TAMPA: టంపాలో ఘనంగా అన్నమయ్య 618వ జయంతి ఆరాధనోత్సవాలు! తెలుగు అసోసియేషన్ ఆఫ్ ఫ్లోరిడా ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం! Gun Shooting: కెనడా లో కాల్పుల కలకలం... ఇద్దరు భారతీయ సంతతి మృతి! Trump: డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటన... ప్రపంచ రాజకీయాల్లో కొత్త ప్రకంపనలు! Strait Of Hormuz: హార్ముజ్ జలసంధిలో హై అలర్ట్... ఉపాధి కోసం వెళ్లి శవమై వస్తున్న భారతీయ నావికుడు!! USA: అమెరికాలో విషాదకర వాతావరణం.. టాంపాలో తెలుగు టెక్కీ మృతి! USA Telugu student: తల్లిదండ్రులకు తీరని శోకం.. అమెరికాలో తెలుగు యువతి దుర్మరణం! Shahnaz: మస్కట్ నరకం నుండి విముక్తి... పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు! Saudi Arabia: సౌదీ ఎడారిలో జగిత్యాల యువకుడి నరకయాతన... సీఎం ప్రవాసీ ప్రజావాణికి చేరిన బాధితుడి గోడు.. తక్షణ చర్యలకు అధికారుల ఆదేశం!! Russia: పుతిన్ హత్యకు కుట్ర.. ఎక్కువ కాలం బంకర్లోనే గడుపుతున్న రష్యా అధినేత! భద్రత మరింత కట్టుదిట్టం.. Visa Rules: అమెరికా స్టూడెంట్ వీసా నిబంధనల్లో భారీ మార్పులు - తెలుసుకోకుంటే నష్టమే! TAMPA: టంపాలో ఘనంగా అన్నమయ్య 618వ జయంతి ఆరాధనోత్సవాలు! తెలుగు అసోసియేషన్ ఆఫ్ ఫ్లోరిడా ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం! Gun Shooting: కెనడా లో కాల్పుల కలకలం... ఇద్దరు భారతీయ సంతతి మృతి! Trump: డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటన... ప్రపంచ రాజకీయాల్లో కొత్త ప్రకంపనలు! Strait Of Hormuz: హార్ముజ్ జలసంధిలో హై అలర్ట్... ఉపాధి కోసం వెళ్లి శవమై వస్తున్న భారతీయ నావికుడు!! USA: అమెరికాలో విషాదకర వాతావరణం.. టాంపాలో తెలుగు టెక్కీ మృతి! USA Telugu student: తల్లిదండ్రులకు తీరని శోకం.. అమెరికాలో తెలుగు యువతి దుర్మరణం! Shahnaz: మస్కట్ నరకం నుండి విముక్తి... పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు! Saudi Arabia: సౌదీ ఎడారిలో జగిత్యాల యువకుడి నరకయాతన... సీఎం ప్రవాసీ ప్రజావాణికి చేరిన బాధితుడి గోడు.. తక్షణ చర్యలకు అధికారుల ఆదేశం!! Russia: పుతిన్ హత్యకు కుట్ర.. ఎక్కువ కాలం బంకర్లోనే గడుపుతున్న రష్యా అధినేత! భద్రత మరింత కట్టుదిట్టం.. Visa Rules: అమెరికా స్టూడెంట్ వీసా నిబంధనల్లో భారీ మార్పులు - తెలుసుకోకుంటే నష్టమే!

TAMPA: టంపాలో ఘనంగా అన్నమయ్య 618వ జయంతి ఆరాధనోత్సవాలు! తెలుగు అసోసియేషన్ ఆఫ్ ఫ్లోరిడా ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం!

TAMPA: అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో తెలుగు సంస్కృతి, భక్తి సంప్రదాయాలను మరింత విస్తరించేందుకు తెలుగు అసోసియేషన్ ఆఫ్ ఫ్లోరిడా (TAF), టంపా బే విభాగం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనుంది. పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి 618వ జయంతి ఆరాధనోత్సవాలను ఈ నెల 16వ తేదీన ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.

Published : 2026-05-13 14:47:00

టంపా బే విభాగం ప్రత్యేక కార్యక్రమం..

అన్నమాచార్యుల వారి 618వ జయంతి..

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో తెలుగు సంస్కృతి, భక్తి సంప్రదాయాలను మరింత విస్తరించేందుకు తెలుగు అసోసియేషన్ ఆఫ్ ఫ్లోరిడా (TAF), టంపా బే విభాగం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనుంది. పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి 618వ జయంతి ఆరాధనోత్సవాలను ఈ నెల 16వ తేదీన ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.

టంపాలోని హిందూ టెంపుల్ హాల్‌లో శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. అన్నమయ్య సంకీర్తనల ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేసేలా ఈ కార్యక్రమాన్ని భక్తి భావంతో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ ఆరాధనోత్సవాల్లో పాల్గొనే భక్తులకు ఉచిత ప్రవేశంతో పాటు ఉచిత భోజన సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశారు. టంపా బే పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న తెలుగు కుటుంబాలు, అన్నమయ్య భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

కార్యక్రమం మే 16, 2026న టంపాలోని హిందూ టెంపుల్ హాల్, 5509 లిన్ రోడ్, టంపా, FL 33624 వద్ద నిర్వహించబడనుంది. భక్తి సంగీతం, అన్నమయ్య కీర్తనలు, సాంస్కృతిక కార్యక్రమాలతో వేడుకలు ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగనున్నాయి.

ఈ కార్యక్రమ నిర్వహణలో బాలా అమరావతి, విజయ పాథరు, శారదా మాంగిపూడి, శేఖర్ యెనమండ్ర, సుభద్రా గణపతిరాజు, ప్రశాంతి ఎర్రమేసెట్టి, అప్పలనాయుడు గర్భాన, సునీత మెడికొండతో పాటు TAF కమిటీ సభ్యులు చురుకుగా పాల్గొంటున్నారు.

తెలుగు సంస్కృతి, సాహిత్య వారసత్వాన్ని విదేశాల్లోని కొత్త తరాలకు పరిచయం చేయడంలో ఇటువంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని TAF వ్యవస్థాపక సభ్యులు తెలిపారు. అన్నమయ్య ఆరాధనోత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని టంపా బే ప్రాంత ప్రజలకు వారు ఆహ్వానం పలికారు.

Spotlight

Read More →