LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
NRI

Germanay: జర్మనీలో ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో.. ఉత్సాహంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు!

Germany: జర్మనీలోని హాంబర్గ్, మరియు ఫ్రాంక్ఫర్ట్ నగరాల్లోఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాన్ని ఎన్‌ఆర్‌ఐ టీడీపీ, హాంబర్గ్, జర్మనీ ఆధ్వర్యంలో నిర్వహించారు.

AndhraPravasi News Desk 2 min read
Germanay: జర్మనీలో ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో.. ఉత్సాహంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు!

నాలుగు దశాబ్దాల రాజకీయ ప్రయాణం పై ప్రత్యేక వీడియో..

జర్మనీలోని హాంబర్గ్ మరియు ఫ్రాంక్ఫర్ట్ నగరాల్లో..

జర్మనీలోని హాంబర్గ్ నగరంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాన్ని ఎన్‌ఆర్‌ఐ టీడీపీ, హాంబర్గ్, జర్మనీ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమం జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమై, “మా తెలుగు తల్లికి మల్లెపూదండ” పాటతో సాంస్కృతిక వాతావరణం నెలకొంది.

చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన నాలుగు దశాబ్దాల రాజకీయ ప్రయాణం, ముఖ్య ఘట్టాలు, అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలపై ప్రత్యేక వీడియో ప్రదర్శించారు. ఆ వీడియో ద్వారా చంద్రబాబు తీసుకొచ్చిన మార్పులను పాల్గొన్నవారు గుర్తు చేసుకున్నారు.

అమరావతిని ఆంధ్రుల రాజధానిగా గుర్తించేలా కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకురావడంలో చంద్రబాబు చేసిన కృషిని వక్తలు ప్రత్యేకంగా కొనియాడారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో ఆయన పాత్ర ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ప్రముఖ జర్నలిస్ట్ శ్రీనివాస్ ప్రసాద్ రచించిన “చంద్రబాబు నాయుడు X.0” పుస్తకాన్ని జర్మన్, ఫ్రెంచ్ భాషల్లో అనువదించి ప్రతులను పంపిణీ చేశారు. జర్మన్ అనువాద పుస్తకాలను అక్కడి ప్రధాన నగరాల్లోని గ్రంథాలయాల్లో అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నామని నిర్వాహకులు టిట్టు మద్దిపట్ల, శివశంకర్ లింగం తెలిపారు.

హాంబర్గ్ టీడీపీ బృందం నుండి డాక్టర్ శివశంకర్ లింగం, శశిధర్ ఏమిరెడ్డి, విక్రమ్ తల్లపనేని, దినేష్ పాకలపాటి, కిషోర్ దాసుగారి, శ్రీకాంత్ గోళ్ళ, రాజా పులిచర్ల, శివ కోలా, చైతన్య యలమంచి, యాగేష్, నాగేంద్ర కూతురు, వఝల చాణక్య, భరత్ శీలంనేని, లక్ష్మీ పెర్నీడు బొల్లెంపల్లి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. హిల్దిస్ హైం, బ్రిమెన్ నగరాల నుండి కూడా పలువురు ప్రతినిధులు హాజరయ్యారు.

ఇక ఫ్రాంక్ఫర్ట్ నగరంలో కూడా చంద్రబాబు జన్మదిన వేడుకలు పండుగ వాతావరణంలో జరిగాయి. కేక్ కట్ చేసి, బెలూన్లు ఎగురవేస్తూ ఆనందంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమాన్ని పవన్ కుర్ర, సుమంత్ కొర్రపాటి సమన్వయం చేశారు.

ఈ సందర్భంగా జర్మన్ తెలుగుదేశం నాయకుడు శ్రీకాంత్ కుడితిపూడి మాట్లాడుతూ చంద్రబాబు గొప్ప దార్శనికుడు, దేశం గర్వించదగ్గ నాయకుడు అని కొనియాడారు. రాష్ట్ర విభజన తర్వాత కష్టాల్లో పడిన తెలుగు జాతిని తిరిగి అభివృద్ధి దిశగా నడిపించేందుకు ఆయన నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు తీసుకురావడం ద్వారా ఉద్యోగ అవకాశాలు పెంచుతున్నారని అన్నారు.

పవన్ కుర్ర మాట్లాడుతూ దేశ అత్యున్నత పదవులైన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అభ్యర్థుల ఎంపికలో కూడా చంద్రబాబు కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. మొత్తంగా జర్మనీలోని తెలుగు ప్రజలు చంద్రబాబు జన్మదినాన్ని ఉత్సాహంగా, గౌరవంగా జరుపుకుని తమ అభిమానాన్ని చాటుకున్నారు.

Be the first to react

More Coverage

TCA: టీ‌సీఏ స్వర్ణోత్సవ వేడుకలకు నృత్య కళాకారుల ఆహ్వానం.. ‘స్వాగత గీతం’, ‘స్వర్ణ వైభవం’ కోసం దరఖాస్తుల స్వీకరణ!

TCA: టీ‌సీఏ స్వర్ణోత్సవ వేడుకలకు నృత్య కళాకారుల ఆహ్వానం.. ‘స్వాగత గీతం’, ‘స్వర్ణ వైభవం’ కోసం దరఖాస్తుల స్వీకరణ!

TCA: అమెరికాలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తున్న హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమి…