TANA: గ్రామీణ ప్రజల తాగునీటి కష్టాలకు ఊరట.. తానా కోశాధికారి సేవలకు ప్రశంసలు! TAL: లండన్‌లో ఘనంగా ప్రారంభమైన TAL ప్రీమియర్ లీగ్ 2026! TANA: తానా స్వర్ణోత్సవాల్లో భాగంగా చార్లెట్‌లో ఘనంగా ‘అడాప్ట్ స్ట్రీట్’ కార్యక్రమం! India-US trade: అమెరికాలో మన మామిడిపండ్లకు భలే క్రేజ్... ధర ఎంతైనా తగ్గేదే లే! సూపర్ మార్కెట్లలో గంటల్లోనే.. H1B Visa: హెచ్-1బి వీసా అలర్ట్.. కేవలం ఈ చిన్న కారణంతో కూడా మీ దరఖాస్తుకు 'నో' చెప్పవచ్చు! ఫీజు వెనక్కి ఇవ్వరు, దరఖాస్తు కూడా రద్దు.. US Navy Jets: గగనతలంలో ఘోర ప్రమాదం... గాల్లో ముక్కలైన రెండు యుద్ధ విమానాలు!! Donald Trump: ట్రంప్ నిర్ణయంపై ఉత్కంఠ... ఇరాన్‌పై మరోసారి అమెరికా దాడులు! బతుకుదెరువు కోసం వెళ్లి బందీగా మారి.. యజమాని వేధింపులు.. ఖల్లివెల్లి కేసులో నిర్బంధం! Customs Rules: అమెరికా వెళ్లే తల్లిదండ్రులకు హెచ్చరిక... అవి లేకపోతే ఎయిర్‌పోర్టు నుండే వాపస్! TAGDV: డెలావేర్ వ్యాలీలో ఘనంగా సాగిన టిఎజిడివి ఉగాది వేడుకలు.. వెయ్యిమందికి పైగా తెలుగు వారి సందడి! TANA: గ్రామీణ ప్రజల తాగునీటి కష్టాలకు ఊరట.. తానా కోశాధికారి సేవలకు ప్రశంసలు! TAL: లండన్‌లో ఘనంగా ప్రారంభమైన TAL ప్రీమియర్ లీగ్ 2026! TANA: తానా స్వర్ణోత్సవాల్లో భాగంగా చార్లెట్‌లో ఘనంగా ‘అడాప్ట్ స్ట్రీట్’ కార్యక్రమం! India-US trade: అమెరికాలో మన మామిడిపండ్లకు భలే క్రేజ్... ధర ఎంతైనా తగ్గేదే లే! సూపర్ మార్కెట్లలో గంటల్లోనే.. H1B Visa: హెచ్-1బి వీసా అలర్ట్.. కేవలం ఈ చిన్న కారణంతో కూడా మీ దరఖాస్తుకు 'నో' చెప్పవచ్చు! ఫీజు వెనక్కి ఇవ్వరు, దరఖాస్తు కూడా రద్దు.. US Navy Jets: గగనతలంలో ఘోర ప్రమాదం... గాల్లో ముక్కలైన రెండు యుద్ధ విమానాలు!! Donald Trump: ట్రంప్ నిర్ణయంపై ఉత్కంఠ... ఇరాన్‌పై మరోసారి అమెరికా దాడులు! బతుకుదెరువు కోసం వెళ్లి బందీగా మారి.. యజమాని వేధింపులు.. ఖల్లివెల్లి కేసులో నిర్బంధం! Customs Rules: అమెరికా వెళ్లే తల్లిదండ్రులకు హెచ్చరిక... అవి లేకపోతే ఎయిర్‌పోర్టు నుండే వాపస్! TAGDV: డెలావేర్ వ్యాలీలో ఘనంగా సాగిన టిఎజిడివి ఉగాది వేడుకలు.. వెయ్యిమందికి పైగా తెలుగు వారి సందడి!

TANA: తానా స్వర్ణోత్సవాల్లో భాగంగా చార్లెట్‌లో ఘనంగా ‘అడాప్ట్ స్ట్రీట్’ కార్యక్రమం!

