LIVE
Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  •  6G Network: భారత్‌లో 6G సంచలనం.. టెలికాం రంగం రూపురేఖలు మార్చబోతున్న కేంద్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
NRI

NRI Techie: H-1B ఒత్తిడికి గుడ్‌బై.. భారత్‌కు తిరిగి రావాలనుకుంటున్న ఎన్నారై టెక్కీ!

NRI Techie: అమెరికాలో పనిచేస్తున్న ఓ ఎన్నారై టెక్కీ తన జీవితంలో కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఏళ్ల తరబడి వీసా సమస్యలతో పోరాడుతూ అలసిపోయిన అతడు, ఇక భారత్‌కి తిరిగి రావాలని నిర్ణయించుకున్నాడు. ఈ కథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

AndhraPravasi News Desk 2 min read
NRI Techie: H-1B ఒత్తిడికి గుడ్‌బై.. భారత్‌కు తిరిగి రావాలనుకుంటున్న ఎన్నారై టెక్కీ!

ఏళ్ల తరబడి వీసా కోసం ఎదురుచూపులు.. భారత్ కు తిరుగు పయనం.. 

వైరల్ అయిన ఎన్నారై టెక్కీ సోషల్ మీడియా పోస్ట్.. 

అమెరికాలో పనిచేస్తున్న ఓ ఎన్నారై టెక్కీ తన జీవితంలో కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఏళ్ల తరబడి వీసా సమస్యలతో పోరాడుతూ అలసిపోయిన అతడు, ఇక భారత్‌కి తిరిగి రావాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని అతడు సోషల్ మీడియాలో పంచుకోవడంతో, నెట్‌జన్ల మధ్య చర్చకు దారి తీసింది.

వీసా ఒత్తిడే కారణం 
H-1B వీసా పై గత 5 సంవత్సరాలుగా పనిచేస్తూ, అంతకుముందు 3 సంవత్సరాలు OPTలో ఉన్న ఈ టెక్కీకి అమెరికాలో మొత్తం 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. అయినప్పటికీ, ఆర్థికంగా ఇంకా స్థిరపడలేక పోయానని, ముఖ్యంగా వీసా ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నానని అతడు తెలిపాడు.

“ఇక ఈ వీసా స్ట్రెస్‌ను భరించలేను. ఎంత పని చేసినా ముందుకు వెళ్తున్నాననే భావన లేదు,” అంటూ తన బాధను వ్యక్తం చేశాడు.ఈ ఏడాది ఏప్రిల్‌లో భారత్‌కు తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు.

అయితే భారత్‌కు వెళ్లిన తర్వాత సాధారణ 9-5 ఉద్యోగం చేయాలనే ఆసక్తి లేదని స్పష్టం చేశాడు. “కొత్తగా జీవితాన్ని ఎలా నిర్మించుకోవాలి?” అనే సందేహంతో ఇతరుల సలహాలు కోరాడు.

ఈ పోస్ట్‌కు సోషల్ మీడియాలో విభిన్న స్పందనలు వచ్చాయి. కొందరు ముందుగా మంచి సేవింగ్స్ ఉండాలని సూచిస్తే, మరికొందరు భారత్‌లో సెటిల్ అవ్వడం అంత సులభం కాదని చెప్పారు.

ఒకరు “కనీసం 4-5 కోట్ల లిక్విడ్ ఆస్తి ఉంటేనే రావడం మంచిది” అని సూచించగా, మరో వ్యక్తి “అమెరికా నుంచి 12 ఏళ్ల తర్వాత వచ్చాను.. అలవాటు పడటానికి సమయం పడుతుంది” అని తెలిపాడు.

మరో నెటిజన్ “టెక్ ఫీల్డ్‌లో ఉంటే మీ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకుని కొత్త అవకాశాలు వెతకండి” అని సలహా ఇచ్చాడు. ఇంకొకరు కుటుంబ జీవితం, ట్రావెల్ వంటి విషయాలు ఒత్తిడిని తగ్గించవచ్చని సూచించారు.

ఈ ఘటన ఒక వ్యక్తి కథ మాత్రమే కాదు, విదేశాల్లో పనిచేస్తున్న అనేక మంది ఎన్నారైల పరిస్థితిని తెలియచేస్తుంది. బయటకు కనిపించే సౌకర్యాల వెనుక, వీసా సమస్యలు, ఒత్తిడి ఎంతగా ఉంటాయో ఈ సంఘటన చెబుతోంది.

చివరగా, తనకు తెలియని మార్గంలో అడుగులు వేయడానికి సిద్ధంగా ఉన్నానని, “కొన్ని నిర్ణయాలు భయం కలిగించినా, అవే మన జీవితాన్ని మార్చగలవు” అనే భావనతో ముందుకు సాగుతున్నానని ఆ టెక్కీ వివరించాడు.

Be the first to react

More Coverage

TCA: టీ‌సీఏ స్వర్ణోత్సవ వేడుకలకు నృత్య కళాకారుల ఆహ్వానం.. ‘స్వాగత గీతం’, ‘స్వర్ణ వైభవం’ కోసం దరఖాస్తుల స్వీకరణ!

TCA: టీ‌సీఏ స్వర్ణోత్సవ వేడుకలకు నృత్య కళాకారుల ఆహ్వానం.. ‘స్వాగత గీతం’, ‘స్వర్ణ వైభవం’ కోసం దరఖాస్తుల స్వీకరణ!

TCA: అమెరికాలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తున్న హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమి…