LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
NRI

TLCA: న్యూయార్క్ లో TLCA ఆధ్వర్యంలో వైభవంగా ఉగాది–శ్రీరామనవమి వేడుకలు!

Telugu Literary and Cultural Association (TLCA): న్యూయార్క్‌లోని తెలుగు సాహిత్య సాంస్కృతిక సంస్థ (TLCA) ఆధ్వర్యంలో పరాభవ నామ సంవత్సర ఉగాది, శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

AndhraPravasi News Desk 1 min read
TLCA: న్యూయార్క్ లో TLCA ఆధ్వర్యంలో వైభవంగా ఉగాది–శ్రీరామనవమి వేడుకలు!

ప్రధాన ఆకర్షణ గా ఆస్కార్ విజేత చంద్రబోస్..

సందడిగా సాంస్కృతిక కార్యక్రమాలు, తెలుగు వారందరికీ ఆహ్వానం..

న్యూయార్క్‌లోని తెలుగు సాహిత్య సాంస్కృతిక సంస్థ (TLCA) ఆధ్వర్యంలో పరాభవ నామ సంవత్సర ఉగాది, శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏప్రిల్ 18, 2026 (శనివారం) మధ్యాహ్నం 3 గంటల నుంచి ఫ్లషింగ్‌లోని హిందూ టెంపుల్ సొసైటీ ఆఫ్ నార్త్ అమెరికా వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది.

ఈ వేడుకల్లో ఆస్కార్ విజేత, ప్రముఖ సినీ గేయ రచయిత, గాయకుడు చంద్రబోస్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ఆయనతో “ఆస్కార్ ముచ్చట్లు – పాట వెనుక మాట – మాటల బాట” అనే ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సెషన్‌లో ఆయన అనుభవాలు, సినీ ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలు పంచుకోనున్నారు.

ఉత్సవాల్లో టాలీవుడ్ గాయకుల లైవ్ పెర్ఫార్మెన్స్, సాంస్కృతిక ప్రదర్శనలు, స్కిట్లు, స్థానిక కళాకారుల ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించనున్నాయి. కార్యక్రమానికి విచ్చేసే అతిథుల కోసం పండుగ ప్రత్యేక ‘ట్రెడిషనల్ డిన్నర్’ కూడా ఏర్పాటు చేశారు.

ఈ వేడుకలను TLCA అధ్యక్షుడు సుమంత్ రామ్ సెట్టి నాయకత్వంలో వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ సనిగెపల్లి, సెక్రటరీ లావణ్య అట్లూరి, ట్రెజరర్ సునీల్ చల్లాగుళ్ల, జాయింట్ సెక్రటరీ దివ్య దొమ్మరాజు, జాయింట్ ట్రెజరర్ సుధా మన్నవతో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ప్రవీణ్ కరణం, సునీత పోలేపల్లి, శిరీష తునుగుంట్ల, రజిత కల్లూరి, రాంబాబు జల్లేపల్లి, సాయి దేవినేని, మాజీ అధ్యక్షుడు కిరణ్ రెడ్డి పర్వతాల సమన్వయంతో నిర్వహిస్తున్నారు.

న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్ ప్రాంతాల్లో నివసిస్తున్న తెలుగు కుటుంబాలందరూ ఈ వేడుకలకు హాజరై తెలుగు సంస్కృతిని ఆస్వాదించాలని నిర్వాహకులు ఆహ్వానిస్తున్నారు. మరిన్ని వివరాల కోసం TLCA అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని తెలిపారు.

Be the first to react

More Coverage

TCA: టీ‌సీఏ స్వర్ణోత్సవ వేడుకలకు నృత్య కళాకారుల ఆహ్వానం.. ‘స్వాగత గీతం’, ‘స్వర్ణ వైభవం’ కోసం దరఖాస్తుల స్వీకరణ!

TCA: టీ‌సీఏ స్వర్ణోత్సవ వేడుకలకు నృత్య కళాకారుల ఆహ్వానం.. ‘స్వాగత గీతం’, ‘స్వర్ణ వైభవం’ కోసం దరఖాస్తుల స్వీకరణ!

TCA: అమెరికాలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తున్న హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమి…