NATS: న్యూజెర్సీలో నాట్స్ ఆధ్వర్యంలో భారీ ఉచిత వైద్య శిబిరం! TAJA: అమెరికాలో వెలుగొందిన తెలుగు సంస్కృతి! జాక్సన్‌విల్లేలో ఘనంగా ‘తాజా’ ఉగాది వేడుకలు!    H1B Visa: అమెరికా హెచ్-1బీ వీసా... 38 శాతం పడిపోయిన రిజిస్ట్రేషన్లు! H1B Visa: హెచ్-1బీ టెక్కీలకు 60 రోజుల డెడ్‌లైన్... గడువు లోగా స్పాన్సర్ దొరకకపోతే దేశం విడవాల్సిందే!! America Updates: అమెరికాను వణికిస్తున్న ద్రవ్యోల్బణం.. చుక్కలనంటుతున్న ధరలు.. గడిచిన 12 నెలల్లో.. ఆందోళనలో ప్రజలు! Donald Trump: ట్రంప్‌కు సొంత పార్టీలో భారీ షాక్.. ఇరాన్‌పై యుద్ధ అధికారాలకు కళ్లెం! 55-45 ఓట్ల తేడాతో.. TANA: గ్రామీణ ప్రజల తాగునీటి కష్టాలకు ఊరట.. తానా కోశాధికారి సేవలకు ప్రశంసలు! TAL: లండన్‌లో ఘనంగా ప్రారంభమైన TAL ప్రీమియర్ లీగ్ 2026! TANA: తానా స్వర్ణోత్సవాల్లో భాగంగా చార్లెట్‌లో ఘనంగా ‘అడాప్ట్ స్ట్రీట్’ కార్యక్రమం! India-US trade: అమెరికాలో మన మామిడిపండ్లకు భలే క్రేజ్... ధర ఎంతైనా తగ్గేదే లే! సూపర్ మార్కెట్లలో గంటల్లోనే.. NATS: న్యూజెర్సీలో నాట్స్ ఆధ్వర్యంలో భారీ ఉచిత వైద్య శిబిరం! TAJA: అమెరికాలో వెలుగొందిన తెలుగు సంస్కృతి! జాక్సన్‌విల్లేలో ఘనంగా ‘తాజా’ ఉగాది వేడుకలు!    H1B Visa: అమెరికా హెచ్-1బీ వీసా... 38 శాతం పడిపోయిన రిజిస్ట్రేషన్లు! H1B Visa: హెచ్-1బీ టెక్కీలకు 60 రోజుల డెడ్‌లైన్... గడువు లోగా స్పాన్సర్ దొరకకపోతే దేశం విడవాల్సిందే!! America Updates: అమెరికాను వణికిస్తున్న ద్రవ్యోల్బణం.. చుక్కలనంటుతున్న ధరలు.. గడిచిన 12 నెలల్లో.. ఆందోళనలో ప్రజలు! Donald Trump: ట్రంప్‌కు సొంత పార్టీలో భారీ షాక్.. ఇరాన్‌పై యుద్ధ అధికారాలకు కళ్లెం! 55-45 ఓట్ల తేడాతో.. TANA: గ్రామీణ ప్రజల తాగునీటి కష్టాలకు ఊరట.. తానా కోశాధికారి సేవలకు ప్రశంసలు! TAL: లండన్‌లో ఘనంగా ప్రారంభమైన TAL ప్రీమియర్ లీగ్ 2026! TANA: తానా స్వర్ణోత్సవాల్లో భాగంగా చార్లెట్‌లో ఘనంగా ‘అడాప్ట్ స్ట్రీట్’ కార్యక్రమం! India-US trade: అమెరికాలో మన మామిడిపండ్లకు భలే క్రేజ్... ధర ఎంతైనా తగ్గేదే లే! సూపర్ మార్కెట్లలో గంటల్లోనే..

NATS: న్యూజెర్సీలో నాట్స్ ఆధ్వర్యంలో భారీ ఉచిత వైద్య శిబిరం!

NATS: అమెరికాలోని ప్రవాస తెలుగు సమాజానికి సేవలందిస్తూ ముందంజలో ఉన్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) మరోసారి తన సేవాభావాన్ని చాటుకుంది.

Published : 2026-05-23 14:51:00

మహిళలు, వృద్ధుల కోసం ఉచిత వైద్య సేవలు అందిస్తున్న నాట్స్..

ప్రముఖ వైద్యులతో నాట్స్ ఉచిత ఆరోగ్య శిబిరం..

అమెరికాలోని ప్రవాస తెలుగు సమాజానికి సేవలందిస్తూ ముందంజలో ఉన్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) మరోసారి తన సేవాభావాన్ని చాటుకుంది. “భాషే రమ్యం… సేవే గమ్యం” అనే నినాదంతో నాట్స్, న్యూజెర్సీలోని సాయి దత్త పీఠం శ్రీ శివ విష్ణు టెంపుల్ సంయుక్త ఆధ్వర్యంలో భారీ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించనుంది. మహిళలు, పురుషులు, వృద్ధులను దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేస్తున్న ఈ మెడికల్ క్యాంప్ మే 23, 2026 శనివారం నాడు ఎడిసన్ నగరంలో జరగనుంది.

ప్రవాస తెలుగు ప్రజలకు ఆరోగ్య సేవలు అందించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం స్థానికంగా విశేష స్పందన పొందుతోంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగే ఈ వైద్య శిబిరం SDP SSVT NJ, 1665 ఓక్ ట్రీ రోడ్, సూట్ #370, ఎడిసన్, న్యూ జర్సీ లో నిర్వహించనున్నారు.

ఈ శిబిరంలో వివిధ వైద్య విభాగాలకు చెందిన నిపుణులు పాల్గొని ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సలహాలు అందించనున్నారు. ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజీ నిపుణులు డాక్టర్ జనార్ధన్ బొల్లు, ఫ్యామిలీ మెడిసిన్ నిపుణులు డాక్టర్ స్మిత, అలాగే FNP-BC నిపుణురాలు బీనా లోపెజ్ సేవలు అందించనున్నారు.

ప్రవాస భారతీయులు ముఖ్యంగా ఆరోగ్య పరీక్షలను నిర్లక్ష్యం చేయకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు. ఆరోగ్య అవగాహన పెంపొందించడంతో పాటు, ప్రారంభ దశలోనే సమస్యలను గుర్తించి చికిత్స పొందేందుకు ఇలాంటి శిబిరాలు ఎంతో ఉపయోగపడతాయని వారు పేర్కొన్నారు.

ఈ హెల్త్ క్యాంప్‌ను నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల, నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి పర్యవేక్షణలో నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, ఎగ్జిక్యూటివ్ కమిటీ, న్యూజెర్సీ చాప్టర్ టీమ్ మరియు అడ్వైజరీ కమిటీ సభ్యులు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. కార్యక్రమం విజయవంతం కోసం వాలంటీర్లు కూడా ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు.

వైద్య శిబిరానికి సంబంధించిన వివరాలు లేదా రిజిస్ట్రేషన్ కోసం మురళీకృష్ణ మేడిచర్ల (973-670-0578), బిందు యలమంచిలి (908-240-3167), కిరణ్ మందాడి (732-491-1776), శ్రీనివాస్ మెంతా (908-230-5390)లను సంప్రదించవచ్చని నిర్వాహకులు తెలిపారు. అదేవిధంగా అత్యవసర సమాచారం కోసం నాట్స్ హెల్ప్‌లైన్ నంబర్లు +1-888-4-TELUGU లేదా +1-888-483-5848 అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.

Spotlight

Read More →