Telugu Association of North Amercica: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) స్వర్ణోత్సవ వేడుకలను పురస్కరించుకుని అమెరికా వ్యాప్తంగా వినూత్న కమ్యూనిటీ సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. సామాజిక బాధ్యత, పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత లక్ష్యాలతో అమెరికాలోని 50 నగరాల్లో 50 రహదారులను దత్తత తీసుకునే కార్యక్రమాన్ని ప్రారంభించింది.

Published : 2026-05-19 09:34:00

అమెరికాలో 50 నగరాల్లో 50 రహదారుల దత్తతకు తానా శ్రీకారం..

పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణకు తానా వినూత్న కార్యక్రమం..

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) స్వర్ణోత్సవ వేడుకలను పురస్కరించుకుని అమెరికా వ్యాప్తంగా వినూత్న కమ్యూనిటీ సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. సామాజిక బాధ్యత, పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత లక్ష్యాలతో అమెరికాలోని 50 నగరాల్లో 50 రహదారులను దత్తత తీసుకునే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ మహత్తర కార్యక్రమానికి చార్లెట్ నగరం వేదికైంది.

‘గుడ్ నేబర్ డే’ వేడుకల సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో తానా నాయకులతో పాటు 50 మంది చిన్నారులు, 50 మంది తల్లిదండ్రులు పాల్గొనడం విశేషంగా నిలిచింది. చిన్నారుల్లో సామాజిక బాధ్యత పెంపొందించేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అందరి ప్రశంసలు అందుకుంది.

ఈ సందర్భంగా చార్లెట్ నగరంలోని ఆర్డ్రే కెల్ & టామ్ షార్ట్ కూడలిలోని ఇరువైపుల రహదారులను తానా ప్రతినిధులు అధికారికంగా దత్తత తీసుకున్నారు. కార్యక్రమానికి హాజరైన చార్లెట్ హౌజింగ్ అండ్ నైబర్‌హుడ్ సర్వీసెస్ అధికారి జొనాధన్ హిల్ తానా చేపట్టిన సేవా కార్యక్రమాన్ని అభినందిస్తూ పలు సూచనలు చేశారు. దత్తత తీసుకున్న రహదారుల వద్ద తానా పేరుతో ప్రత్యేక బోర్డులు కూడా ఏర్పాటు చేశారు.

పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్న వారికి నిర్వాహకులు అల్పాహారం, కాఫీ, టీ అందించి ఆతిథ్యం పలికారు. ఈ సేవా కార్యక్రమాన్ని చార్లెట్ సిటీ కౌన్సిల్ మెంబర్ ఎట్ లార్జ్ డింపుల్ అజ్మీరా ప్రత్యేకంగా అభినందించారు. సమాజానికి మేలు చేసే ఇలాంటి కార్యక్రమాలు అందరికీ స్ఫూర్తిదాయకమని ఆమె పేర్కొన్నారు.

ఈ సందర్భంగా తానా అధ్యక్షుడు నరేన్ కొడాలి మాట్లాడుతూ.. తానా స్వర్ణోత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని చార్లెట్ నగరంలో ప్రారంభించడం ఆనందంగా ఉందని చెప్పారు. పాల్గొన్న ప్రతి ఒక్కరినీ ఆయన అభినందించారు.

తానా ఈవీపీ శ్రీనివాస్ లావు, కమ్యూనిటీ సర్వీస్ కోఆర్డినేటర్ సాయి బొల్లినేని కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. చార్లెట్ తానా నాయకులు నాగ పంచుమర్తి, ఠాగూర్ మల్లినేని, మాధురి ఏలూరి, కిరణ్ కొత్తపల్లి, రవి (నాని) వడ్లముడి తదితరులు ఈ కార్యక్రమం విజయవంతానికి కృషి చేశారు. సామాజిక సేవతో పాటు పర్యావరణ పరిరక్షణలోనూ తెలుగు సమాజం ముందుండాలని తానా ఈ కార్యక్రమం ద్వారా మరోసారి చాటిచెప్పింది.

Spotlight

Read More →