LIVE
Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతి!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
NRI

TFAS: న్యూజెర్సీలో ఘంటసాల పాటలపై ప్రత్యేక వర్క్‌షాప్… సంగీతాభిమానులకు అరుదైన అవకాశం

Telugu Fine Arts Society (TFAS): న్యూజెర్సీలోని తెలుగు కళా సమితి (TFAS) ఆధ్వర్యంలో అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు పాటలు, పద్యాలపై ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సంగీతాన్ని ప్రేమించే వారికి ఇది ఒక అరుదైన అవకాశం.

AndhraPravasi News Desk 1 min read
TFAS: న్యూజెర్సీలో ఘంటసాల పాటలపై ప్రత్యేక వర్క్‌షాప్… సంగీతాభిమానులకు అరుదైన అవకాశం

ఏప్రిల్ 22 నుండి 27, 2026 వరకు..

రిజిస్ట్రేషన్ ఫీజు 100 డాలర్లు..

న్యూజెర్సీలోని తెలుగు కళా సమితి (TFAS) ఆధ్వర్యంలో అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు పాటలు, పద్యాలపై ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సంగీతాన్ని ప్రేమించే వారికి ఇది ఒక అరుదైన అవకాశం.

ఈ వర్క్‌షాప్‌ను ఘంటసాల స్వర పరిశోధకులు, “స్వర సామ్రాట్”గా పేరుగాంచిన డాక్టర్ టి. శరత్ చంద్ర నిర్వహించనున్నారు. ఆయన మార్గదర్శకత్వంలో పాల్గొనే వారికి ఘంటసాల గాన శైలి, పాటల భావం, పద్యాల అందం గురించి లోతైన అవగాహన కలిగించనున్నారు.

ఈ శిక్షణ కార్యక్రమం ఏప్రిల్ 22 నుంచి 27, 2026 వరకు ప్రతిరోజూ సాయంత్రం 6 గంటలకు జరగనుంది. వేదికగా వారెన్‌లోని శ్రీ గంగాధర్ దేశు నివాసాన్ని నిర్ణయించారు. పిల్లలు, పెద్దలు ఎవరికైనా ఈ వర్క్‌షాప్‌లో పాల్గొనే అవకాశం ఉంది. రిజిస్ట్రేషన్ ఫీజు 100 డాలర్లు కాగా, ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకోవచ్చు.

ఈ శిక్షణలో పాల్గొన్న వారికి మే 3న జరిగే ఉగాది వేడుకల్లో తమ ప్రతిభను ప్రదర్శించే ప్రత్యేక అవకాశం కల్పించనున్నారు. దీంతో పాల్గొనే వారికి ప్రాక్టికల్ అనుభవం కూడా లభిస్తుంది.

మరిన్ని వివరాల కోసం శ్రీమతి వరలక్ష్మి శ్రీనివాస్, ప్రసాద్ వూటుకూరు లను సంప్రదించవచ్చని నిర్వాహకులు తెలిపారు. అదేవిధంగా శరత్ చంద్రను వాట్సాప్ ద్వారా కూడా సంప్రదించవచ్చు.

ఈ కార్యక్రమాన్ని TFAS బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యులు మధు అన్న, లోకేందర్ గిరకల, అరుంధతి శకెల్లి, వెంకట సత్య తాతా, శేషగిరిరావు కంభంమెట్టు, వరలక్ష్మి రాధాకృష్ణ, వాణి కునిశెట్టి, లతాదేవి మడిశెట్టి, ప్రసాద్ వూటుకూరు తదితరులు సమన్వయంతో పర్యవేక్షిస్తున్నారు. సంగీతాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరికీ ఈ వర్క్‌షాప్ ఒక మంచి అవకాశం. ఘంటసాల గాన మాధుర్యాన్ని నేర్చుకుంటూ, భవిష్యత్ తరాలకు అందించే ప్రయత్నంగా ఈ కార్యక్రమం నిలవనుంది.

Be the first to react

More Coverage

TCA: టీ‌సీఏ స్వర్ణోత్సవ వేడుకలకు నృత్య కళాకారుల ఆహ్వానం.. ‘స్వాగత గీతం’, ‘స్వర్ణ వైభవం’ కోసం దరఖాస్తుల స్వీకరణ!

TCA: టీ‌సీఏ స్వర్ణోత్సవ వేడుకలకు నృత్య కళాకారుల ఆహ్వానం.. ‘స్వాగత గీతం’, ‘స్వర్ణ వైభవం’ కోసం దరఖాస్తుల స్వీకరణ!

TCA: అమెరికాలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తున్న హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమి…