపీ ఆవిర్భావ వేడుకలు.. సీఎం చంద్రబాబు విజన్‌పై ఎన్ఆర్ఐల ప్రశంసలు! Middle East War: రష్యా చమురు సామ్రాజ్యంపై ఉక్రెయిన్ డ్రోన్ల మెరుపు దాడి.. ఉస్త్ లుగా పోర్టు అతలాకుతలం! No Kings Protest: అమెరికాలో ప్రజా గర్జన.... ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా 50 రాష్ట్రాల్లో 'నో కింగ్స్' నిరసనలు! TFAS నూతన ప్రస్థానం... 2026 టర్మ్ కోసం కొత్త ట్రస్టీలు, ఆఫీసర్ల ప్రకటన! TAMA: తామా టోర్నమెంట్‌లో ప్రతిభ చాటిన తెలుగు క్రీడాకారులు!

Donald Trump: అమెరికాలో నేషనల్ ఎలిజిబుల్ ఓటర్ లిస్ట్: ట్రంప్ కీలక నిర్ణయం

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల వ్యవస్థలో కీలక మార్పులకు శ్రీకారం చుడుతూ ఒక కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు....

Published : 2026-04-01 11:05:00

NRI- ఎన్నికల సంస్కరణలకు ట్రంప్ శ్రీకారం – కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం.

నకిలీ ఓట్లకు చెక్: దేశవ్యాప్త ఓటర్ల జాబితాకు అమెరికా అధ్యక్షుడు ఆదేశం.

అమెరికాలో ఓటర్ ఐడీ నిబంధనలు కఠినతరం – ట్రంప్ కొత్త రూల్స్.

Donald Trump: అమెరికాలో ఎన్నికల పారదర్శకతను పెంచే లక్ష్యంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దేశవ్యాప్త 'నేషనల్ ఎలిజిబుల్ ఓటర్ లిస్ట్' (National Eligible Voter List) రూపకల్పనకు ఆదేశాలిచ్చారు. ఇందుకోసం రూపొందించిన కార్యనిర్వాహక ఉత్తర్వుపై ఆయన సంతకం చేశారు. ఈ ఏడాది జరగనున్న మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో, ఓటర్ల జాబితాలో అర్హులైన వారిని మాత్రమే ఉంచాలని, అక్రమ ఓట్లను నిరోధించాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ ప్రక్రియలో భాగంగా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం, సోషల్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ సంయుక్తంగా పని చేయనున్నాయి. ప్రతి రాష్ట్రంలోని అర్హులైన ఓటర్ల డేటాను సేకరించి, ఒకే కేంద్రీకృత జాబితాను తయారు చేయడం దీని ప్రధాన ఉద్దేశ్యం. దీనివల్ల నకిలీ ఓటర్లను గుర్తించడం సులభతరం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో ట్రంప్ భారత్, బ్రెజిల్ వంటి దేశాల్లోని బయోమెట్రిక్ ఓటర్ గుర్తింపు వ్యవస్థలను ప్రశంసించిన నేపథ్యంలో ఈ మార్పులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

అయితే, ఈ నిర్ణయంపై అమెరికాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల భద్రతకు ఇది అవసరమని కొందరు మద్దతు ఇస్తుండగా, ఇది ఓటర్లపై మరిన్ని ఆంక్షలు విధించడమేనని మరికొందరు విమర్శిస్తున్నారు. ముఖ్యంగా పౌరసత్వ ధృవీకరణ పత్రాలు లేని వారు ఓటింగ్ ప్రక్రియకు దూరమయ్యే ప్రమాదం ఉందని విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Spotlight

Read More →