LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
NRI

TTA: న్యూజెర్సీలో ఘనంగా టీటీఏ మెగా కన్వెన్షన్ 2026 కిక్ ఆఫ్! కన్నుల పండుగగా మీట్ అండ్ గ్రీట్!

Telangana American Telugu Association (TTA): తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (TTA) ఆధ్వర్యంలో నిర్వహించనున్న టీటీఏ మెగా కన్వెన్షన్ 2026 సన్నాహక కార్యక్రమాలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి.

AndhraPravasi News Desk 1 min read
TTA: న్యూజెర్సీలో ఘనంగా టీటీఏ మెగా కన్వెన్షన్ 2026 కిక్ ఆఫ్! కన్నుల పండుగగా మీట్ అండ్ గ్రీట్!

టీటీఏ మెగా కన్వెన్షన్ 2026..

ఎడిసన్ నగరంలోని అక్బర్ రెస్టారెంట్ వేదికగా..

తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (TTA) ఆధ్వర్యంలో నిర్వహించనున్న టీటీఏ మెగా కన్వెన్షన్ 2026 సన్నాహక కార్యక్రమాలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా అమెరికాలోని న్యూజెర్సీలో నిర్వహించిన “కన్వెన్షన్ కిక్ ఆఫ్ – మీట్ అండ్ గ్రీట్” కార్యక్రమం ఎంతో వైభవంగా, కన్నుల పండుగగా సాగింది.

ఎడిసన్ నగరంలోని అక్బర్ రెస్టారెంట్ వేదికగా ఏప్రిల్ 11 (శనివారం) సాయంత్రం జరిగిన ఈ వేడుకకు టీటీఏ వ్యవస్థాపకులు డా. పైళ్ళ మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కన్వెన్షన్ లోగోను ఆవిష్కరించి, రాబోయే మహాసభల ప్రాముఖ్యతను వివరించారు. విదేశాల్లో తెలుగు సంస్కృతిని పరిరక్షించడంలో ఇటువంటి కార్యక్రమాల పాత్ర ఎంతో ముఖ్యమని ఆయన తెలిపారు.

ఇక టీటీఏ మెగా కన్వెన్షన్ 2026 జూలై 17 నుంచి 19 వరకు అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం, షార్లెట్ కన్వెన్షన్ సెంటర్‌లో ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ మహాసభలు తెలుగు ప్రజలను ఒకే వేదికపైకి తీసుకువచ్చే వేడుకగా నిలుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

కిక్ ఆఫ్ ఈవెంట్‌లో వినోద కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రముఖ గాయకులు అద్వైత్, చైతు మద్దూరి తమ మధుర గానంతో ప్రేక్షకులను అలరించి, కార్యక్రమానికి మరింత ఉత్సాహాన్ని తెచ్చారు.

ఈ కార్యక్రమంలో టీటీఏ ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి మల్లిపెద్ది, కన్వెన్షన్ కన్వీనర్ ప్రవీణ్ చింత, కోఆర్డినేటర్లు నరేన్ దేవరపల్లి, శేఖర్ రెడ్డి తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు. అలాగే న్యూజెర్సీ టీమ్ ప్రతినిధులు శివ రెడ్డి కొల్ల (జనరల్ సెక్రటరీ), నరసింహ పెరుక, సుధాకర్ ఉప్పల, అరుణ్ అర్కల ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించారు.

మొత్తంగా ఈ కిక్ ఆఫ్ ఈవెంట్ టీటీఏ మెగా కన్వెన్షన్‌కు అద్భుతమైన ఆరంభంగా నిలిచింది. రాబోయే మహాసభలపై తెలుగు వర్గాల్లో ఆసక్తిని మరింత పెంచింది. మరిన్ని వివరాల కోసం www.ttaconvention.org వెబ్‌సైట్‌ను సందర్శించాలని నిర్వాహకులు కోరుతున్నారు.

Be the first to react

More Coverage

TCA: టీ‌సీఏ స్వర్ణోత్సవ వేడుకలకు నృత్య కళాకారుల ఆహ్వానం.. ‘స్వాగత గీతం’, ‘స్వర్ణ వైభవం’ కోసం దరఖాస్తుల స్వీకరణ!

TCA: టీ‌సీఏ స్వర్ణోత్సవ వేడుకలకు నృత్య కళాకారుల ఆహ్వానం.. ‘స్వాగత గీతం’, ‘స్వర్ణ వైభవం’ కోసం దరఖాస్తుల స్వీకరణ!

TCA: అమెరికాలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తున్న హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమి…