LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
NRI

TUDA: కువైట్ ప్రవాసాంధ్ర టీడీపీ నేతలతో తుడా చైర్మన్ భేటీ!

Tirupati Urban Development Authority (TUDA): ప్రవాసాంధ్ర తెలుగుదేశం పార్టీ (ఎన్‌ఆర్‌ఐ టీడీపీ) కువైట్ అధ్యక్షుడు ములకల సుబ్బరాయుడు నాయుడు, మాజీ వైస్ ప్రెసిడెంట్ పిడికిటి శ్రీనివాస్ చౌదరి ఈ రోజు ఉదయం తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.

AndhraPravasi News Desk 1 min read
TUDA: కువైట్ ప్రవాసాంధ్ర టీడీపీ నేతలతో తుడా చైర్మన్ భేటీ!

ఎన్‌ఆర్‌ఐ టీడీపీ–కువైట్ నిర్వహించనున్న “మినీ మహానాడు" కు ఆహ్వానం..

టీడీపీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంగా..

తిరుపతి: ప్రవాసాంధ్ర తెలుగుదేశం పార్టీ (ఎన్‌ఆర్‌ఐ టీడీపీ) కువైట్ అధ్యక్షుడు ములకల సుబ్బరాయుడు నాయుడు, మాజీ వైస్ ప్రెసిడెంట్ పిడికిటి శ్రీనివాస్ చౌదరి ఈ రోజు ఉదయం తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా కువైట్‌లో మే 22న ఎన్‌ఆర్‌ఐ టీడీపీ–కువైట్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న “మినీ మహానాడు” కార్యక్రమానికి ఆయనను ఆహ్వానించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఆయన సహకారం కోరారు. అలాగే కువైట్‌లో ఉన్న ఎన్ఆర్ఐల తరఫున ఎదురవుతున్న కొన్ని చిన్న చిన్న సమస్యలను కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అక్కడి పరిస్థితులు, అవసరమైన సదుపాయాలు, తీసుకోవాల్సిన చర్యలపై నేతలు వివరంగా చర్చించారు.

వారి మాటలను శ్రద్ధగా విన్న డాలర్ దివాకర్ రెడ్డి గారు, ఏ సహాయం కావాలన్నా నేను ఎప్పుడూ మీకు అండగా ఉంటాను అంటూ హామీ ఇచ్చారు. ఈ భేటీ స్నేహపూర్వక వాతావరణంలో కొనసాగి, ప్రవాసాంధ్రుల సమస్యల పరిష్కారానికి ఒక మంచి దిశగా మారుతుందని నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.

Be the first to react

More Coverage

TCA: టీ‌సీఏ స్వర్ణోత్సవ వేడుకలకు నృత్య కళాకారుల ఆహ్వానం.. ‘స్వాగత గీతం’, ‘స్వర్ణ వైభవం’ కోసం దరఖాస్తుల స్వీకరణ!

TCA: టీ‌సీఏ స్వర్ణోత్సవ వేడుకలకు నృత్య కళాకారుల ఆహ్వానం.. ‘స్వాగత గీతం’, ‘స్వర్ణ వైభవం’ కోసం దరఖాస్తుల స్వీకరణ!

TCA: అమెరికాలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తున్న హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమి…