NRI TDP: గ్లోబల్ కమిటీ ప్రమాణ స్వీకారం సెప్టెంబర్ 9న! అభివృద్ధిలో NRI ల భాగస్వామ్యం పెంచాలి - అధ్యక్షులు పల్లా శ్రీనివాస్!
NRI TDP: ప్రపంచవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలను మరింత బలోపేతం చేసే దిశగా కొత్తగా ఏర్పాటు చేసిన ఎన్‌ఆర్‌ఐ టీడీపీ కేంద్ర కమిటీ త్వరలో బాధ్యతలు స్వీకరించనుంది. నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని సెప్టెంబర్ 9న మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించనున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు.
మంగళగిరి ఎన్టీఆర్ భవన్‌లో ఘనంగా కార్యక్రమం.. ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు..
నారా లోకేశ్ చేతుల మీదుగా నూతన కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం..
అధ్యక్షుడిగా పిల్ గురు రాజా.. మొత్తం 44 మందితో కొత్త కార్యవర్గం..
మంగళగిరి: ప్రపంచవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలను మరింత బలోపేతం చేసే దిశగా కొత్తగా ఏర్పాటు చేసిన ఎన్‌ఆర్‌ఐ టీడీపీ కేంద్ర కమిటీ త్వరలో బాధ్యతలు స్వీకరించనుంది. నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని సెప్టెంబర్ 9న మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించనున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు.
ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుంది. పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
44 మందితో నూతన కార్యవర్గం
ఎన్‌ఆర్‌ఐ టీడీపీ నూతన అధ్యక్షుడిగా పిల్ గురు రాజా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయనతో పాటు మొత్తం 44 మందితో నూతన కేంద్ర కమిటీ ఏర్పాటవుతోంది. పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ నూతన కేంద్ర కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రత్యేక అతిథులుగా కార్యక్రమానికి హాజరుకానున్నారు.
ప్రపంచవ్యాప్తంగా టీడీపీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యం
వివిధ దేశాల్లో పనిచేస్తున్న ఎన్‌ఆర్‌ఐ టీడీపీ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకోవడమే కొత్త కేంద్ర కమిటీ ప్రధాన లక్ష్యంగా పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారిని టీడీపీతో మరింత అనుసంధానం చేయడంతో పాటు.. రాష్ట్ర అభివృద్ధిలో ప్రవాసాంధ్రుల భాగస్వామ్యాన్ని పెంచేందుకు కమిటీ చురుకైన పాత్ర పోషించనుంది.
టీడీపీ విధానాలను ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లేలా..
టీడీపీ సిద్ధాంతాలు, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి చేరువ చేయడంపై నూతన కమిటీ దృష్టి పెట్టనుంది.
విదేశాల్లోని ఎన్‌ఆర్‌ఐలతో పార్టీకి ఉన్న సంబంధాలను మరింత బలోపేతం చేయడం, వారి సమస్యలను సమన్వయంతో పరిష్కరించేందుకు సహకరించడం, రాష్ట్ర ప్రగతిలో వారి భాగస్వామ్యాన్ని పెంచడం వంటి అంశాల్లో ఎన్‌ఆర్‌ఐ టీడీపీ కీలకంగా వ్యవహరించనుంది.
విదేశాల్లో ఉన్న పార్టీ నాయకత్వం, కార్యకర్తలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి సమన్వయంతో పనిచేసేలా కొత్త కేంద్ర కమిటీ కార్యాచరణ రూపొందించనుంది. సెప్టెంబర్ 9న జరిగే ప్రమాణ స్వీకారంతో ఎన్‌ఆర్‌ఐ టీడీపీ కార్యకలాపాలకు కొత్త దిశ ఏర్పడుతుందని పార్టీ నాయకత్వం భావిస్తోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు.





Tags
Be the first to react