TASA: ప్రవాస భారతీయులకు టాసా ప్రత్యేక సదస్సు.. ఇమ్మిగ్రేషన్, వీసా అంశాలపై అవగాహన!
Telugu Association of San Antonio TASA: ప్రవాస భారతీయులకు ఉపయోగపడేలా TASA (శాన్ ఆంటోనియో తెలుగు సంఘం) ఆధ్వర్యంలో ప్రత్యేకంగా “ఇమ్మిగ్రేషన్ & వీసా అవగాహన సదస్సు” నిర్వహించనున్నారు.
మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు..
ప్రముఖ ఇమ్మిగ్రేషన్ న్యాయవాది ఉమా మంత్రవాడి..
శాన్ ఆంటోనియో, టెక్సాస్: ప్రవాస భారతీయులకు ఉపయోగపడేలా TASA (శాన్ ఆంటోనియో తెలుగు సంఘం) ఆధ్వర్యంలో ప్రత్యేకంగా “ఇమ్మిగ్రేషన్ & వీసా అవగాహన సదస్సు” నిర్వహించనున్నారు. ప్రస్తుత వీసా నిబంధనలు, తాజా పాలసీ మార్పులపై స్పష్టమైన అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.
ఈ సదస్సులో ప్రముఖ ఇమ్మిగ్రేషన్ న్యాయవాది ఉమా మంత్రవాడి పాల్గొని కీలక విషయాలను వివరించనున్నారు. ముఖ్యంగా అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు ఉపయోగపడే అంశాలపై ఆమె సమగ్ర సమాచారం అందించనున్నారు.
ఈ కార్యక్రమం మే 3, 2026న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు శాన్ ఆంటోనియోలోని Lunna Event Center లో జరుగుతుంది.
సదస్సులో H1-B వీసా ఫైలింగ్స్, H4 నుండి F1 వీసాకు మార్పులు, STEM OPT & CPT అవకాశాలు, అలాగే EB2, EB5 వంటి ఇమ్మిగ్రేషన్ కేటగిరీలపై తాజా అప్‌డేట్స్ చర్చించనున్నారు. అదనంగా, ఇటీవల జరిగిన పాలసీ మార్పులపై కూడా స్పష్టమైన వివరణ ఇవ్వబడుతుంది.
ఈ సదస్సుకు ప్రవేశం పూర్తిగా ఉచితం అని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమం చివర్లో పాల్గొనేవారికి తమ సందేహాలను నేరుగా అడిగి నివృత్తి చేసుకునేలా ఇంటరాక్టివ్ Q&A సెషన్ ఏర్పాటు చేశారు.
ఆసక్తి గల వారు ముందుగానే తమ ప్రశ్నలను ఆన్‌లైన్ ద్వారా పంపించవచ్చని టాసా ప్రతినిధులు సూచించారు. మరిన్ని వివరాల కోసం ఆది నారాయణ, నీరజ సుంకర లేదా నూతన్ ఎల్లంకిలలను సంప్రదించవలసిందిగా టాసా కార్యవర్గం కోరింది. ప్రవాస భారతీయులు ఎదుర్కొంటున్న వీసా సమస్యలకు స్పష్టమైన మార్గదర్శనం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ సదస్సు నిర్వహించబడుతుండటం విశేషం.
Be the first to react