LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
NRI

TANA: తానా స్వర్ణోత్సవాల్లో భాగంగా చార్లెట్‌లో ఘనంగా ‘అడాప్ట్ స్ట్రీట్’ కార్యక్రమం!

Telugu Association of North Amercica: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) స్వర్ణోత్సవ వేడుకలను పురస్కరించుకుని అమెరికా వ్యాప్తంగా వినూత్న కమ్యూనిటీ సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. సామాజిక బాధ్యత, పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత లక్ష్యాలతో అమెరికాలోని 50 నగరాల్లో 50 రహదారులను దత…

AndhraPravasi News Desk 2 min read
TANA: తానా స్వర్ణోత్సవాల్లో భాగంగా చార్లెట్‌లో ఘనంగా ‘అడాప్ట్ స్ట్రీట్’ కార్యక్రమం!

అమెరికాలో 50 నగరాల్లో 50 రహదారుల దత్తతకు తానా శ్రీకారం..

పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణకు తానా వినూత్న కార్యక్రమం..

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) స్వర్ణోత్సవ వేడుకలను పురస్కరించుకుని అమెరికా వ్యాప్తంగా వినూత్న కమ్యూనిటీ సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. సామాజిక బాధ్యత, పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత లక్ష్యాలతో అమెరికాలోని 50 నగరాల్లో 50 రహదారులను దత్తత తీసుకునే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ మహత్తర కార్యక్రమానికి చార్లెట్ నగరం వేదికైంది.

‘గుడ్ నేబర్ డే’ వేడుకల సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో తానా నాయకులతో పాటు 50 మంది చిన్నారులు, 50 మంది తల్లిదండ్రులు పాల్గొనడం విశేషంగా నిలిచింది. చిన్నారుల్లో సామాజిక బాధ్యత పెంపొందించేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అందరి ప్రశంసలు అందుకుంది.

ఈ సందర్భంగా చార్లెట్ నగరంలోని ఆర్డ్రే కెల్ & టామ్ షార్ట్ కూడలిలోని ఇరువైపుల రహదారులను తానా ప్రతినిధులు అధికారికంగా దత్తత తీసుకున్నారు. కార్యక్రమానికి హాజరైన చార్లెట్ హౌజింగ్ అండ్ నైబర్‌హుడ్ సర్వీసెస్ అధికారి జొనాధన్ హిల్ తానా చేపట్టిన సేవా కార్యక్రమాన్ని అభినందిస్తూ పలు సూచనలు చేశారు. దత్తత తీసుకున్న రహదారుల వద్ద తానా పేరుతో ప్రత్యేక బోర్డులు కూడా ఏర్పాటు చేశారు.

పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్న వారికి నిర్వాహకులు అల్పాహారం, కాఫీ, టీ అందించి ఆతిథ్యం పలికారు. ఈ సేవా కార్యక్రమాన్ని చార్లెట్ సిటీ కౌన్సిల్ మెంబర్ ఎట్ లార్జ్ డింపుల్ అజ్మీరా ప్రత్యేకంగా అభినందించారు. సమాజానికి మేలు చేసే ఇలాంటి కార్యక్రమాలు అందరికీ స్ఫూర్తిదాయకమని ఆమె పేర్కొన్నారు.

ఈ సందర్భంగా తానా అధ్యక్షుడు నరేన్ కొడాలి మాట్లాడుతూ.. తానా స్వర్ణోత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని చార్లెట్ నగరంలో ప్రారంభించడం ఆనందంగా ఉందని చెప్పారు. పాల్గొన్న ప్రతి ఒక్కరినీ ఆయన అభినందించారు.

తానా ఈవీపీ శ్రీనివాస్ లావు, కమ్యూనిటీ సర్వీస్ కోఆర్డినేటర్ సాయి బొల్లినేని కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. చార్లెట్ తానా నాయకులు నాగ పంచుమర్తి, ఠాగూర్ మల్లినేని, మాధురి ఏలూరి, కిరణ్ కొత్తపల్లి, రవి (నాని) వడ్లముడి తదితరులు ఈ కార్యక్రమం విజయవంతానికి కృషి చేశారు. సామాజిక సేవతో పాటు పర్యావరణ పరిరక్షణలోనూ తెలుగు సమాజం ముందుండాలని తానా ఈ కార్యక్రమం ద్వారా మరోసారి చాటిచెప్పింది.

Be the first to react

More Coverage

TCA: టీ‌సీఏ స్వర్ణోత్సవ వేడుకలకు నృత్య కళాకారుల ఆహ్వానం.. ‘స్వాగత గీతం’, ‘స్వర్ణ వైభవం’ కోసం దరఖాస్తుల స్వీకరణ!

TCA: టీ‌సీఏ స్వర్ణోత్సవ వేడుకలకు నృత్య కళాకారుల ఆహ్వానం.. ‘స్వాగత గీతం’, ‘స్వర్ణ వైభవం’ కోసం దరఖాస్తుల స్వీకరణ!

TCA: అమెరికాలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తున్న హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమి…