LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
NRI

NATS: పిట్స్‌బర్గ్‌లో నాట్స్ ‘వావ్ మామ్స్ అండ్ వండర్ కిడ్స్’ వేడుకలు!

North America Telugu Society (NATS): ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) పిట్స్‌బర్గ్ విభాగం మరో ప్రత్యేక కార్యక్రమంతో ముందుకొస్తోంది. మాతృత్వానికి గౌరవం తెలుపుతూ, చిన్నారుల ప్రతిభను వెలుగులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ‘వావ్ మామ్స్ అండ్ వండర్ కిడ్స్’ అనే వినూత్న వేడుకలను ఘనంగా నిర్వ…

AndhraPravasi News Desk 1 min read
NATS: పిట్స్‌బర్గ్‌లో నాట్స్ ‘వావ్ మామ్స్ అండ్ వండర్ కిడ్స్’ వేడుకలు!

వావ్ మామ్స్ అండ్ వండర్ కిడ్స్ వేడుకలు..

తల్లుల త్యాగాలు, సేవలను గుర్తుచేసుకుంటూ..

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) పిట్స్‌బర్గ్ విభాగం మరో ప్రత్యేక కార్యక్రమంతో ముందుకొస్తోంది. మాతృత్వానికి గౌరవం తెలుపుతూ, చిన్నారుల ప్రతిభను వెలుగులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ‘వావ్ మామ్స్ అండ్ వండర్ కిడ్స్’ అనే వినూత్న వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. తెలుగు కుటుంబాల మధ్య ఆత్మీయతను పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశంగా నిర్వాహకులు తెలిపారు.

ఈ వేడుకలను ఏప్రిల్ 26, 2026 మరియు మే 09, 2026 తేదీల్లో నిర్వహించనున్నారు. తల్లుల త్యాగాలు, సేవలను గుర్తుచేసుకుంటూ వారికి ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతో పాటు, పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు వివిధ రకాల పోటీలు కూడా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా తల్లులు–పిల్లల మధ్య బంధాన్ని మరింత బలపరచాలనే ఉద్దేశంతో ప్రత్యేక ఆకర్షణలతో ప్రణాళిక రూపొందించారు.

ఈ వేడుకల కోసం ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల, ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి మార్గదర్శకత్వంలో పిట్స్‌బర్గ్ సమన్వయకర్తలు రవి కొండపి, శిల్పా బోయినతో పాటు స్థానిక టీమ్ సభ్యులు సమిష్టిగా కృషి చేస్తున్నారు. బోర్డ్ అండ్ ఈసీ (BOD & EC) ప్రతినిధులు అనుదీప్ అర్ల, రవి తుమ్మల ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ ఏర్పాట్లను సమన్వయం చేస్తున్నారు.

పిట్స్‌బర్గ్ మరియు పరిసర ప్రాంతాల్లోని తెలుగు కుటుంబాలందరూ ఈ వేడుకల్లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాట్స్ ప్రతినిధులు కోరారు. మరిన్ని వివరాల కోసం +1-888-483-5848 నంబర్ కు సంప్రదించవచ్చని తెలిపారు. అలాగే సంస్థ అధికారిక వెబ్‌సైట్ www.natsworld.org ను సందర్శించి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చని సూచించారు.

మాతృత్వాన్ని సెలబ్రేట్ చేస్తూ, చిన్నారుల ప్రతిభను ప్రోత్సహించే ఈ కార్యక్రమం పిట్స్‌బర్గ్ తెలుగు సమాజంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

Be the first to react

More Coverage

TCA: టీ‌సీఏ స్వర్ణోత్సవ వేడుకలకు నృత్య కళాకారుల ఆహ్వానం.. ‘స్వాగత గీతం’, ‘స్వర్ణ వైభవం’ కోసం దరఖాస్తుల స్వీకరణ!

TCA: టీ‌సీఏ స్వర్ణోత్సవ వేడుకలకు నృత్య కళాకారుల ఆహ్వానం.. ‘స్వాగత గీతం’, ‘స్వర్ణ వైభవం’ కోసం దరఖాస్తుల స్వీకరణ!

TCA: అమెరికాలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తున్న హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమి…