Malaysia: మలేషియాలో NRI మంత్రి కొండపల్లి తో ఘనంగా ‘మీట్ అండ్ గ్రీట్’.. ఏపీ అభివృద్ధిలో ఎన్నారైల భాగస్వామ్యంపై విస్తృత చర్చ!
Malaysia: ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన తెలుగు సమాజాన్ని ఒకే వేదికపైకి తీసుకురావడంతో పాటు, మాతృభూమి అభివృద్ధికి ప్రవాసాంధ్రుల సహకారాన్ని అందిపుచ్చుకోవడంలో Telugu Expats Association of Malaysia (TEAM) కీలకంగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా మలేషియాలో నివసిస్తున్న తెలుగు ప్రవాసుల కోసం TEAM ఆధ్వర్యంలో ప్రత్యేక ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ప్రవాసాంధ్రులే రాష్ట్ర అభివృద్ధికి బలమైన భాగస్వాములు: మంత్రి కొండపల్లి శ్రీనివాస్..
ఏపీ అభివృద్ధిలో ఎన్నారైల భాగస్వామ్యం పెంచుతాం.. మలేషియాలో మంత్రి కొండపల్లి..
కౌలాలంపూర్: ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన తెలుగు సమాజాన్ని ఒకే వేదికపైకి తీసుకురావడంతో పాటు, మాతృభూమి అభివృద్ధికి ప్రవాసాంధ్రుల సహకారాన్ని అందిపుచ్చుకోవడంలో Telugu Expats Association of Malaysia (TEAM) కీలకంగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా మలేషియాలో నివసిస్తున్న తెలుగు ప్రవాసుల కోసం TEAM ఆధ్వర్యంలో ప్రత్యేక ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర MSME, SERP, NRI సాధికారత శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విదేశీ పర్యటనలో భాగంగా మలేషియాకు వచ్చిన మంత్రికి TEAM ప్రతినిధులు, స్థానిక తెలుగు ప్రముఖులు సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు. తమ మధ్య రాష్ట్ర మంత్రిని కలుసుకోవడం మలేషియా తెలుగు సమాజానికి ప్రత్యేక ఆనందాన్ని కలిగించింది.
ఏపీ-ప్రవాసాంధ్రుల మధ్య బంధం మరింత బలోపేతం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, విదేశాల్లో స్థిరపడిన ప్రవాసాంధ్రుల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడమే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశంగా నిలిచింది. మలేషియాలోని వివిధ రంగాలకు చెందిన తెలుగు వారిని ఒకే వేదికపైకి తీసుకువచ్చి, వారితో మంత్రి నేరుగా మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో ఎన్నారైల మేధోసంపత్తి, పెట్టుబడులు, నైపుణ్యాలను ఎలా వినియోగించుకోవచ్చనే అంశంపై చర్చ జరిగింది. రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో ప్రవాసాంధ్రులను మరింత చురుకైన భాగస్వాములుగా మార్చేందుకు ఉన్న అవకాశాలపైనా అభిప్రాయాలను పంచుకున్నారు.
MSME పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై వివరణ
ప్రవాస తెలుగు సమాజ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, ఐటీ నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సమావేశం స్నేహపూర్వక వాతావరణంలో సాగింది. రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (MSME) స్థాపనకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు, సింగిల్ విండో అనుమతులు, పెట్టుబడి అవకాశాలను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రవాసాంధ్రులకు ఉన్న అవకాశాలను ఆయన వివరంగా తెలియజేశారు.
అదే సమయంలో SERP ద్వారా మహిళా సంఘాల సాధికారతను పెంచేందుకు చేపడుతున్న కార్యక్రమాలను కూడా వివరించారు. మారుమూల గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రవాసాంధ్రులు సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ఎలా భాగస్వాములు కావచ్చనే అంశంపై చర్చ జరిగింది.
ప్రతి ఒక్కరితో మంత్రి ఆత్మీయంగా మమేకం
ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా నిలిచిన అంశం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వ్యవహరించిన తీరు. కేవలం ప్రసంగానికి పరిమితం కాకుండా కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరితో ఆయన నేరుగా మాట్లాడారు.
మలేషియా తెలుగు ప్రవాసులు ఎదుర్కొంటున్న సమస్యలు, సాంకేతిక ఇబ్బందులు, వారి అభిప్రాయాలు, మాతృభూమి అభివృద్ధిపై వారికి ఉన్న వినూత్న ఆలోచనలను మంత్రి ఓపికగా తెలుసుకున్నారు.
విదేశాల్లో నివసిస్తున్న తెలుగు వారికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. ముఖ్యంగా NRI సాధికారత శాఖ ద్వారా ప్రవాసుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

మంత్రికి ఘన సత్కారం
కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు TEAM ప్రతినిధులు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. TEAM డిప్యూటీ ప్రెసిడెంట్ కంచర్ల ఆనంద్, TEAM కోర్ కమిటీ సభ్యులు లక్ష్మీకాంత్, ఇంద్రనీల్, చందు, శైలేంద్ర, ప్రత్యూష, మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ను ఘనంగా సత్కరించారు. అలాగే ఈ కార్యక్రమంలో MAA ప్రెసిడెంట్ శ్రీరామ్, శారద, సందీప్, తదితరులు పాల్గొన్నారు.

కార్యక్రమానికి సమయం కేటాయించి దిశానిర్దేశం చేసిన మంత్రికి, కార్యక్రమం కోసం కష్టపడ్డ TEAM సభ్యులకు, పెద్ద సంఖ్యలో హాజరైన తెలుగు కుటుంబాలకు నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమానికి వచ్చిన అతిథులకు సంప్రదాయ రుచులతో కూడిన అల్పాహారం అందించడంతో పాటు, మంచి వసతులు, ఆతిథ్యాన్ని కల్పించారు.

మలేషియా వేదికగా జరిగిన ఈ ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమం ప్రవాసాంధ్రులలో ఆత్మీయ అనుభూతిని కలిగించింది. విదేశాల్లో ఉన్నప్పటికీ మాతృభూమితో తమ అనుబంధాన్ని మరింత బలపరుచుకోవాలనే ఆకాంక్షను ఈ సమావేశం చాటిచెప్పింది.
భవిష్యత్తులోనూ ప్రవాసాంధ్రులు, రాష్ట్ర ప్రభుత్వం మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇలాంటి కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని నిర్వాహకులు ఆకాంక్షించారు.

రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెట్టేందుకు సింగపూర్‌లోని ప్రవాస తెలుగు సమాజం తమ పూర్తి సహకారం అందిస్తామని ప్రతిజ్ఞ చేసింది. ‘జై తెలుగు తల్లి.. జై ఆంధ్రప్రదేశ్’ నినాదాలతో కార్యక్రమం ముగిసింది.
Tags
1 readers have reacted